You Are Here: Home » చిన్నారి » కవితలు » నిజం చెప్పనా…!

నిజం చెప్పనా…!

నిజం చెప్పనా-!
నిజం చెబితే నీ చెవులు భరించగలవా?
అన్నార్తుల హాహాకారాలు-ఆక్రందనలు
రాజకీయుల దోపిడీలు-
అందమైన ఎరలు-
భరించగలవా! సహించగలవా!

నీకు తెలియనివి- నిన్ను తెలుసుకోలేనివి-
నిన్న గుర్తుకు రానిది- నేడు ఏం జరుగుతున్నదీ…
అసలు పట్టించుకుంటే…
మొదటికే ఎసరొస్తుదనీ…
ఏం జరిగినా- ఎన్ని జరుగుతున్నా-
తల వంచుకు- తల దించుకు-
వెళ్ళిపోక తప్పదు నేస్తం!

నిన్ను నీవు దహించుకునే నిజాలు-
ఎదుటివాడిని సహించలేని వాస్తవాలు-
నిద్దట్లో ఉలిక్కి పడే అరాచకాలు-
మనిషి, మనిషికీ ఇలాగే ఎందుకూ-
జగతిలో ఏ జంతువుకూ లేదే ఇలా-
తపించుట కన్నా- నిన్ను నీవే-
శపించుకో నాన్నా-!

అప్పటికీ మారకపోతే-
ఎప్పటికీ ఇలానే జరుగుతుంటే
ఒక్కసారే ప్రళయం రావాలని-
ప్రకృతిని వరం ప్రసాదించమను-
మళ్ళీ మొదటినుంచి కొత్త జగాన్ని ప్రారంభించమనూ..!

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top