You Are Here: Home » చిన్నారి » తెలుసా...!! » నిఘాలో మేటి

నిఘాలో మేటి

Untitaదేశంలోపల, వెలుపల అంతర్గత, బహిర్గత శత్రువుల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు ఆయా కుట్రలను తెలుసుకునేందుకు, వాటిని భగ్నం చేసేం దుకు ప్రభుత్వ నిఘా సంస్థలు ప్రయత్నిస్తుం టారుు. చాలా సందర్భాల్లో ఇవి నిర్వహించే కార్యకలాపాలేవీ కూడా కొన్నేళ్ళ పాటు వెలుగులోకి రావు. ప్రచ్ఛన్న యుద్ధం రోజుల్లో అమెరికా, సోవియట్‌ యూనియన్‌ల నిఘాసంస్థల కార్యకలాపాలు ఇప్పటికీ ఎంతో ఆసక్తిదాయకంగానే ఉంటారుు. సిఐఏ వివిధ దేశాల్లో చేపట్టిన కార్యకలాపాలు మరీ ముఖ్యంగా క్యూబా నేత ఫిడెల్‌ కాస్ట్రోను హతమార్చేందుకు చేసిన ప్రయత్నాలు హాలీవుడ్గ సినిమాల ను తలపించేవిలా ఉంటారుు. యావత్‌ ప్రపంచంలోనూ కొన్ని దేశాల నిఘా సంస్థలు బాగా ప్రసిద్ధి చెందారుు. అలాంటి సంస్థలపై కలర్స్‌ ప్రత్యేక కథనం…

ఐఎస్‌ఐ (పాకిస్తాన్‌)
విదేశాల్లో పలు ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రత్యక్ష ప్రమేయం కలిగి ఉందన్న ఆరోపణలు పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐపై ఉన్నాయి. పలు దేశాల ఉగ్రవాదులతో దీనికి సన్నిహిత సంబంధాలున్నా యన్న విమర్శలు ఉన్నాయి. భారత్‌ తదితర దేశాల్లో ఉగ్రవాదం పెచ్చుమీరడానికి ఈ సంస్థ కూడా కారణమనే ఆరోపణలున్నాయి. పాకిస్తాన్‌ దృష్టితో చూసినప్పుడు ఈ సంస్థ చాలానే విజయాలు సాధించింది. 1948లో ఈ సంస్థ ఏర్పాటైంది. మధ్య ఆసియాలో సోవియట్‌ నిఘా సంస్థ కేజీబీని దెబ్బ తీయగలిగింది. చట్టాలకు అతీతంగా పని చేయడంలో ఈ సంస్థ పేరొందింది. సైన్యం తరువాత అంతటి బలమైన విభాగంగా ఇది పేరొందింది.

మొసాద్‌ (ఇజ్రాయెల్‌)
అవసరమైన పక్షంలో పారామిలిటరీ కార్యకలాపాలు నిర్వర్తించడంతో సహా నిఘా సమాచారం సేకరించడం దీని విధి. సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ కో-ఆర్డినేషన్‌ గా ఇది 1949 డిసెంబర్‌ 13న ఏర్పడింది. ఇందులో సుమారు 1200 మంది పని చేస్తుంటారు. ప్రధాని నియంత్రణలో ఇది పని చేస్తుంటుంది. ఇది గాకుండా ఇజ్రాయెల్‌లో అమన్‌ (మిలిటరీ ఇంటెలిజెన్స్‌), షిన్‌ బెట్‌ (అంతర్గత నిఘా) కూడా పని చేస్తున్నాయి. అత్యధిక విజయాలు సాధించిన నిఘా సంస్థల్లో ఇదొకటి. మ్యూనిచ్‌లో 1972 ఒలింపిక్‌ గేమ్స్‌ సందర్భంగా ఇజ్రాయేలీ క్రీడాకారుల్ని పాలస్తీనా ఉగ్రవాదులు హతం చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవడంలో ఇది విజయం సాధించింది. పలు సందర్భాల్లో ఇది అమెరికా నిఘా సంస్థ సీఐఏకు సహకరిస్తూ ఉంటుంది.

ఎం1-6 (యునైటెడ్‌ కింగ్‌డమ్‌)
ప్రపంచంలో దృష్టిలో అత్యంత సమర్థవంతమైన నిఘా సంస్థగా స్థాయికి మించిన ప్రచారం పొందిన సంస్థల్లో ఇదొకటి. సంస్థపై ఉన్న కల్పిత విజయ గాధలు, జేమ్స్‌బాండ్‌ లాంటి సినిమాలు ఇందుకు కారణం కావ చ్చు. బాగా పాత తరపు నిఘా సంస్థల్లో ఇది ఒకటి. 1909లోనే ఇది సీక్రె ట్‌ సర్వీస్‌ బ్యూరోగా ఏర్పడింది. ప్రచ్చన్న యుద్ధకాలం లో సూపర్‌సానిక్‌ విమానాల తయారీకి సంబంధించి మార్పు చేసిన పత్రాలతో సోవియట్‌ యూనియన్‌ నిఘాసంస్థ కేజీబీకి ఇది కుచ్చుటోపీ పెట్టినట్లు చెబుతారు.

సీఐఏ (అమెరికా)
యావత్‌ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నిఘా సంస్థల్లో ఇది ఒకటి. అధికారికంగా ఇందులో సుమారు పాతిక వేలమంది పని చేస్తున్నప్పటికీ, అనధికారికంగా విధులు నిర్వహించే వారి సంఖ్య కూడా బాగానే ఉంటుంది. అమెరికా విధానాలను ప్రభావితం చేయగల ఇతర దేశాల సమాచారాన్ని ఇది సేకరిస్తుంటుంది. దేశాధ్యక్షుడి ఆదేశాలకు అనుగుణంగా కోవర్ట్‌ కార్యకలాపాలను కూడా ఇది చేపడుతుంది. విదేశీ ప్రభుత్వాలు, సంస్థలు, ఉగ్రవాదం తదితర పలు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఇది సేకరిస్తుంది. ఇంతగా పేరొందినా, గత తొమ్మిదేళ్ళలో అల్‌కైదాకు చెందిన అగ్రశ్రేణి ఉగ్రవాదిని సొంతంగా పట్టుకోలేక పోయింది. పదిక్షల మంది సోవియట్‌ సైనికులు ఆఫ్ఘని స్థాన్‌ లోకి ప్రవేశించినా గుర్తించలేకపో యింది. అత్యంత భారీగా నిధులు పొందే సంస్థ, అత్యంత అధునాతన నిఘా వ్యవస్థలు కలిగిన సంస్థగా ఇది పేరొందింది.

ఎంఎస్‌ఎస్‌ (చైనా)
మినిస్ట్రీ ఆఫ్‌ స్టేట్‌ సెక్యూరిటీ (ఎంఎస్‌ఎస్‌) అనేది చైనా నిఘా సంస్థ. బిహ ర్గత నిఘా వ్యవహారాలతో పాటుగా అంతర్గత నిఘాను కూడా పర్యవేక్షి స్తుంటుంది. దీని సిబ్బందికి పోలీసు అధికారాలు కూడా ఉండడం ఓ విశే షం. చైనా మెయిన్‌ల్యాండ్‌కు వెలుపల ఉన్న చైనా భూభాగాలైన హాం కాంగ్‌, మకావు, తైవాన్‌ ప్రాంతాల్లో చైనా నిఘా సిబ్బంది అధికంగా పని చేస్తుంటారు. అధికారిక హోదా లేకుండా చైనీయులు, చైనా సంతతి వారు వివిధ దేశాల్లో సంస్థ తరఫున పని చేస్తుంటారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, బ్యాంకర్లు లాంటివారెందరో వివిధ దేశాల్లో తమ పనులు చేసుకుంటూనే ఈ సంస్థకు సహకరిస్తుంటారు. ఒక దశలో చైనా ఈవిధంగా పని చేస్తున్న 120 మందిని తిరిగి స్వదేశానికి రప్పించుకుంది. ఆయా దేశాల్లో వీరిపై నిఘా ఏర్పడడం కూడా అందుకు కారణం కావచ్చు.

(జర్మనీ)
జర్మనీ నిఘా సంస్థ బీఎన్‌డీ నేరుగా దేశాధ్యక్షుడి (చాన్సలర్‌) నియంత్రణలో పని చేస్తుంది. విదేశాల నుంచి జర్మనీకి ముప్పు వాటిల్లే అవకాశాలను తొలిగా అందించే వ్యవస్థగా ఇది రూపు దిద్దుకుంది. 1956 ఏప్రిల్‌ 1న దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 6,050 మంది పని చేస్తున్నారు. వైర్‌ ట్యాపింగ్‌, ఇతరత్రా అధునాతన నిఘా ఏర్పాట్లపై ఇది అధికంగా ఆధారపడు తుంది. అంతర్జాతీయ ఉగ్రవాదం, టెక్నాలజీ అక్రమ బదిలీ, వ్యవస్థీకృత నేరాలు, ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీ లాండరింగ్‌, అక్రమ వలసలు లాంటి అంశాలపై ఇది పని చేస్తుంది. సైనిక, పౌర నిఘా వ్యవహారాలు దీని పరిధిలో ఉంటాయి.

డీజీఎస్‌ఈ (ఫ్రాన్స్‌)
డైరెక్టరేట్‌ జనరల్‌ ఫర్‌ ఎక్స్‌టర్నల్‌ సెక్యూరిటీ పేరిట ఫ్రాన్స్‌ తన బహిర్గత నిఘా సంస్థను ఏర్పాటు చేసింది. 1982 ఏప్రిల్‌ 2న దీన్ని నెకొల్పారు. ఫ్రెంచ్‌ రక్షణ శాఖ పరిధిలో ఇది పని చేస్తుంది. పలు దేశాల నిఘా సంస్థలతో పోలిస్తే ఇది బాగా ఆలస్యంగా ఏర్పడినట్లే. ఇందులో సుమారు ఐదు వేల మంది పని చేస్తున్నారు. సైనిక, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ఇది విదేశాల నుంచి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి అందిస్తుంది.

రా (భారత్‌)
Logaరీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ అనేది భారతదేశ నిఘా సంస్థ. 1968లో దీన్ని నెలకొల్పారు. చైనాతో, పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాల అనంతరం విదేశీ అంశాల్లో సరైన నిఘా సమా చారం కొరవడిందన్న ఉద్దేశంతో దీన్ని రూపొందించారు. ప్రధానంగా ఇది విదేశీ వ్యవహా రాలు, కౌంటర్‌ టెర్రరిజం, కోవర్ట్‌ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. విదేశీ ప్రభు త్వాలు, సంస్థలు, విదేశీయులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూ ప్రభుత్వానికి తగు సూచనలను అందిస్తుంది. దీన్ని ఏర్పాటు చేయముందు అంతర్గత, బహిర్గత నిఘా …రెండింటీనీ ఇంటెటిజెన్స్‌ బ్యూరోనే నిర్వహిస్తుండేది. ‘రా’ ఏర్పాటుతో ఇంటెలిజెన్స్‌ బ్యూరో అంతర్గత నిఘాకు పరిమితమైంది.

ఏఎస్‌ఐఎస్‌ (ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియన్‌ సీక్రెట్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ అనేది ఆస్ట్రేలియా ప్రభుత్వ నిఘా సంస్థ. విదేశాల్లో నిఘా కార్యకలాపాలు, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌, విదేశీ నిఘా సంస్థలతో సహకారం లాంటివి దీని పరిధిలోకి వస్తాయి. రెండు దశాబ్దాల పాటు దీని ఉనికి ప్రభుత్వంలోనే అత్యంత రహస్యంగా ఉండింది. 1952 మే 13న దీన్ని నెలకొల్పారు. దీని బడ్జెట్‌ సుమారుగా 200 మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్ల వరకూ ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top