You Are Here: Home » ఇతర » నిగనిగలాడే నగలు

నిగనిగలాడే నగలు

ఎంతో నాగరికత అలవర్చుకున్నవారైనా, సనాతన ధర్మ పరాయణులైనా, పిల్ల లైనా, పెద్దలైనా ఎవరికైనా సరే ఆభరణాల మీద ఆశ, నగల మీద మక్కువ లేనివారంటూ ఉండ రు. ఇప్పుడు మనన యువతరం వీటిని కేవలం అందాన్ని ఇనుమడింపచేసేవిగాను, స్థాయిని ప్రదర్శించే వాటిగానే భావిస్తున్నారు. కానీ వీటి వల్ల మరో కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.

టోరింగ్స్‌:
1fillerవీటినే తెలుగులో మట్టెలు అని అంటారు. భారతీయ సంప్రదా యం ప్రకారం స్ర్తీ ఎంతటి సంపన్నురాలైనా, నడుము పైభాగంలో తప్ప పొత్తికడుపు దిగువ నుంచి పాదాల దాకా బంగారంతో చేసిన ఏ విధమైన భూషణా ల్ని ధరించకూడదు. ఆలా ఎవరైనా ధరిస్తే ఆఇంట సిరి ఉండదు అని శాస్త్ర వచనం. కనుక ఈ మట్టెలు వెండితో చేసినవే ధరించాలి. కుడికాలు వేలు మధ్యన పెట్టుకునే మట్టేలు సోదరుడి సౌభాగ్యానికీ, ఎడమకాలి మట్టెలు భర్త సంక్షేమం కోసం ధరిస్తుంది. అయితే ఆరోగ్య రీత్యా, కాలి నరాల ద్వారా ఆక్యు పంచర్‌గా పనిచేసి శరీరంలోని అన్ని అవయావల్లో ఆరోగ్యాన్ని నింపుతుంది. ఎక్కువగా తడిలో నానే పాదాలకి ఫంగస్‌, వైరస్‌ వంటివి సోకకుండా నిలవరించ గలిగే శక్తి వెండికి ఉంది. కనుక ఫ్యాషన్‌కి, అందచందాలకీ, ఆరోగ్యానికి కూడా ‘మెట్టెలు’ ఆయువు పట్లు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top