You Are Here: Home » ఇతర » ‘నారి’కేళ పాకం

‘నారి’కేళ పాకం

నేటి భారతీయ మహిళలు వారి ెకరీర్‌ కోసం ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంటున్నారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేసి అనేక రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం భారతీయ మహిళలు ఉద్యోగం చేయవలసి వస్తే అందుకు గుమాస్తా ఉద్యోగాలకో, టీచరు ఉద్యోగాలకో మాత్రమే ప్రాధాన్యతనివ్వండం జరిగేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోరుుంది. భారత ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధిచెందిన తరువాత మహిళలకు ఉద్యోగావకాశాలు ఎంతగానో మెరుగు పడ్డారుు. అరుునప్పటికీ మంచి ఉద్యోగంతో పాటు, జీవితం కూడా కోరిన విధంగా ఒక స్థారుులో నిటబడే అవ కాశం ఉన్న వాటిేక అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. అదీకాక తమ కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపడానికి అను మతించే ఉద్యోగాలనే కొందరు సమ్మ తిస్తున్నారు.

ఈరోజు మహిళలు తమ సృజనాత్మకతని, కారుణ్యాన్ని, సంభాషణా నైపుణ్యాన్నీ ఋజువు చేసుకుంటున్నారు. అందువల్ల వారికి ఉద్యోగంలో కూడా వారు కోరిన విధంగా అవకాశాలు కల్పించడం జరిగుతోంది. అంతేకాక వీరు పురుషులకు ధీటుగా ఆయా రంగాల్లో తమ ప్రతిభని కనబరుస్తున్నారు. ఈరోజు మహిళలు మరింత సమర్ధవంతంగా చేయగల కొన్ని రంగాలు కూడా ఉన్నాయి. వాటిలో కూడా వీరికి తగ్గ వాతావరణం ఉండి సామాజిక పరంగాను, విజ్ఞాన పరంగాను, ఆర్ధిక పరంగా కూడా అభివృద్ధిని సాధించడానికి ఈ రంగాలు మహిళలకి అనుకూలంగా ఉంటాయి.

సాంఘిక సేవ-సంస్కరణ (సోషల్‌ వర్క్‌ అండ్‌ కౌన్సిలింగ్‌) రంగాలు
బాగా చెప్పగల నేర్పు, అలాగే ఇతరు చెప్పేటప్పుడు వినే ఓర్పు చాలా అవసరం. అందువల్ల మనుషుల పట్ల సహృదయత, ఉత్సుకత ఏర్పడుతుంది. భారతీయ మహిళలు ఇందుకు సరిగ్గా సరిపోతారన్న భావం చాలామంది పరిశీలకుల్లో ఉంది. ఈ పని నిర్వహణలో విద్యావంతులైన మహిళలు ఎంతగానో రాణించ డమే కాకుండా వారు ఎంతో విజయవంతంగా సాధికారత సాధి స్తారు. ఇప్పటికే ఈ రంగంలో ఎందరో యువతులు కార్పెరేట్‌ కార్యాలయాల్లో ఈ తరహా ఉద్యోగ బాధ్యతల్ని ఎంతో సమర్ధ వంతంగా నిర్వహిస్తూ ప్రముఖ కంపెనీల ఆదరాభిమానాలు పొందుతున్నారు.

parkఅదే విధంగా ఫ్యాషన్‌, టెక్స్‌టైల్‌, ఇంటీరి యర్‌, జ్యూయలరీ, గ్రాఫిక్‌ డిజైనింగ్‌ రంగాల్లో ఈ తరహా ఉద్యోగాలు ఎందరో మహిళలకు పట్టుకొమ్మలుగా నిలుస్తు న్నాయి. ఈ రంగాల్లో మహిళలు తమ నైపుణ్యాన్నీ, సునిశిత దృష్టిని, సృజనాత్మకతని నిరూపించుకుంటున్నారు. ఈ రంగాల్లో మహిళలు తమ కాళీ సమయాల్లో కూడా నిర్వర్తించుకునే అవకాశం ఎంతో ఉంది. అంతేకాకుండా ఈ రంగాల్లో స్వతంత్రతతో చేసే వీలుండటం మూలంగా కుటుంబం పట్ల కూడా శ్రద్ధ వహించడానికి కూడా ఎంతో వీలుగా ఉంటుంది.

విద్యారంగం
పూర్వకాలం నుంచీ మహిళలు టీచర్‌ వృత్తికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ, ఆ ఉద్యోగాల్నే ఎక్కువగా కోరుకునేవారు. ఇప్పటికే ఎందరో మహిళా మణులు ఉత్తమ ఉపాద్యాయినిలుగా సన్మాన సత్కారాలతో పాటు పురస్కారాలు కూడా అందుకున్నారు. ఈ వృత్తిలో కూడా ఓర్పు, సహనం ఎంతో అవసరం. అంతేకాకుండా మేథోసామర్ధ్యం కూడా ఉండాలి. సహజంగా ఈ మూడు గుణాలు భారతీయ మహిళలకు భూషణాలు. పిల్లల్ని అదుపుచేసే నేర్పు, విషయ బోధనా ప్రావీణ్యత వీరి సొంతం. అందుకే చాలామంది మహిళలు ఇప్పటికీ ఈ వృత్తిలో కొనసాగుతుండగా, అనేక మంది ఈ ప్రొఫెషన్‌లోకి అడుగు పెడుతున్నారు. విద్యారంగంలో వార్షిక సెలవలు ఎక్కువగా ఉండటం మూలంగా ఆ సెలవ దినాల్లో వీరు కుటుంబ వ్యవహారాలు ఎంతో నిదానంగా ప్రణాళికాబద్దంగా చేసుకోవడానికి వీలుంది.

schoolఅయితే నేడు ప్రవేట్‌ పాఠశాలలు, కాలేజీల ధనార్జన దిశగానే సాగుతుండటంతో కొన్ని సంస్థల్లో జీతాలు తక్కువగా ఇవ్వటం, పనిగంటలు ఎక్కువ చేయడం, పని ఒత్తిడిని పెంచి ర్యాంకుల పోటీలో ఉపాద్యాయుల్ని బలిపశువులుగా వాడుకోవడం వంటి అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నాయన్నది వాస్తవం. కానీ అన్నీ అలాగే ఉన్నాయనడానికి కూడా అవకాశం లేదు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల టీచర్లకి ఎన్నో మంచి పథకాలు రూపొందించి, జీవిత భద్రతని చేకూరుస్తోంది. ఈ దిశగా మహిళలు అడుగులు వేస్తే ఈ విద్యారంగంలో కూడా మంచి ఉన్నతిని సాధించవచ్చు.

వైద్యరంగం
కొన్ని దశాబ్ధాలకు ముందు మహిళ వైద్యరంగంలోకి రావాలంటే ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొనవలసి వచ్చేది. ఆ తరువాత తరం మెడిసన్‌లో ప్రవేశించి డాక్టర్‌ పట్టాలు పొందారు. ఇప్పుడు ప్రవేట్‌ ప్రాక్టీస్‌లు కూడా చేస్తూ ఈ రంగంలో కూడా వారికంటూ ఒక చెరగని ముద్రని వేసుకుంటున్నారు. ఈ రంగంలో వారికి వారే బాసులు. కనుక ఏది చేయాలన్నా, దేనిని సాధించాలన్నా ఈ రంగంలో మహిళలకు ఎంతో అవకాశం ఉంది. ఈ రంగంలో ఒక నిలకడైన ఆదాయం కూడా లభింస్తుంది. ప్రముఖ ఆసుపత్రుల్లో పార్ట్‌టైంగా కూడా పనిచేయవచ్చు.

hospitalఇందులోనే ఇతర శాఖలు ఔషధాల అమ్మకాలు, డయాగ్నస్టిక్‌ లాబ్‌లు, నర్సులు మొదలైన ఉపశాఖలు కూడా ఉండటం చేత ఎవరికి ఏశాఖలో నైపుణ్యం ఉందో అదే శాఖలో స్థిరపడే వీలుంది. మనం కూడా అనేక ఆసుపత్రులలో ఎందరో మహిళా ఉద్యోగినుల్ని చూస్తూనే ఉంటుంన్నాం.
ఇలా ఈ రంగాల్లో మహిళలకి ఎంతో స్వతంత్రంగా వ్యవహరించే వీలువుంటుంది. అయితే అందుకు కావలసిన విద్యని అభ్యసించడంలో కాస్త కృషిచేయక తప్పదు. కొన్ని అనుభవం మీద అలవాటైతే, మరికొన్ని తప్పని సరిగా ఆయా రంగాలకు సంబంధించిన కోర్సులు చదివి తీరాలి. చదువుల్లో కూడా అపర సరస్వతుల్లా మన భారతీయ యువతులు ర్యాంకుల మీద ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. వీరికి ప్రత్యేకించి బాగా చదవమని ఎవరూ చెప్పనవసరం లేదు.

విస్రృత భావస్రసార (మాస్‌ కమ్యూనికేషన్స్‌) రంగం
ఇందులోకి పాత్రికేయం (జర్నలిజం), ప్రజా సంబంధ కార్యకలాపాలు (పబ్లిక్‌ రిలేషన్స్‌), మానవ వనరులు (హ్యూమన్‌ రిసోర్సస్‌), ప్రకటనల రంగాలు మహిళలకు అనుకూలంగా ఉంటాయి. నేటి భారతీయ మహిళలకి ఎంతో ప్రతిభావంతంగా వ్యక్తీకరించగల నైపుణ్యం, స్నేహసంబంధాలు అభివృద్ధిచేయగల నేర్పూ వెన్నతోపెట్టిన విద్యగా చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ మాస్‌ కమ్యూనికేషన్స్‌ రంగంలో వీరికి విజయావకాశాలు విస్తృతంగా ఉండటమే కాక ఇప్పటికే ఈరంగంలో పనిచేస్తున్న ఎందరో మహిళలు ఉన్నత స్థాయికి ఎదిగారు.

hospital0ఈ రంగంలో కూడా పురుషుల్ని అధిగమించి ఒకనాడు ఈరంగానికి స్ర్తీలు పనికిరారు అనుకున్న అపప్రదని పూర్తిగా తుడిచేసింది నేటి మహిళాలోకం. ఇటువంటి ఉద్యోగాలు తమ పనిగంటల్లో కొంతభాగాన్ని మతకనుకూలంగా మార్చుకునే వీలు ఉండటమే కాకుండా కొన్ని సందర్భాలో ఇంటివద్ద నుంచే తమ బాధ్యతల్ని నిర్వర్తించే వెసులబాటు కూడా ఉంటుంది. అదేవిధంగా హ్యూమన్‌ రీసోర్సెస్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ రంగాల్లో మహిళలు అనేక మంది వ్యక్తుల్ని కలుపుకుంటూ ఒకేతాటిమీద ఉంచవలసి వస్తుంది. అలాగే వారితో సత్సంబంధాలు కొనసాగించవలసి ఉంటుంది. వీటిని సక్రమంగా నిర్వర్తించడానికి ఎంతో ఓర్పు, సహనం ఉండాలి. ఈ విధమైన, క్వాలిటీస్‌, నైపుణ్యం మన భారతీయ మహిళలకు ఎంతగానో ఉందన్నది వాస్తవం.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top