You Are Here: Home » ఇతర » నాన్ వెజ్ లో చికన్‌కే అగ్రతాంబూలం

నాన్ వెజ్ లో చికన్‌కే అగ్రతాంబూలం

D1మాంసాహారంలో మహారాజు చికన్‌ అని చెప్పవచ్చు. కొందరికి ప్రతిరోజూ చిెకన్‌ తినే అలవాటు ఉంది. ఆదివారాలు వచ్చాయంటే, చాలామంది ఇంళ్ళలో చిెకన్‌ వాసనలు ఘుమారుుస్తూవుంటారుు. బజారుల్లో దొరిేక చికన్‌కన్నా ఇంట్లో సొంతంగా చేసుకునే చిెకన్‌కి ఎంతో రుచి ఉంటుంది. ేకవలం తరచూ చికన్‌ మాత్రమే కాకుండా దానితో మరిన్ని వెరైటీలు చేసుకుంటూవుంటే ఇంటిల్లిపాదికీ విభిన్న రుచులు ఆస్వాదించినట్టవుతుంది. మరి ఈ చికన్‌ వెరైటీలకి మనం కిచెన్‌లోకి వెడదామా!

తంగ్గి కభాబ్
తయారీకి కావలసినవి: చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌ (తొడలు): 8, అల్లంతురుము: 4 చెంచాలు, వెల్లుల్లితురుము: 6 చెంచాలు, పండుమిర్చిపేస్ట్‌: 2 చెంచాలు, కారం: 2 చెంచాలు, కొత్తిమీర తురుము: 4 చెంచాలు, మిరియాలపొడి: 1 చెంచాడు, గరంమసాలాపొడి: 2 చెంచాలు, పసుపు: 1/2 చెంచా, నీళ్లు లేకుండా పొడివస్త్రంలో వడకట్టిన పెరుగు: 4 చెంచాలు, మొక్కజొన్నపిండి: 4 చెంచాలు, శెనగపిండి: 100 గ్రాములు, ఉప్పు: రుచికి తగినంత, నూనె: సరిపడా.
తయారు చేయు విధానం: చికెన్‌ తొడలకు పదునైన కత్తితో గాట్లు పెట్టుకోవాలి. తరవాత అల్లం, వెల్లుల్లి పట్టించాలి. ఓ చిన్న పాత్రలో మిగిలిన దినుసులన్నీ వేసి బాగా కలపాలి. తరవాత ఈ మిశ్రమాన్ని డ్రమ్‌ స్టిక్స్‌ కు దట్టంగా పట్టించి ఓ గంటసేపు అలా ఉంచాలి. తర్వాత ఒక పాన్‌ లో నూనె పోసి, కాగాక చికెన్‌ డ్రమ్‌ స్టిక్స్‌ ను బాగా వేయించి తీయాలి. చివరగా ఉల్లిముక్కలు, నిమ్మముక్కలతో గార్నిష్‌ చేస్‌ సర్వ్‌ చేయాలి అంతే…

చికెన్‌ టిక్కా
తయారీకి కావలసినవి:బోన్‌ లెస్‌ చికెన్‌: 1 కేజీ (చిన్న ముక్కలుగా క్యూబ్స్‌ లా కట్‌ చేసుకోవాలి), బాస్మతి రైస్‌ : 1 కేజీ, అల్లం పేస్ట్‌: 1 చెంచాడు, వెల్లుల్లి పేస్ట్‌: 1 చెంచాడు, పెప్పర్‌ పౌడర్‌: 1 చెంచాడు, నిమ్మరసం: 1 చెంచాడు, పచ్చిమిర్చి పేస్ట్‌: 3 చెంచాలు, కారం: 2 చెంచాలు, పసుపు: 1/3 వంతు చెంచా, చాట్‌ మసాలా: 1 చెంచాడు, ఉల్లిపాయలు: 2 చెంచాలు, టమోటో: 2, పెరగు: 1 కప్పు, లవంగాలు: 5, బిర్యానీ ఆకు: 2, యాలకులు: 4, దాల్చిన చెక్క: 2-3 (అంగులపొడవు), ఉప్పు: రుచికి సరిపడా, నెయ్యి: 2 చెంచాలు, నూనె: 1 కప్పు, ఫుడ్‌ కలర్‌: 1/4 (పసుపు రంగు), కుంకుమ పువ్వు: చిటికెడు, పాలు: 1/2.
తయారు చేయు విధానం: ముందుగా బియ్యాన్ని శుభ్రం చేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే వేడిగా ఉన్న పాలను ఒక కప్పు తీసుకొని అందులో కుంకుమ పువ్వు వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో బోన్‌ లెస్‌ చికెన్‌ ముక్కలు, పెరుగు, కారం, పచ్చిమిర్చి పేస్ట్‌, పసుపు, ఉప్పు, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, ఛాట్‌ మసాలా, నిమ్మరసం, ఎల్లో ఫుడ్‌ కలర్‌, అల్లం, వెల్లుల్లిపేస్ట్‌ వేసి అన్నింటినీ బాగా మిక్స్‌ చేయాలి. ఈ చికెన్‌ను 1-2 గంటలపాటు అలాగే మ్యారినేట్‌ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్‌ కలర్‌ వచ్చేంత వరకూ వేయించి, అందులోనే టమోటో వేసి చిక్కటి గ్రేవి తయారయ్యే వరకూ ఉడికిం చాలి. ఇప్పుడు అందులోనే బిర్యానీ ఆకులు కూడా వేసి మసాలామిశ్రమంతో నానబెట్టి పెట్టుకొన్న చికెన్‌ ముక్కలను కూడా అందులో వేసి 5-10నిముషాల పాటు మీడియం మంట మీ ఉడికించుకోవాలి. చికెన్‌ కొద్దిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్‌ చేసి పాన్‌ తీసి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని బియ్యానికి సరిపడా నీళ్ళు పోసి బాగా కాగనివ్వాలి. నీరు మరిగేటప్పుడు అందులో బియ్యాన్ని వేసి 10 నిముషాలు ఉడికించి గంజి వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్‌ గ్రేవీ మిశ్రమాన్ని, వండిని అన్నంను రెండింటినీ లేయర్‌ గా పరచుకోవాలి. మొదటి అన్నంను ఒక ఇంచ్‌ మందగా పరవాలి. దానీ మీద చికెన్‌ మిశ్రమాన్ని పరవాలి. ఇలా మూడు నాలు లేయర్స్‌ పరచి చివరగా(టాప్‌ లో) చికెన్‌ గ్రేవి లేయర్‌ వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నం మీద పాలలో నానబెట్టుకొన్ని కుంకుమ పువ్వు, పాలతో సహాయ చిలకరించాలి. ఇప్పుడు మూత పెట్టి ఐదునిముషాల పాటు తక్కువ మంటమీద ఆవిరిమీద ఉడికించాలి. అంతే చికెన్‌ టిక్కా బిర్యానీ రెడీ. ఈ బిర్యానీని రైతా, గ్రీన్‌ సలాడ్‌, నిమ్మకాయతో సర్వ్‌ చేయాలి. అంతే..

నాటుకోడి షోరువా
బ్రాయిలర్‌ కోడి కన్నా నాటుకోడి మంచి రుచిగా ఉంటుంది. అందులోనూ విలేజ్‌ కోడి మరింత నోరూరిస్తుంది. ఈ నాటుకోడితో చేసే వంటకం మరింకెంత రుచిగా ఉంటుందో చేసి చూడండి.
తయారీకి కావలసినవి: చికెన్‌: 750, గ్రాములు, మిరప్పొడి: 3 చెంచాలు, పసుపు: 1 చెంచాడు, అల్లం వెల్లుల్లి పేస్టు: ఒక్కొక్కటి మూడు చెంచాల చొప్పున (కడిగిన చికెన్‌ ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, మిరప్పొడి పట్టించి పక్కన ఉంచాలి), నూనె: 4 చెంచాలు, కరివేపాకు: రెండు రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు: 2 కప్పులు (సన్నగా తరిగినవి), కాశ్మీరీ మిరప్పొడి: 2 చెంచాలు, మసాలా పౌడర్‌: 4 చెంచాలు, ఉప్పు: తగినంత, కొత్తిమీర: గుప్పెడు (సన్నగా తరగాలి).
తయారు చేయు విధానం: ముందుగా నాన్‌ స్టిక్‌ పాన్‌లో నూనె వేడి చేసి కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తరవాత అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, మిరప్పొడి పట్టించి ఉంచిన చికెన్‌ మిశ్రమాన్ని వేసి సన్నమంట మీద వేగనివ్వాలి. చికెన్‌ ముక్కల్లో ఎరుపుదనం పోయి నీరు వెలువడడం మొదలయ్యాక మసాలా పౌడర్‌, కాశ్మీరీ చిల్లీ పౌడర్‌ కలిపి కొద్ది సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకటిన్నర కప్పు నీటిని పోసి పది నిమిషాల సేపు సన్నమంట మీద ఉడికించాలి. మధ్య లో మూడు నిమిషాలకొకసారి కలిపి మూత పెడుతుండాలి. ఉప్పు, కొత్తిమీర వేసి సమంగా పట్టేటట్లు కలిపి దించాలి. ఇది అన్నం, గారెలలోకి బాగుంటుంది. మసాలా పౌడర్‌ తయారి: ఆరు స్పూన్ల ధనియాలు, పది లవంగాలు, ఎనిమిది ఏలకులు, దాల్చినచెక్క రెండు అంగుళాల ముక్క, స్టార్‌ లవంగం ఒకటి, పాపీ సీడ్స్‌ రెండు టీ స్పూన్లు తీసుకుని పొడిచేయాలి.

షిక్ కభాబ్
మనదేశంలో మాంసాహారులకి కబాబ్‌ చాలా ఇష్టమైన మాంసాహారం. నాన్‌ వెజ్‌ వెరైటీలలో షీక్‌ కబాబ్స్‌కు మించిన టేస్ట్‌ మరొకటి ఉండదని భోజనప్రియులు అంటూ ఉంటారు.
తయారీకి కావలసినవి: చికెన్‌: 500 గ్రాములు, నెయ్యి: 2 చెంచాలు, ఉల్లిపాయ: 1 (సన్నగా కట్‌చేసుకోవాలి), వెల్లుల్లి: 5 పాయలు, అల్లం: 1/2 ముక్క, పచ్చిమిర్చి: 4, పుదీనా: 1 కట్ట (శుభ్రం చేసి సన్నగా తురుముకోవాలి), కొత్తిమీర ఆకులు: 1 (చిన్న కట్ట సన్నగా తురిమినది), కారం: 1 చెంచాడు, శెనగపిండి: 2 చెంచాలు, జీలకర్ర: 1 చెంచాడు, లవంగాలు: 4, యాలకలు: 4, దాల్చిన చెక్క: 1/2, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: 1 చెంచాడు, బొగ్గు ముక్కలు: 3-4.
తయారు చేయు విధానం:ముందుగా స్టౌ మీద పాన్‌ పెట్టి, సన్నని మంట మీద ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. తర్వాత చల్లారనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా వేసి మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. అంతలోపు యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, జీకర్ర, ఇవన్నీ పాన్‌లో వేసి సన్నని మంట మీద వేయించి పెట్టుకోవాలి. ఈ మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకొని ముందగా పేస్ట్‌ చేసుకొన్న ఉల్లిపాయ పేస్ట్‌ మిశ్రమంలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసిపెట్టుకొన్న చికెన్‌ ముక్కల్లో వేసి కలుపాలి. అలాగే ఉప్పు, నెయ్యి, కారం, కొత్తిమీర, పుదీనా తరుగు కూడా వేసి బాగా మిక్స్‌ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు చెంచాల శెనగపిండి కూడా చికెన్‌ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ అన్నీ కలిపి పెట్టుకొన్న చికెన్‌ను ఫ్రిజ్‌లో పెట్టి రెండు మూడు గంటల ఉంచాలి. వండేందుకు ఒక గంట ముందు ఫ్రిజ్‌లో నుండి బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్‌ ముక్కలను ఉన్న గిన్నెలోనే చికెన్‌ మద్యలో ఖాలీ ప్రదేశం ఉండేలా గిన్నెలో రౌండ్‌గా సర్దుకోవాలి. ఖాలీగా ఉన్న ఆ ప్రదేశంలో బాగా కాలుతున్న బొగ్గుముక్కలను పోయాలి. దాంతోనే కబాబ్స్‌కు మంచి వాసన వస్తుంది. అరగంట తర్వాత కాలిన చికెన్‌ ముక్కలను ఒక ఇనుప కడితో గుచ్చి పైకి తీసుకొని, బొగ్గులను ఆర్పేయాలి. ఇప్పుడు ఆ కడ్డీకున్న చికెన్‌ ముక్కలకు కొద్దిగా నెయ్యి రాయాలి. ఈ చికెన్‌ గుచ్చిన షీకర్స్‌ను మైక్రోవోవెన్‌లో పెట్టి 30-60 డిగ్రీ ఉష్ణోగ్రతలో బేక్‌ చేయాలి. ఈ షీకర్స్‌ తిరుగుతుండేలా చూసుకోవాలి. అప్పుడే చికెన్‌ అన్నివైపులా బాగా ఫ్రై అవుతుంది. బాగా బేక్‌ అయిన తర్వాత వొవెన్‌ ఆఫ్‌ చేసి పది నిముషాల తర్వాత బయటకు తీసి ఉల్లిపాయతో సర్వ్‌ చేయాలి అంతే చికెన్‌ షీక్‌ కబాబ్‌ రెడీ. ఇది చేయడానికి కాస్త సమయం పట్టినా తినడానికి ఎంతో రుచిగా ఉండి ఆశ్రమ మర్చిపోయేలాచేస్తుంది.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top