You Are Here: Home » చిన్నారి » నాన్‌స్టిక్ వంటపాత్రలను ఎలా తయారుచేస్తారు?

నాన్‌స్టిక్ వంటపాత్రలను ఎలా తయారుచేస్తారు?

ఇటీవల కాలంలో నాన్‌స్టిక్ వంటపాత్రల వాడకం గణనీయంగా పెరిగింది. వండే పదార్థాలు పాత్రలకు అడుగుభాగాన అంటుకుపోకుండా, మాడిపోకుండా ఉంటాయనే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ నాన్‌స్టిక్ పాత్రలను ఎలా తయారుచేస్తారో చూద్దాం. టెఫ్లాన్ అనే పదార్థాన్ని పాత్రలో పైపూతగా వాడటం వలన వండే పదార్థాలు పాత్ర అడుగున అంటుకుపోకుండా, మాడి పోకుండా ఉంటాయి.

ఇథిలియం (ఇథిలీన్) ఫ్లోరిన్‌తో చర్య జరిపినప్పుడు టెట్రాఫ్లోరో ఇథిలిన్ ఏర్పడుతుంది. దీనిని పొలిమెరీకరణం చేసినప్పుడు పాలిటెట్రా ఫ్లోరో ఇథిలియన్ అనే పదార్థం ఏర్పడుతుంది. ఈ పదార్థాన్నే టెఫ్లాన్ అని కూడా పిలుస్తారు. ఈ టెఫ్లాన్ ఉపయోగించటం వలనే నాన్‌స్టిక్ పాత్రలకు ప్రత్యేకత వస్తుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top