You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » ఆత్మకథ » నాద బ్రహ్మ నేదునూరి

నాద బ్రహ్మ నేదునూరి

నాద బ్రహ్మ నేదునూరి

 

గాత్ర సంగీతకారులలో నేదునూరి కృష్ణమూర్తి గారు ఉద్దండులు. సంగీతంలో అఖండమైన ప్రతిభను కనపరచి, నేదునూరి సంగీత సౌరభాన్ని సుమనోహరంగా పంచారు. సంగీత కళానిధి అన్న ఖ్యాతినార్జించారు. కర్నాటక సంగీతం ఆంధ్రాకి వెళ్లిపోరుుం దా అన్న భావన కలిగిం చగలిగారు. నేదునూరి అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, ెకనడా, సింగ పూర్‌ ఇత్యాది దేశాలు పర్య టిం చి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. సంగీ తంలో తన ప్రతిభ కనపరు స్తూ అన్నమాచార్య సంకీర్తనలు కూర్చి సంగీత ప్రియుల కు అందించారు. విశేష ఖ్యాతిని ఆర్జించారు.

 

023

సంగీత లోకంలో ప్రముఖ స్థానం సంపాయించుకున్నారు.సంగీత అకాడమీలో యాబై యేళ్ళకు పైగా పాడారు. తన సుదీర్ఘ సంగీత యాత్రలో అనేక సంగీత కోవిదులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ద్వారం వెంకట స్వామి నాయుడు దగ్గరనుంచి, డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి, లాల్గుడి జయరామన్‌, ఎం ఎస్‌ సుబ్బులక్ష్మి, పేరి శ్రీరామమూర్తి (వయొలిన్‌), వెంకటరమణ (మృదంగం), నేమాని సోమయాజులు (ఘటం) ఇత్యాదులు నేదునూరి ప్రతిభను కొనియాడేవారు. నేదునూరి అనేక అవార్డులు, గౌరవ పుురస్కరాలు పొందారు.

నేదునూరి విభిన్న పదవులు నిర్వర్తించారు. వాటిలో – విజయవాడ జీ వీ ఆర్‌ ప్రభుత్వ సంగీత, నాట్య కళాశాల, ప్రధాన అధ్యాపకుడిగా, సికింద్రాబాద్‌, విజయనగరం, తిరుపతి సంగీత కళాశాలలో పనిచేసారు. వేంకటేశ్వర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో ఆర్ట్‌‌స విభాగం డీన్‌ , బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా, ఆల్‌ ఇండియా రేడియో, సంగీత విభాగ ఆడిషన్‌ (ఆడిషన్‌) బోర్డ్‌ సభ్యుడిగా పనిచేసారు. 1985లో ప్రభుత్వ కొలువు నుంచి రిటైర్‌ అయ్యి ఉపకార వేతనం తీసుకుంటున్నారు. కొంతకాలం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ అచార్యుడిగా ఉన్నారు.

zxcనేదునూరి కృష్ణమూర్తి అక్టోబర్‌ 10, 1927లో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం తాలూకా కొత్తపల్లిలో… శ్రీరామమూర్తిపంతులు, శ్రీమతి విజయలక్ష్మి దంపతుల ఎనిమిదవ సంతానంగా జన్మించారు. ఇంట్లో అందరికన్నా చిన్నవారు. వీరి తండ్రి పిఠాపురం రాజా వారి సంస్థాన కార్యాలయంలో పనిచేస్తూండేవారు. అప్పట్లో వీరి తండ్రి గారి నెలసరి జీతం ఇరవై రూపాయలు. నేదునూరి 1940లో విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో వయొలిన్‌, గాత్రంలో ప్రాధమిక శిక్షణ పొందారు. కీర్తిశేషులు ద్వారం నరసింగరావు నాయుడు శిష్యుడిగా ఉన్నారు. 1945 నుంచి సంగీత సభలలో పాల్గొంటూ వచ్చారు. 1949లో ప్రముఖ సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి పద్మభూషణ్‌ డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి గారి వద్ద చేసి సంగీతంలో గమకాలు, ఇతర మెళకువలలో శిక్షణ పొంది, సంగీత నైపుణ్యానికి మెరుగులు దిద్దారు. ఆల్‌ ఇండియా రేడియోలో అగ్రగణ్య కళాకారుడిగా వెలుగులోకి వచ్చారు. 1951 నుండి ఐదు దశాబ్దాలకు పైగా మద్రాసు సంగీత అకాడమీలో ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. 1959లో నేదునూరి తండ్రి మరణించారు. ఈయన 1968లో తల్లిని పోగొట్టుకున్నారు. తల్లిదండ్రులీద్దరూ సంతోషిచారు నేదునూరి కౄఎష్ణ మూర్తి స్వప్నాన్ని సాధించాడని.

ఉచితంగా ఏం నేర్చుకో గలిగితే అది నేర్చుకో అని ఆయన తండ్రి ప్రాధేయపడ్డారు. ఎందుకు అని విశ్లేషించ లేదు. అసలు సంగతి తెలుసు కనక. హిందీ, సంస్కృతం నేర్చుకున్నారు. సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. అందుకు తల్లి ప్రభావం ఉంది అని అంటారు. అష్టపదులు, తరంగాలు, రామాయణ కృతులు పాడారు. చిన్నతనంలో నేదునూరి గ్రామంలో పెరిగేరు. విద్వాన్‌ అప్పారావు వద్ద వర్ణాలు నేర్చుకున్నారు. అష్టపదులు, తరంగాలు కల్లూరి వేణుగోపాల రావు గారి వద్ద నేర్చుకున్నారు. ఓ సారి వేణుగోపాలరావు గారి ఇంటికి విజయనగరం తహసిల్దారు విచ్చేసినప్పుడు నేదునూరి హత్తుకొనే పాట విని ప్రసన్నులైయ్యారు. అప్పల నరసింహం పుణ్యమా అని విజయనగరం మహరాజా కాలేజీలో చేరడం జరిగింది. ఉండేందుకు ఉచిత బస ఏర్పరచారు, భోజన వసతి కల్పించారు. ఇంక నేదునూరివారు వెనుదిరిగి చూడలేదు.

సంగీత సౌరభానికి ముందడుగు:
e2సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడు, నేదునూరి ప్రతిభకు ముగ్దులై గాత్ర సంగీతం (వోకల్‌ మ్యూసిక్‌) లోనే ఉండకూడదూ ? మంచి గళం ఉంది అన్నారు. నాయుడు గారి బంధువు, ప్రముఖ వయొలనిస్ట్‌ ద్వారం నరసింగరావు కూడా ఈ మాటనే సమర్ధించారు. ఐతే నేదునూరికి వయొలిన్‌ మీద మక్కువ ఉంది. వారు నిష్నాతులు కనక ఓ ఉపాయం చేసారు. క్లాసులో నేదునూరి చేత పాడించి ఆయనే (వయొలిన్‌) వాయించారు. గాత్ర సంగీతం మీద ద్యాస ఉంచేట్టు ప్రోత్సహించారు. ఐదేళ్ళు గడిచే సరికి నేదునూరి ప్రతిభ ద్విగుణితం, బహుళం అయ్యింది.ఒకసారి కాకినాడలోని సరస్వతీ గాన సభలో జనం మాలి గారి వేణు గానం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. రైలు బండి ఆలస్యమయ్యింది.

మాలి వచ్చేదాక నేదునూరి చేత పాడించకూడదూ అని జనంలో ఎవరో సూచించారట. సమయానికి మంచిగా స్పందించాడు యువ గాత్ర సంగీతకారుడు. జన రంజక సంగీతాన్ని అందించి అలరించారు నేదునూరి గారు.స్వభావముగా నేదునూరివారు బహు సౌమ్యులు. శ్రీపాద పినాకపాణి ఈయన గురువు, ఆప్త మిత్రుడు, సోదరప్రేమ, వాత్సల్యం కలిగిన వాడూను. డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి వద్ద 1949లో గమకాలు నేర్చుకున్నారు. సంగీత విద్య మరింత సాన పట్టారు.. హృదయాలని స్పందించే సంగీతాన్ని సాధనచేయడంతో నేదునూరి ప్రతిభ పరిణితి చెందింది. విద్వత్తు రాణించ సాగింది.

ఆయన స్వర పరచిన కీర్తనలు:
నేదునూరి కృష్ణమూర్తి స్వర పరచిన కీర్తనలలో – దాశరధి శతకం పద్యాలు, రాగ సుధా రసాలతో భద్రాచల రామదాస కీర్తనలు ప్రసిధ్ధమైనవి. రెండు సీడీలు వెలువరించారు. అన్నమాచార్య సంకీర్తనలు, పదకదంబం మీద పలు సీ డీలు, కెసెట్లు విలువడించారు. ఆల్‌ ఇండియా రేడియో భక్తి రంజనిలో కూర్చిన నారాయణ తీర్థ తరంగాలు, రామదాస కీర్తనలు బగా వాసికెక్కాయి.

వీరి శిష్యగణం
నేదునూరి ప్రముఖ శిష్యులలో కళాప్రపూర్ణ చిట్టి అబ్బాయి, శ్రీమతి కోక సత్యవతి, శ్రీమతి కె.సరస్వతి వుధ్యార్తి, జి. బాలకృష్ణ ప్రసాద్‌, శ్రీమతి శోభారాజు, మల్లాది సోదరులు (శివరామ ప్రసాద్‌, రవి కుమార్‌) ఉన్నారు.

అందుకున్న అవార్డులు, గౌరవ పురస్కరాలు
పలు అవార్డులు, గౌరవ పురస్కరాలు అందుకున్నారు నేదునూరి గారు.

  • టీ టీ డీ – ఆస్థాన విద్వాన్‌గా నియమితులైయ్యారు. అన్నమాచార్య కృతులని కూర్చి సంగీత లోకానికి అందించారు.
  • మద్రాసు సంగీత అకాడమి నుండి సంగీత కళానిధి గౌరవం అందుకున్నారు.
  • నేషనల్‌ ఎమినెన్స్‌ అవార్డు (2006)
  • ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం నుండి కళానీరాజనం పురస్కారం (1995) అందుకున్నారు.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top