You Are Here: Home » కళ » నవరసభరితం … నాట్యం

నవరసభరితం … నాట్యం

శాస్ర్తీయ నృత్యాన్ని మూడు వర్గాలుగా విభజించవచ్చును. నృత్తం, నృత్యం, నాట్యం. ముందుగా నృత్తం అనేది తాళ, లయాత్మకంగా ఉంటుంది. దీంట్లో రసభావాలు ఉండవు. మృదంగ జతులకు వీలుగా ఉండే స్వరాలు ఇందులో ఉంటారుు. సంగీత స్వర పల్లవులకు అందంగా అంగవిన్యాసం చేయడమే నృత్తమంటే! ఇందులోనూ హస్త ముద్రలు ఉన్నా అవి ఏ భావాన్నీ సూచించవు. అందమైన భంగిమలకు ఇవి ఉపయోగపడతారుు. నాట్య ప్రదర్శనలన్నీ నృత్తంతోనే ఆరంభమవుతారుు. నృత్తానికి వాద్య సహకారమే ప్రాణం. అది ఎంత బాగుంటే ఆట అంతగా రక్తి కడుతుంది. ఇక నృత్యం అనేది రస, భావ, తాళ, లయలతో కూడుకుని ఉంటుంది. పాడే పాటలోని భావానికి అను గుణంగా రసాత్మకంగా అభినరుుంచే ప్రక్రియ ఇది.

నాట్యమనేది భావ, రాగ, తాళ, లయ రసాలను ఆశ్రరుుంచి సాగేది. ఇందులో వినియోగించే గీతాలు ఏదో ఒక పురాణ కథాంశం నేపథ్యంగా సాగుతారుు. ఇలా పూర్వకథతో ముడి ఉన్నందునే నాట్యం వేరు, నృత్యం వేరయ్యారుు. వివిధ పురుషూల పాత్రలను నర్తనం చేసే కళాకారుడు అభినరుుంచి చూపాల్సి ఉంటుంది. నర్తనంతో పాటు బహుపాత్రాభినయం చేయడం ఇందులోని విశిష్టత. ఈ విషయంలో కూచిపూడి ప్రత్యేకమైన ప్రశంసలు పొందింది. అందెల సందడినాట్యాన్ని తిరిగి లాస్యమని, తాండవమని రెండుగా విభాగించవచ్చు.

ఆడవారు చేసే నృత్యాన్ని లాస్యం అంటారు. మృదువైన అంగవిన్యాసాలతో సుకుమారంగా భావ ప్రకటన చేయడం దీని లక్షణం. నర్తకి కూచునికానీ, నించునికానీ, పదాలు, పద్యాలు, శ్లోకాలకు రసాభినయం చేయడం కూడా లాస్యం కిందికే వస్తుంది. ఈ ప్రక్రియకు మొదట జీవం పోసింది పార్వతిదేవి. ఆమెను లాస్య ప్రియ అనిపిలుస్తారు. ఆమె సప్త లాస్యాలను ప్రదర్శించిందని పురాణాలు చెబుతున్నాయి.
అలాగే తాండవం విషయానికి వస్తే నటరాజైన శివుడే ఆద్యుడు. ఆయన తాండవ ప్రియుడు. పురుషుడు చేసే ఉధృత నృత్యం ఇది. రౌద్ర, వీర రసాలను ఒలికిస్తూ గంభీర భావ ప్రకటనను చేసేది తాండవం.తండు అనే వాడు రూపొందించింది కాబట్టి దీన్ని తాండవం అన్నారు. వేదికల మీద కూడా శివ తాండవాన్ని పురుషులే ఎక్కువగా చేస్తుంటారు.

ఊర్వశి వారసులు దేవదాసీలు
Untitleaనృత్యం అంతా నేర్చుకోవల్సిన విద్యే అయినా దానిలో మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు కొత్తకొత్త అంశాలను కనిపెట్టేందుకు, మరిన్ని సంప్రదాయాలను తీసుకువచ్చేందుకు లోతైన పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఆ పని చేయడం అందరివల్లా అయ్యేదికాదు. జీవితాలు ఈ కళ కోసమే ధారపోస్తే తప్ప అది సాధ్యం కాదు. అందుకని ఇందుకోసం ప్రత్యేకించి ఒక వర్గాన్ని ఏర్పాటుచేశారు. వారే కళా వంతులు. దేవతా ప్రీతి కోసం గజ్జెకట్టి, నృత్యాన్ని ప్రాణప్రదంగా భావించి, కళకే జీవితాన్ని అంకితం చేసి, ఆలయానికే పరిమితమై బతికిన వారిలో అతి ముఖ్యులు దేవదాసీలు. దేవదాసీనే గుడిచేటి అని కూడా పిలచేవారు. నృత్య కళకు మహోన్నత స్థానాన్ని తీసుకు వచ్చిన వీరు ఆలయాలను సంస్కృతీ కేంద్రాలుగా, లలిత కళలకు పుట్టినల్లుగా, నాగరికతకు కట్టిన గోపు రాలుగా మార్చారు. రంగ మంటపాలను క ళామంట పాలుగా విరాజిల్ల చేశారు. దేవ నర్తకి ఊర్వశి దేవదాసీ వ్యవస్థకు మూలమని పురాణాలు చెబుతున్నాయి.

అచ్చతెలుగు అందాల రాశి ఊర్వశి
పూర్వం నరనారాయణుడు బదరికావనంలో తపసు చేస్తుండగా వారి తపస్సును నాశనం చేసి రమ్మని ఇంద్రుడు దేవ వేశ్య రంభను పంపాడు. ఆమె ఆటపాటతో అక్కడ అనవసర వాతావరణం సౄఎష్టించడం గమనించిన నారాయణుడు తన ఊరువుల (తొడలు) నుంచి ఒక అప్సరసను సృష్ట్టించి పోటీ నాట్యం చేయించి రంభను ఓడించాడు. విష్ణువు ఊరువుల నుంచి పుట్టినది కనుక ఆమెను ఊర్వశి అని పిలిచారు. తపోభంగం చేయబోయి గర్వభంగం చేయించుకున్న ఇంద్రుని చూసి జాలిపడిన నారాయణుడు ఊర్వశిని ఇంద్రునికిచ్చి పంపించాడు. అప్పటి నుంచి ఊర్వశి ఇంద్రలోకానికి దివ్యాలంకారంగా మారింది. ఆమె వారసులే దేవదాసీలుగా భూమిపై అవతరించారు. రంభాది దేవవేశ్యాల వారసులు రాజనర్తకులుగా పుట్టారు. ఇంద్ర సభలో నాట్యం చేసే అప్సరసలో రంభ, ఊర్వశి, మేనక, త్రిలోత్తమ వంటి వారు ఉన్నా వారిలో మొదటి ముగ్గురు బాగా ప్రచారంలో ఉన్నారు.

జతికి, స్వరానికి ప్రాధాన్యమిచ్చి ఆంగిక విన్యాసాలకు ఎక్కువ అవకాశం ఇచ్చి నాట్యం చేసేది రంభ. అభినయానికి కొంత ప్రాధాన్యమిచ్చినా అది భావాభినయం కాదు. అర్థాభినయం మాత్రమే! భావానికి విశేష ప్రాధాన్యమిచ్చి నాట్యం చేసేది ఊర్వశి. రసాభినయానికి ఎక్కువ ప్రాధాన్యముంటుంది. ఈ ధోరణిలోనే కొనసాగించి నాట్యం చేసే వారు మన దేవదాసీలు.

నాట్యకళలో ఆలయ నర్తకులు, ఆస్థాన నర్తకులు ఆరితేరినా ఆలయాలలో ఆడేందుకు దేవదాసీలే అర్హులు. వీరు నారాయణాంశ కలిగిన వారు కనుక ఆలయాలలో తప్ప మరెక్కడా నాట్యం చేయరు. సభలలో రసిక జనానందం కోసం నాట్యమాడే వారికి ఆలయాలలో నాట్యంచేసే అర్హత లేదు. దేవదాసీల అద్భుత నాట్యాన్ని చూడాలంటే రాజైనా, బంటయినా ఆరాధనా సమయంలో ఆలయానికి రావలసిందే! ఇందుకు చిదంబరాలయం నిర్మాణం కావడానికి కారణభూతురాలైన కల్యాణి కథనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

చిదంబర ఆలయ నిర్మాణ హేతువు దేవదాసి
Untitlaసుప్రసిద్ధ నటరాజ ఆలయం చిదంబరం నిర్మాణానికి కల్యాణి అనే దేవదాసి కారణం కావడం కళాప్రియులం దరికీ గర్వకారణం. ఈ ఆలయ నిర్మాత రాజరాజచోళుడు. ఆయన ఒకనాడు మారు వేషంలో దేశ సంచారం చేస్తుండగా కావేరీ ఒక ఇంట్లో అర్థరాత్రి పూట నాట్య సాధన చేస్తున్న శబ్దం వినవచ్చింది. అటుగా వెళ్లిన రాజు అక్కడ జరిగే నాట్యసాధన చూడాలని ఎంతగానో తహతహలాడాడు. నాట్యం చేసే కల్యాణిని, ఆమెకు వాద్య సహకారం అందిస్తున్న గురువును ఎంత బతి మాలినా నాట్యం చేయలేదు. దేవుడికే నాట్యాన్ని అంకితం చేసిన కళాకారిణిని నీ ముందు నాట్యం చేయమని బలవంత పెట్టడం భావ్యం కాదని గురువు హెచ్చరించాడు.

అయినా గురువు లేని రోజున రాజరాజ నరేంద్రుడు కల్యాణిని నాట్యం చేయమని ఒత్తిడి చేశాడు. అదే సమయంలో గురువు వచ్చి ఆమె నాట్యం చూడాలంటే నటరాజుకు ఒక కోవెల కడితే ఆ ఆలయ ప్రారంభం రోజున కల్యాణి నాట్యం చేస్తుందని, ఆనాడు చూడవచ్చని అంటాడు. రాజరాజ చోళుడు వెనువెంటనే చిదంబర నటరాజాలయాన్ని నిర్మించాడు. గురువు చెప్పిన ప్రకారమే ఆలయంలో కల్యాణి పుష్పాంజలి నాట్యం చేసింది. ఆ నాట్యం విన్నాణం చూసి కళ్లు చెదిరిన రాజరాజు దర్శనమిస్తుంది. ఇక్కడ శివుడిని బృహదీశ్వరుడు అని పిలుస్తారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top