You Are Here: Home » చిన్నారి » నది ఒడ్డున నీళ్లు వేగంగా ఎందుకు ప్రవహించవు?

నది ఒడ్డున నీళ్లు వేగంగా ఎందుకు ప్రవహించవు?

నదిలోకి స్నానం చెయ్యడానికో, ఈత కొట్టడానికో వెళ్లినప్పుడు నదిని చూస్తే… నదిమధ్యలో వేగంగాను, నది ఒడ్డున అతి సాధారణంగానూ నీరు ప్రవహించడాన్ని గమనించవచ్చు. ఒడ్డు దగ్గర నీరు అంత వేగంగా ప్రపహించకపోవటానికి కారణం… నీరు అతి పల్చని ద్రవం.

ప్రవహించటం, పారడం దాని ప్రధాన గుణాల్లో ఒకటి. చదరంగా విస్తరించిన కాగితంలా పల్లం వైపు వ్యాపిస్తున్నప్పుడు నది నీరు గట్టుకి దగ్గరవుతున్న కొద్దీ ఆ నీటికి ఒత్తిడి, రాపిడి ఏర్పడతాయి. నదికి ఇరువైపులా ఒడ్డు దగ్గర నేల లోతు తక్కువ ఉండటమే దీనికి కారణం. ఈ ఒత్తిడి, రాపిడి ఒడ్డు దగ్గర ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. కాబట్టి అక్కడ నీరు వేగంగా ప్రవహించలేవు. అదే నది మధ్య భాగాన ఈ ఒత్తిడి, రాపిడి ప్రభావం ఉండదు. అందుకే అక్కడ నీరు వేగంగా ప్రవహిస్తుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top