You Are Here: Home » ఇతర » నటనే వారి ఊపిరి

నటనే వారి ఊపిరి

DS54కళను నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలు అనేకం. అదే క ళను అమ్ముకుని జీవిస్తున్న వారు ఎందరో.. కాలికి గజ్జలు కట్టి జనపదాన్ని అలపిస్తూ అందెలు వేస్తూ, అభినయం చేస్తూ నటనే తమ ఊపిరిగా ఉన్న ఎందరో కళాకారులు తెలుగు సభల్లో తమ ప్రావీణ్యతను చాటుకున్నారు. గురువారం తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో రాష్ట్ర వ్యాప్తంగా విశేష ప్రతిభ కలిగిన రంగ స్థల నటులు రామాయణం, మహాభారతం లాంటి పురాణాల పాత్రలను సజీవంగా ఉట్టిపడేటట్లు ప్రదర్శించారు. తెలుగు తల్లి , రాముడు, క్రిష్ణుడు, రావణాసురుడు, సూర్పనఖ లాంటి రంగస్థలం వేషాలతో పాటు తెలుగుకు వెలుగులు నింపిన నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగఢ, తిమ్మరుసు, వేషధారణలతో ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రదర్శన ముందు భాగంలో కోలాటం, డప్పులు, చెక్క భజనలు, గోండ్రునృత్యం, పిల్లనగ్రోవిలతో అలనాటి సుందర వైభవాన్ని చాటి చెప్పారు. మహాసభలకు వచ్చిన కళాకారులు తమ కళను వ్యక్తపరచడమే ప్రధాన బాధ్యతగా వ్యవహరించడం కొసమెరుపు.

– వి.కృష్ణ, చిత్తూరు స్టాఫ్‌రిపోర్టర్‌

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top