You Are Here: Home » చిన్నారి » నక్షత్రాలు తెల్లగా ఎందుకు కన్పిస్తాయి?

నక్షత్రాలు తెల్లగా ఎందుకు కన్పిస్తాయి?

విశ్వంలోని అన్ని పదార్థాలు మౌలికంగా పరమాణువులతో రూపొందుతాయి. ఒక పదార్థంలోని పరమాణువుకు వెలుపలి నుంచి ఉష్ణశక్తి అందినప్పుడు అవి కనిపించడం మొదలు పెడతాయి. అందుకనే ఉష్ణశక్తి ఎంత ఎక్కువగా ఉంటే వాటి కంపనం లేక చలనం కూడా అంత తీవ్రంగా ఉంటుంది. పదార్థంలోని పరమాణువులు తగినంతగా కంపించగానే వాటి నుంచి కాంతి ఉద్భవిస్తుంది.

అలాంటి సందర్భాలలో సాపేక్షికంగా చల్లగా ఉండే వస్తువులు ప్రధానంగా తక్కువ పౌనఃపున్యంతో ఉండే తరంగాలను విడుదల చేస్తే, వేడిగా ఉండే వస్తువులు ప్రధానంగా ఎక్కువ పౌనఃపున్యం ఉండే తరంగాలను సృష్టిస్తాయి. ఈ కారణంగా, ఎక్కువ ఉష్టోగ్రతలు ఉండే వస్తువులు నుంచి వచ్చే కాంతిని మన కంటితో చూడడానికి వీలవుతుంది.

ఒక వస్తువు మండేటప్పుడు విడుదలయ్యే కాంతిలో ముందుగా ఎరుపురంగు కాంతి మనకు కనిపిస్తుంది. ఆ వస్తువు తాలూకు ఉష్టోగ్రత మరింతగా పెరిగినప్పుడు ఈ ఎర్రని కాంతి కాషాయంలోకి గాని, పసుపు రంగులోకి గాని మారుతుంది. అలాంటి సందర్భాలలో ఆ రంగుకు చెందిన కాంతి తరంగాలు ఉద్భవిస్తాయి. ఇక ఉష్టోగ్రత మరీ అధికమైనప్పుడు కనిపించే కాంతిలోని అన్ని రంగులకు చెందిన తరంగాలు ఆ వస్తువు నుంచి విడుదలవుతాయి. దాంతో ఆ వస్తువు తెల్లగా కన్పిస్తుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top