You Are Here: Home » దైవత్వం » ధ్యానంతో కోపం తగ్గించుకో

ధ్యానంతో కోపం తగ్గించుకో

సాయిబాబా తన సందర్శకులను, భక్తులను చక్కగా, మంచిగా మాట్లాడమని చెబుతాడు. రామదాసి అనువానితో సాయి ”నీవ్ఞ ఊరికే ఎందుకు నరాలు తెంచుకుంటున్నావ్ఞ? అని హితవ్ఞ చెబుతాడు. గౌతమబుద్ధుని కాలంలో భరద్వాజ గోత్రానికి చెందిన ఇద్దరు సోదరులుండేవారు. వారిని ఆక్రోశులనేవారు. కోపం వచ్చినప్పుడు ఒళ్లు మరిచి గట్టిగా అరిచేవారు. చిన్న భరద్వాజునికి వివాహం అయింది. ఆయన భార్య కూడా అంతే. ఇంకా, ఆమెకు చాడీలు చెప్పే అలవాటు కూడా వ్ఞన్నది. ఆమె అదృష్టం గొప్పది. ఆమె బుద్ధుని ప్రసంగం విని వాక్కును సంస్కరించుకున్నది. కోపంతో వాక్కు వశం తప్పుతున్నదనిపించినప్పుడే, ఆమె తథాగతుని స్మరించి వాక్కును వశంలోకి తెచ్చుకునేది. ఆమె అట్లా సంస్కారవంతంగా వ్ఞండటం, కోపాన్ని తెచ్చుకొనకపోవటం భరద్వాజులను చికాకు పరచింది. బుద్ధుని వైపు వారి కోపం తిరిగింది.
ఆమె భర్త అయిన చిన్న భరద్వాజుడు, బుద్ధునిపై కసి తీర్చుకోవాలని, ఆయన వద్దకు వెళ్లి, ”సుఖంగా, శాంతంగా జీవించాలంటే ఏ పశువ్ఞని చంపాలి? అని ప్రశ్నించాడు. బుద్ధుడు సంగతిని గ్రహించాడు. పరమశాంతంగా ”ద్వేషం అనే పశువ్ఞను చంపాలి అన్నాడు. చిన్న భరద్వాజుని పై బుద్ధుని మాటలు ప్రభావం చూపాయి. అతడు భార్య అనుమతితో భిక్షుసంఘంలో చేరిపోయాడు.
ఇక పెద్ద భరద్వాజునికి బుద్ధునిపై ఆగ్రహం కట్టలు తెంచుకుపోతోంది. అతడు బుద్ధుని వద్దకు వెళ్లి దుర్భాషలాడాడు. బుద్ధుడు శాంతంగా వింటున్నాడు. భరద్వాజునికి ఇక తిట్టే ఓపిక నశించింది. బుద్ధుడు ”నీవ్ఞ ఒక వస్తువ్ఞను ఎవరికైనా దానమివ్వదలచినపుడు, ఆ వ్యక్తి, ఆ వస్తువ్ఞను గ్రహించని ఎడల, ఆ వస్తువ్ఞ ఎవరికి చెందుతుంది? ప్రశ్నించాడు భరద్వాజుడిని. ” ఆవస్తువ్ఞ నాకే చెందుతుంది అన్నాడు భరద్వాజుడు. అయినా ఎందుకీ ప్రశ్న వేశారు? సంబంధం ఏమిటి? చికాకుగా ప్రశ్నించాడు భరద్వాజుడు. ఇప్పుడు నీవ్ఞ నాకు తిట్లను దానమిచ్చావ్ఞ. నేను స్వీకరించలేదు. ఆ తిట్లన్నీ నీకే చెందుతాయి కదా. అదే నే చెప్పదలచుకున్నది అన్నాడు బుద్ధుడు శాంతంగా. తన తిట్ల వలన కలిగే దుష్పరిణామాన్ని భరద్వాజుడు గుర్తించాడు. అతడు కూడా శాంతమూర్తి అయ్యాడు. కోపం రాబోయే సమయంలో సాయి మాట లేదా బుద్ధుని బోధ పనిచేస్తాయి
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top