You Are Here: Home » దైవత్వం » సాహిత్యం » ద్వాదశ జ్యోతిర్లింగాలు-విశిష్టత ఓంకారేశ్వరుడు

ద్వాదశ జ్యోతిర్లింగాలు-విశిష్టత ఓంకారేశ్వరుడు

ద్వాదశ జ్యోతిర్లింగాలు-విశిష్టత ఓంకారేశ్వరుడు

ఒకప్పుడు నారదుడు భూ లోక సంచారం చేస్తూ వింధ్య పర్వతాలకు వచ్చాడు. పర్వతుడు విద్యుక్త విధానంగా మహర్షి కి అర్ఘ్యపాద్యాదులు సమర్పించిన తదుపరి ప్రసంగవశాత్తూ ‘‘నాయం దు సమస్త సంపదలు సకల ధాతువులు కోకొల్లలుగ ఇమిడివున్నాయి. కావున పర్వతములన్నింటిలోనూ నేనే పర్వత సార్వభౌముడ’’నని చె ప్పాడు. అప్పుడు నారదడు నవ్వి ‘‘వింధ్యా! నీవెట్లు పర్వతసార్వభౌ ముడవు కాగలవు? మేరు పర్వత శిఖరాలు మహోన్నతాలై దేవలోక ము వరకూ వ్యాపించి వున్నాయి. ఇంద్రాది దేవతలు ఆ పర్వత ములపై విహరిస్తుంటారు. నీకా భాగ్యము లేదు కదా’’ అని వెళ్ళిపో యాడు.

వింధ్యుడు విచారించాడు. మేరు పర్వతముకన్నా తానే అధి కుడననిపించుకోవాలని నిశ్చయించుకున్నాడు.
వింద్యుడు తన శిఖరమున ఓంకార యంత్రమును నిర్మించి, దాని మధ్య పార్ధివ లింగమును స్థాపించి శివునికై ఘోరతపమాచరించా డు. ఇట్లు నూరు మాసాలు కఠోర దీక్షతో సాగిన తపస్సుకు సంత సించి వింధ్యుని వరము కోరుకోమన్నాడు శివుడు. వింధ్యుడు చేతు లు జోడించి ‘‘శంకరా… భక్తవశంకరా…

ద్వాదశ జ్యోతిర్లింగాలు-విశిష్టత ఓంకారేశ్వరుడుమేరు పర్వతములపై విహ రించు దేవేంద్రాదులకు నీ పవిత్ర పాద పద్మములే నిత్య పూజనీయ ములు, అట్టి దేవతా సార్వభౌముడవు గాన నీవు నా శిఖరమునందు వశించి పూజలందుకొన’’మని ప్రార్థించాడు. వింధ్యాద్రి ప్రార్ధనను మన్నించి ఓంకార యంత్రమును, అందు స్థాపించిన పార్ధివలింగమును ఒక్కటిగా చేసి అచట ‘ఓంకారేశ్వరు డు’ అను పేర జ్యోతిర్లింగ రూపుడై వెలిశాడు. ఆనాటి నుండి బ్రహ్మ దిదేవతలూ, మహర్షులూ ఓంకారేశ్వరుని సేవిస్తునందున్న వింధ్యుని కోర్కె నెరవెరింది. నర్మదా నదిని పడవలపై దాటి వెళ్లి భక్తులు ఓంకారేశ్వరుని దర్శించుకుని తరిస్తుంటారు

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top