You Are Here: Home » యాత్ర » తీర్ధ యాత్రలు » ద్వాదశ జ్యోతిర్లింగాలు-విశిష్టత వేశ్వేశ్వర లింగము

ద్వాదశ జ్యోతిర్లింగాలు-విశిష్టత వేశ్వేశ్వర లింగము

ద్వాదశ జ్యోతిర్లింగాలు-విశిష్టత వేశ్వేశ్వర లింగము

templeసృష్ఠిని నిర్మింపదలచి సనాత నుడు, పరబ్రహ్మము అయిన పరమేశ్వరుడు శివశక్తి స్వరూపమును దాల్చినాడు. ఆ అర్ధనారీశ్వర రూపమునుండి పురుషుడగు నారాయణుడు, ప్రకృతి అవతరిం చారు. వారికి తామెవరో ఎక్కడనుండి వచ్చారో తెలియలేదు. అప్పుడు అశరీరవాణి… ‘‘అఖిలాండ కోటి బ్రహ్మాండ ములను సృష్టించుటకు మీరు సృజించ బడ్డారు. ఆ శక్తిని పొందుటకు, పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేయండి’’ అని వినిపించింది. అయితే ఎటుచూసినా జలమే తప్ప నివశించుటకు స్థలమే కానరానందున ఎక్కడ తపస్సు చేయాలో వారికి బోధపడలేదు. అప్పుడు పరబ్రహ్మ తేజము నుండి ఐదు క్రోసు ల విస్తారము గల ఒక పట్టణము నిర్మింపజేశాడు. అదే కాశీ పట్టణము.

పురుషుడైన నారాయణుడు కాశీ పట్టణమునందు ఘోరతపస్సు చేయచుండగా ఆ తపోవేడిమికి అతడి శరీరమున చెమటలు పట్టి ఆ నీరు కాలువలై ప్రవహించి అంతటా నిండిపోయి నది… నారాయణుడా జలమును చూస్తూ ఆశ్చర్యంతో తలపంకిం చగా ఆతడి చెవికమ్మ జారి ఆ జలమునందు పడిపోయింది. ఆ ప్రదేశమే ‘మనికర్ణిక’యను పేర పుణ్యతీర్థమై విరజిల్లుతోంది. అంత ట ఆ జలరాశియందు మునిగి న కాశీపట్టమును పరమేశ్వరుడు తన శూలాగ్రమునందు ధరించి రక్షించినాడు. ఆ తదనంతరం నారాయణుని నాభి కమలము నందుండి బ్రహ్మ అవతరించాడు. ఆతడు పదునాల్గు భువన భాండాలనూ దేవ, మానవ, దానవ జాతులను, పశుపక్షి పక్ష్యాదులను సృష్టించారు.

అండాకారమగు బ్రహ్మాండమును రెండు భాగములుగా ఛేదించి ఊర్ధ్వ భాగములో సప్తలోకాలనూ, అధోభాగముపైన మరొక సప్తలోకాలనూ బ్రహ్మ సృష్టించాడు. రుూ పదునాల్గు లోకములకు పైనా క్రిందా బ్ర హ్మాండము కప్పువలె నిండినది. అప్పుడు విష్ణువు, బ్రహ్మాది దేవతలు మహర్షులు పరమేశ్వరుని స్మరించి ఆతడు దర్శనమిచ్చి నంత బహు విధములుగా స్తోత్రములతో కీర్తించారు. వారి భక్తికి సంతసించిన శివుడు వరము కోరుకోమ న్నాడు. అంతట వారందరూ ముక్తకంఠ ముతో ‘‘దేవాది దేవా… విశ్వమునకే జన కుడవైన విశ్వనాధా! నీవి చటనే శాశ్వత ముగా నిలచి రుూ సృష్టిని చల్లగా కాపా డు’’ అని ప్రార్ధించారు. శివుడు వారి ప్రా ర్ధనలను అంగీకరించి ‘విశ్వేశ్వరుడ’ ను పేర జ్యోతిర్లింగ రూపుడై వెలిశాడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top