You Are Here: Home » ఇతర » దేశస్వాతంత్య్ర సంకుల సమరంలో… కాట్రగడ్డ రామసీతమ్మ

దేశస్వాతంత్య్ర సంకుల సమరంలో… కాట్రగడ్డ రామసీతమ్మ

శాసనోల్లంఘనంతో పాటు పలు ఉద్యమాలలో పాల్గొని బ్రిటీషూ ముష్కరుల లాఠీదెబ్బలు తిని జెైలుకు వెళ్ళిన స్వాతంత్య్ర సమరయోదురాలు కాట్రగడ్డ రామ సీతమ్మ. వీరు 1883 లో గుంటూరు జిల్లా మంగళగిరి తాలూకాలోని మందడం గ్రామంలో జన్మించారు. నూతక్కి కొండయ్య నాగమ్మ దంపతులు వీరి తల్లిదండ్రులు. రామసీతమ్మకు నలుగురు అక్కలున్నారు. ఆ ఇంట వీరు కనిష్ఠ పుత్రిక మందడం గ్రామంలోని వీధి బడిలో ఉన్నంతవరకు చదువుకున్నారు.

Rama1900లో విజయవాడ మొగల్రాజపురం వాస్తవ్యులెైన కాట్రగడ్డ నరసయ్యతో రామసీతమ్మ వివాహాం జరిగింది. వీరికి సంతానం లేకపోవడంతో మధుసూదన రావును దత్తత తీసుకున్నారు. 1916లో భర్త నరసయ్య చనిపోవడంతో వెైధవ్యం ప్రాప్తించింది. 1920 నుండి కుమారుడెైన మధుసూదన రావు జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. పశ్చిమ కృష్ణాజిల్లా కాంగ్రెసు సంఘానికి మధుసూదనరావు కొంతకాలం కార్యదర్శిగా కూడా ఉన్నారు. తనయుని బాటలోనే రామసీతమ్మ నడిచారు. జాతీయోద్యమంలో పాల్గొన్నారు. రామ సీతమ్మ ఇంటి ప్రక్కనే మంచినీళ్ళ బావి ఉండేది. నలుగురూ చేరే ఆప్రదేశంలో కొందరు యువకులు 14.11.1932న మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బ్రిటీషూ పోలీసులకు ఈ విషయం తెలసి లాఠీలతో చితకబాదారు.

గాయపడిన ఆయువకుల్ని రామసీతమ్మ తల్లిలా ఆదరించారు. వాత్సల్యాభిమానాలతో వారికి సేవలు చేసి భోజన వసతి కల్పించారు. అప్పటి ప్రభుత్వ పాలనలో ఇటువంటి పనులు చేయడం రాజద్రోహం. ఆకారణంగా ఆమెను అరెస్టుచేసి జెైలుకు పంపించారు. ఏడాదిపాటు కఠిన శిక్ష విధించి ‘సి క్లాసు ఇచ్చారు. పెైగా రూ. 500/- కూడా జరిమానా విధించారు. ఇంతపెద్ద శిక్ష వేస్తే ఆమె భయపడి క్షమాపణ చెబుతారని అధికారుల అంచనా. అయితే రామ సీతమ్మ అదరలేదు, బెదరలేదు. జరిమానా చెల్లించలేదు. రాయవేలూరు జెైలుకు వెళ్ళడానికే సిద్ధపడి నారు. రామసీతమ్మతోపాటు కుమారుడెైన మధుసూదనరావు జెైల్లో ఉన్పపడు బ్రిటిషూ పోలీసులు వీరి ఇంటిపెై దాడి చేశారు.

ఇంట్లోని సామగ్రి, మంచాలు, పరుపులు, ధాన్యం బళ్ళకెత్తి తీసుకెళ్ళి వేలం వేశారు. అలా వేలం వేయగా వచ్చిన డబ్బును జరిమానా బాకీ తీరలేదు. ఆ కారణంగా కోడలు ఒంటిపెై నగలను సైతం బ్రిటిషూ పోలీస్టేషన్‌ తీసుకుని వెళ్లారు. ‘సి’ క్లాసు జెైలులో నరకాన్ని చూపించారు.ఇన్ని ఇబ్బందులను సహించి ఆమె జెైల్లో గడిపారు. ఇవి చాలవన్నట్లు జెైల్లో ఉండగానే రామసీత మ్మకు పక్షవాతం వచ్చి కాలు, చేయి పడిపోయాయి. జెైలు అధికారులు నిర్దాక్షణ్యంగా బ్రతికి ఉండగానే శవాలగదిలో ఆమెను ఉంచారు. అటువంటి దీన పరిస్థితి నుండి ఆమె కోలుకున్నారు. క్షమాపణ చెపకుంటే విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. అందుకు ఆమె ససేమిరా అన్నారు . అనంతరం రామసీతమ్మను రాయవేలూరు నుండి మదురెై జెైలుకు శిక్ష ముగిసిన పిదప జెైలునుండి ఇంటికి చెరారు.

హరిజనోద్ధరణ ప్రచారం చేస్తున్న గాంధీజీ 1933లో ఆంధ్రప్రదేశ్‌ వచ్చారు. ఆసమయంలో విజయ వాడ దుర్గాభవనంలో స్ర్తీల బహిరంగ సభ జరిగింది. ఆ సభలో పాల్గొన్న స్ర్తీలనుద్దేశించి అస్ప్రృ స్యతా నివారణ, హరిజనోద్ధరణల గురించి గాంధీజీ ప్రసంగించారు. గాంధీజీ తన జీవితకాలంలో ఆరుసార్లు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. 1929లో వచ్చినపుడు రామసీతమ్మ నగదు, నగలు, జాతీయోద్యమనిధికి సమర్పించిన వారిలో ఉన్నారు. 1933లో గాంధీజీ రెండవ సారి వచ్చినపడు హరిజన నిధికి రూ. 1300/- లతో పాటు ఒంటిపెై నున్న నగలు, గాజులు, ఉంగరాన్ని ఆనందంగా ఇచ్చేశారు.

రామసీతమ్మ దత్త పుత్రుడెైన మధుసూదనరావు హరిజనులతో సహ పంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సంఘటనతో బంధువులంతా వారిని వెలివేశారు. ఆ పరిస్థితుల్లో రామసీతమ్మ కుమారుని పక్షాన నిలిశారు. ఆ తరువాత బంధువుల ఆక్షేపణ సమస్య సమసిపోయింది.1947లో భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. స్వాతంత్య్రానంతరం కూడా ఆమె సంఘానికి, దేశానికి ఉపకరించే పనులు చేశారు. పశ్చిమ కృష్ణా జిల్లా కాంగ్రెసు చరిత్ర సంగ్రాహం మొదటి కూర్పు అయిపోగానే రెండవసారి అచ్చు వేయించి స్వాతంత్య్ర సమరయోధులందరికీ ఉచితంగా పంచారు. దేశ సేవకులంటే ఆమెకు అమితమైన ఇష్టం.

భారత ప్రభుత్వం తామ్రపత్రం బహుకరించి గౌరవించింది. అయితే రామసీతమ్మ స్వాతంత్య్ర సమరయోధులకిచ్చే పెన్షన్‌ను మాత్రం స్వీకరించలేదు. కొడుకు, కోడలు మునిమనుమల మధ్య ఆనందంగా 90 సంవత్సరాలు జీవించిన ఆమె 491973న స్వర్గస్తులెైనారు

– షేక్‌ అబ్దుల్‌ హకీం జాని

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top