You Are Here: Home » ఇతర » దేశసేవేక అంకితమైన సాధ్వి దేవులపల్లి సత్యవతమ్మ

దేశసేవేక అంకితమైన సాధ్వి దేవులపల్లి సత్యవతమ్మ

కవయిత్రిగా దేశసేవికగా ప్రజచే వేనోళ్ల ప్రశంసలందిన వనితాజ్యోతి సత్యవతమ్మ. ఈమె పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు తాలూకా అత్తిలి గ్రామంలో 1893 జూన్‌ 15న వంగల వాసు దేవుడు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. బాల్యంలోనే వివాహం, అనతికాలంలోనే వైధవ్యం కూడా ప్రాప్తించాయి. ఏమి జరిగిందో కూడా తెలుసు కోలేని పసివయస్సు ఆమెది. రాజమండ్రిలో మాధ్యమిక విద్యతో చదువుకు స్వస్తి చెప్పారు. అయితే వీరి తల్లి వీరిని తీర్చిదిద్దారు. మంచి సాహిత్యాన్ని ఇంట్లోనే రుచి చూపించారు. తన అన్న వంగల దీక్షితులు ప్రోత్సాహంతో వందేమాతరం ఉద్యమం నుండి జాతీయాభిమానం కలిగింది.

Devulapవీరు తన 11వ ఏట రాజమండ్రిలో బిపిన్‌ చంద్రపాల్‌ ఆవేశపూరితంగా చేసిన ఉపన్యాసం విన్నారు. నాటి నుండి దేశసేవ పట్ల ఆసక్తి పెంచుకున్నారు. విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో సత్యవతమ్మ చురుకుగా పాల్గొన్నారు. 1923 కాకినాడ కాంగ్రెసు సమావేశా నంతరం దుర్గాబాయమ్మతో పరిచయమేర్పడింది.1930 ప్రాంతంలో ఉపసత్యాగ్రహం ఊపందుకుంది. ఎక్కడ చూచినా ఉద్యమకారులు ఉప వండేవారు. బ్రిటిషూవారు ముమ్మరంగా దాడి జరిపి నిరోధించేవారు. శాస నోల్లంఘన చేసిన వారిపై లాఠీలు స్వైర విహారం చేసేవి. వీరు నిర్భయంగా శాసనోల్లంఘన చేసి లాఠీదెబ్బలు తిన్నారు. ఈమె తల్లాగ్రడ విశ్వసుందరమ్మ, శృంగారకవి లకీనరసమ్మలతో కలసి మీరాబాయి చరఖా పాఠశా లలో ఏకులు చేయడం, నూలు వడకటం నేర్పేవారు. తణుకులో హిందీశిక్షణా తరగతులు నిర్వహించారు.

రెండవ రౌండుటేబుల్‌ కాన్ఫరెన్సు కోసం గాంధీజీ ఇంగ్లాండు వెళ్లారు. ఆ సమయంలో ముంబైలో అఖిలభారత స్ర్తీసేవాదళ శిబిరం నెలకొల్పి శిక్షణనిచ్చారు. అక్కడ శిక్షణ పొందడానికి దుర్గాబాయమ్మ పోతూ వీరిని కూడా ముంబై తీసుకొని వెళ్లారు. వీరు నెలరోజులపాటు శిబిరంలో శిక్షణ పొందారు. ఆ శిబిరంలో సరోజినీ నాయు డు, కమలాదేవి ఛటోపాధ్యాయ వంటి అనేకమంది దేశ సేవికల ఉపన్యాసాలు వీరిని ప్రభావితం చేసాయి. ఇంగ్లాండు వెళ్ళిన గాంధీజీ తిరిగివచ్చారు. చర్చలు విఫలం కావడంతో శాసనోల్లంఘన తప్పలేదు. దీంతో పోలీసులు శిబిరాన్ని స్వాధీన పరుచుకున్నారు. ఇతర స్ర్తీలతో పాటు సత్యవతమ్మ కూడా ఇల్లు చేరుకు న్నారు. 144వ సెక్షన్‌ అమలులో ఉన్నప్పటికీ ఎటువంటి జంకు, గొంకు లేకుండా ఈమె పికెటింగులు నిర్వహించారు. ఫలితంగా ఈమెను అరెస్టు చేసి, రాయవేలూరు జైలుకు పంపించారు. ఆరునెలల శిక్ష ముగించుకుని ఇల్లు చేరుకున్నారు.

ఆ కాలంలో స్ర్తీలకు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు లేవనే చెప్పాలి. అటువంటి భారత స్ర్తీకి గాంధీజీ జాతీయో ద్యమం పేరుతో స్వతం్త్రం లభించింది. 1932లో జాతీయోద్యమ ఉధృతి కొంతమేరకు తగ్గినా స్ర్తీలలో ప్రగతిని సాధించాలనే తపన కలిగింది. ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కలెక్టరుతో తన అభి ప్రాయాన్ని సత్యవతమ్మ తెలియజేశారు. నాటికి ప్రభుత్వ అధికారుల వైఖరిలో పెనుమార్పు వచ్చింది. బ్రిటీషూవారి ఆఙ్ఞలకు వారు బద్ధులై ఉన్నప్పటికీ దేశసేవకుల పట్ల గౌరవం, ఆదరణ వారికి పెరిగాయి. అందువలన ఆమె స్ర్తీ విద్యాభివృద్ధికై ఒక సంస్థను నెలకొల్పాలనుకున్నపడు అదో రాజకీయ నేరంగా వారు పరిగణించలేదు. సంతోషంగా స్థలాన్ని కేటాయించారు.

అకాలమరణం చెందిన వీరి కుమార్తె పేరుతో భవన నిర్మాణానికై ఒక తహసీల్దారు ధనసహాయం చేశారు. ఆ విధంగా 1932లో తణుకులో శ్రీబాలసరస్వతీ స్ర్తీ సేవాసమాజాన్ని స్థాపించారు. ఆసంస్థ ఆధ్వర్యాన ఒక సంస్క ృత కళాశాల, బాలికల హైస్కూలు, గ్రంథాలయాలు ఏర్పడినాయి. ఆ తరువాత మి్త్రుల సహకారంతో నిధులు సేకరించి ఆ పాఠశాలను పక్కా స్వంత భవనం నిర్మించారు. వీరికి ఏ పదవీ వ్యామోహాలు లేవు. అందుకే ఎక్కడి యాంగ్లదేశమిది.

ఎక్కడి భారతదేశమద్దిరా!
ఇక్కడిగుదించి, యిటులెంతయు దీక్షను మాదుముక్తికై
తక్కక రాత్రియుంబవలు తల్లిరొ! స్లేడురో పాటునొందునీ
ఎక్కువయిన ఈ ఋణముననే గతి నీ గెదమమ్ము యుమ్మహిన్‌.

ఈ విధంగా ఆమె కవితాగానం కమనీయంగా సాగి ఆద్యంతం విశేష ప్రశంసలందుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకా, నల్లజర్ల బ్లాకులో పంచాయతీ తరపున కొన్ని వేలమంది సమక్షంలో 30-9-1975న సత్యవతమ్మకు ఘన సన్మానం జరిగింది. 5-10-1975న గణపవరం పంచాయతీ స్ర్తీల విభాగం తరపున గౌరవించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ఓబుల్‌రెడ్డి అధ్యక్షతన 16-12-1975న వీరిని కవయిత్రిగా, దేశసేవికగా గౌరవించారు. ఉగాది పండుగ సందర్భంగా 24-3-1974న తామ్ర ప్త్రం ఇచ్చి ప్రభుత్వం ఆమెను సత్కరించింది.

– షేక్‌ అబ్దుల్‌ హకీం జాని

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top