You Are Here: Home » ఇతర » దేశభక్తికి నిలువుటద్దం మాసుమా బేగం

దేశభక్తికి నిలువుటద్దం మాసుమా బేగం

స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న అనేకమందిముస్లీం మహిళలో ఒకరు మాసుమా బేగం. ఈమె 7 అక్టోబర్‌ 1901లో తయ్యబాబేగం బిల్‌గ్రామి, డాక్టరు ఖదీవ్‌ జంగు దంపతులు ఏకైక సంతానంగా హైదరాబాద్‌లో జన్మించారు. ఈజిప్టు భారతదేశ ప్రతినిధిగా పనిచేసి, మహారాష్ర్ట గవర్నర్‌గా గొప్పకీర్తి ప్రతిష్ఠలు సాధించిన ఆలీయవర్‌జంగ్‌ ఆమె ఏకైక సోదరుడు. మాసుమా బేగం తల్లి తయ్యబా బేగం హైదరాబాద్‌లో పుట్టి పెరి గారు. ఆమె చదువుకున్న లిటిల్‌ గరల్స్‌ హైస్కూలు ప్రస్తుతం ఉస్మానియా మహిళా కళాశాలగా ఎదిగింది. ఆమె పెద్దలే ఈ స్కూలును స్థాపించారు. తయ్యబా బేగం, సరోజినీ నాయుడు ఇద్దరూ మంచి స్నేహితులు . మాసుమాబేగం ఆమె వారసురాలుగా సకల సద్గుణాలను పుణికి పుచ్చుకున్నారు.

aMasaమాసుమాబేగం తన తొమ్మిదవ ఏట హైదరీక్లబులో జూనియర్‌ మెంబరుగా చేరారు. మహబూబిలియా పాఠశాలలో స్కూలు ఫైనల్‌ వరకు చదివారు. ఆమె చూపిం చిన ఉర్దూ భాష పాండిత్యానికి గాను బంగారు పతకం పొందా రు. 1922లో మాసుమాబేగం బంధువర్గానికి చెందిన హూసై న్‌ ఆలీఖాన్‌తో వివాహమైనది . ఆయన గొప్ప విద్యావేత్త. ఆలిండియా ఉమెన్స్‌ కాన్ఫరెన్స్‌ 1927లో స్థాపించడింది. మాసుమాబేగం అందులో పాల్గొనడం ప్రారంభించి ప్రతి సమావేశానికి హాజరయ్యే వారు. స్ర్తీలకు సంబంధించిన ప్రతి సమస్యను మాసుమా విపులంగా చర్చించేవారు. 1962 నుం డి 1964 వరకు ఆ సంస్థకు మాసుమాబేగం అధ్య క్షురాలిగా ఉన్నారు. ఈ పదవిలో ఉండగా లండన్‌కు చెందిన ఉమెన్స్‌ కౌన్సిల్‌ వారు ఆమె గౌరవార్థం 1963లో గొప్ప విందు ఏర్పా టు చేశారు. 1955లో అంతర్జా తీయ మహిళా మైత్రి సమా జం స్వర్ణోత్స వాలు సిలోన్‌లో జరిగాయి.

మాసుమాబేగం ఆ ఉత్సవాలకు ప్రాతినిధ్యం వహించారు. 1963లో భారతబృం దానికి నాయకత్వం వహిస్తూ ఇండోనేషియాకు వెళ్ళారు.ఆయుధ విసర్జన ప్రపంచస్థాయి సమాఖ్య సమావేశంలో పాల్గొనటానికి వెళ్ళిన భారత బృందానికి మాసుమాబేగం నేతృ త్వం వహించారు. అంతర్జాతీయ స్థాయిలో మనదేశానికి, ఇక్క డి మహిళలకు ప్రాతినిధ్యం వహించి పలువురి ప్రశంస లందు కుని దేశకీర్తిని ద్విగుణీకృతం చేశారు. 1911లో తనతల్లి స్థాపించిన అంజుమానే ఖవాతీన్‌ అనే సుప్రసిద్ధ సంస్థను ఆమె సమర్థవంతంగా నడిపారు.1934 నుండి రమారమి దశాబ్ద కాలంపాటు ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్‌ సభ్యులుగాను ఫైనాన్స్‌ కమిటీ సభ్యురాలిగాను ఉన్నారు. వయోజన విద్యా సమితి సభ్యురాలుగా నిజాం ప్రభుత్వం 1950లో ఆమెను ఎన్నుకున్నారు. పేదపిల్లల ఉచిత విద్యా కార్యక్రమాన్ని బహుళ ప్రచారంలోకి తెచ్చారు. సేవ్‌ చిల్డ్రన్‌ కమిటీలో సభ్యత్వం వహించారు. మహిళల్లో చైతన్యం కలిగించారు.

మాసుమా బేగం 1966లో కేంద్ర సంఘ సంక్షేమ సమితికి ఛైర్మన్‌గా ఎన్నికైనారు. ఆ పదవీ కాలంలో పిల్లల పెంపకము లో తల్లులకు శిక్షణ నిప్పించారు. పిల్లలు అభివృద్ధిలో రావటా నికి యూనిసేఫ్‌ వారి సహకారంతో నూతన పథకాలు తయా రు చేయించారు. ప్రత్యేక ఆంధ్రరాష్ర్టం ఏర్పడిన పిదప ఆమె కేంద్ర సంఘ సంక్షేమ సమితి ఆంధ్రరాష్ర్టశాఖలో తెలంగాణా విభాగానికి ఛైర్మన్‌గా పని చేశారు. కాంగ్రెసు తరఫున 1952 లో మాసుమా పోటీ చేశారు. ఆమె వక్తృత్వం నిర్వాహణాశక్తి అందరికీ తెలిసినవే. ఆ కారణంగానే ప్యానల్‌ ఆఫ్‌ ఛైర్మన్‌కు ఎంపికై అనేక శాసనసభా సమావేశాలకు సమర్థవంతంగా నిర్వహించేవారు. 1957లో కాంగ్రెసు తరఫున ఎన్నికల్లో పోటీచేసి తిరిగి శాసన సభ కాంగ్రెసు సభ్యులకు డిప్యూటీ రీడర్‌గా ఎన్నిక య్యారు. 1960 జనవరిలో ఆంధ్ర రాష్ర్ట ప్రభు త్వంలో ఆమె సంఘ సంక్షేమశాఖ, ముస్లిం ధర్మాదాయ, సాలా ర్‌జంగ్‌ ఎస్టేట్‌ నిర్వహణ శాఖల మంత్రిణిగా పదవీ స్వీకారం చేశారు.

ప్రతిరంగంలో ఆమె సేవలు అందించారు. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల సంక్షేమ సమితిలో కూడా ఆమె సభ్యురాలిగా ఉండి అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేశా రు. రెడ్‌క్రాస్‌ సంస్థకు యావజ్జీవ శ్రేయోదాయనిగా లైఫ్‌ అసో సియేట్‌గా సేవలు అందించారు. ఆమె భారత స్కౌటు ఉద్యమా నికి చేసిన సేవకుగాను లేడీబి డెన్‌ పావెల్‌ పతకంతో సత్కారం పొందారు. కుల, మత, వర్ణ, వర్గ, జాతి ప్రసక్తి లేకుండా ప్రతి ఒక్కరూ మాసుమా బేగంను ప్రశంసిస్తారు.

– షేక్‌ అబ్దుల్‌ హకీం జాని

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top