You Are Here: Home » దైవత్వం » సాహిత్యం » దేవ సంసృ్కతి దర్శనం గాయత్రీ మంత్రం

దేవ సంసృ్కతి దర్శనం గాయత్రీ మంత్రం

దేవ సంసృ్కతి దర్శనం గాయత్రీ మంత్రం

 

గాయత్రీ మంత్రం ఒక జీవన దర్శనం, ఒక ఫిలాసఫీ. అది జీవించే కళ. అది ఒక ఆలోచనా విధానం, ఒక జీవన సరళి, సమాజ నిర్మాణానికి ఒక పద్ధతి. అది విశ్వ శాంతికి మూల మంత్రం. గాయత్రీ మంత్రం ఒక దివ్య జ్ఞానం. గాయత్రి దేవమాత. గాయత్రీ ఉపాసన వల్ల మనిషి దేవత అవుతాడు. గాయత్రిలోని 24 అక్షరాలతో నిండి ఉంది ధర్మం, నీతి, జీవితం, కళ, సామాజిక వ్యవహరణలను గురించిన బోధ. మనిషి యొక్క ఆలోచనలనూ, భావనలనూ, లక్ష్యాన్నీ, దృక్పథాన్నీ క్షాళన చేస్తే అతడి శారీరక, మానసిక క్రియలలో సత్వగుణమూ, ధర్మ నిష్టా పెంపొందుతారుు.
దేవ సంసృ్కతి దర్శనం గాయత్రీ మంత్రంగాయత్రిలోని అక్షరాలు చేసే మహాబోధలను అనుసరిస్తే – 2 ప్రక్రియ అమలు జరుగుతుంది. కనుకనే గాయత్రి వేద శాస్త్రాల సారం.

ఓం
ప్రకృతి అంతరాళంలో ‘ఓం’ వంటి ధ్వని ప్రతి క్షణం ఉత్పన్నం అవుతోంది. ఈ పరమేశ్వర నామాన్ని సూక్ష్మ ప్రకృతి ప్రతి క్షణం జపిస్తోంది, నినదిస్తోంది. కనుక ఈ నామం అకృ త్రిమం, స్వయం వ్యక్తం, సర్వశ్రేష్టం అయినది. ఆస్తికత అంటే అర్థం – సత్వగుణాన్నీ, దైవీయ, ఈశ్వరీయ, పారమార్థిక భావనలనూ హృదయంలో నింపుకోవడం. నాస్తికత అంటే అర్థం – తామసంతో, అసురత్వంతో, భోగవాదంతో, స్వార్థంతో కూడిన వాసనలలో మునిగిసోవడం.

ఓంలో అ ఉ మ్‌ అనే మూడు అక్షరాలు కలసి ఉన్నాయి. ‘అ’ అంటే అర్థం ఆత్మపరాయణత్వం; మనస్సును శారీరక విషయాల నుండి తప్పించి, ఆత్మానందంలో ఓలలాడడం. ‘ఉ’ అంటే అర్థం ఉన్నతి. శారీరక, మానసిక, సామాజిక, ఆర్థిక, ఆత్మిక సంపదలతో మనల్ని నింపుకోవడం. ‘మ్‌’ అంటే అర్థం మహానత, గొప్పతనం, క్షుద్రతనూ, సంకుచితత్వాన్నీ, స్వార్థపరత్వాన్నీ, ఇంద్రియ చాపల్యాన్నీ వదులుకోవడం ఆదర్శాలు; ప్రేమ, దయ, ఉదారత, సేవ, త్యాగం సంయమనం ఆధారంగా జీవితాన్ని నిర్మించుకోవడం.

భూః
మనం శరీరాలను కాము – ప్రాణములము, ఆత్మలము. శరీరానికి ప్రాధాన్యాన్ని ఇస్తూ ఆత్మను ఉపేక్షించడం భౌతికవాదం. ఆత్మకు ప్రాధాన్యాన్ని ఇస్తూ, శరీరాన్ని తగు విధంగా రక్షించడం ఆధ్యాత్మవాదం. మనం ఆత్మలమనీ, కనుక మన శ్రేయస్సు ఆత్మపరాయణత్వంలో ఉన్నదనీ గాయత్రి చెపుతుంది. మనం ఆత్మవాదులం కావాలి. ఆత్మ కల్యాణానికీ, ఆత్మచింతనకూ, ఆత్మోన్నతికీ, ఆత్మగౌరవానికీ అగ్రప్రాధాన్యం ఇవ్వాలి. వాటి కోసం కృషి చేయాలి. సమాజ సేవ ద్వారా విరాట్‌ పురుషుడూ, విశ్వ మానవుడూ అయిన పరమాత్మను ఆరాధించాలి.

భువః
ఈ అక్షరం మనకు కర్మయోగ సందేశాన్ని ఇస్తోంది. ఎందుకంటే – కర్మయోగం ఆధారంగానే మనం అన్ని రకాల దుఃఖాల నుండి విడువల పొందగలుగుతాము. సత్ఫలితాలను సాధించాలంటే మన జీవనం వికాసం పొందాలంటే చేయవలసిన పనిలో మనం పూర్తిగా నిమగ్నం కావాలి. ఇలా నిర్ణయించుకోవడంలో బుద్ధికుశలత, దూరదృష్టి, వివేకం ఇమిడి ఉన్నాయి. మనం మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నప్పుడు – వైఫల్యానికి క్రుంగిపోవడంలో, సాఫల్యానికి పొంగిపోవడంలో అర్థం లేదు. ఫలితాన్ని ఇచ్చే శక్తి వేరొకటి. మనం మన కర్తవ్యాన్ని పూర్తి చేయాలి. ఈ భావనయే అనాసక్త యోగం. ఈ దృక్పథం కలిగిన వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. దుఃఖంలో, కష్టంలో విచారించవలసిందేమీ అతడికి కనిపించదు.

స్వః
మనస్సును నీలోపల స్థిరంగా ఉంచుకో, నీవు లోలోపల దృఢంగా ఉండు. ‘సంఘటనలనూ, పరిస్థితులనూ నీటి అలలుగా పరిగణించు. వాటితో ఆడుకుని ఆనందించు. అనుకూల పరిస్థితులలోని స్వారస్యాన్నీ, ప్రతికూల పరిస్థితులలోని స్వారస్యాన్నీ ఆస్వాదించు. అయితే – వాటివల్ల ఉద్విగ్నుడవు కావద్దు, అస్థిరుడవు కావద్దు, నీ సమతూకాన్ని కోల్పోవద్దు. సంతోష దుఃఖాల ఈ బాల్య క్రీడలలో మనం మునిగిపోకూడదు. మనం ఆత్మపరాయణులం కావాలి. ‘స్వః’ను తెలుసుకోవాలి. ఆత్మ చింతనలో, ఆత్మ విశ్వాసంలో, ఆత్మ గౌరవంలో, ఆత్మ నిష్టలో, ఆత్మ సాధనలో, ఆత్మోన్నతిలో, ఆత్మ నిర్మాణంలో మనం మన ఇచ్ఛా శక్తినీ, ఊహా శక్తినీ, క్రియా శక్తినీ వినియోగించాలి. ఎందుకంటే లోపలి మూల కేంద్రం, జన్మ స్థలి ఆత్మయే. ఆత్మ – స్థితుడయిన మనిషి యొక్క అంతరంగం ఆరోగ్యకరంగా ఉంటుంది. కనుక అతడు సదా సంతోషంగా ఉంటాడు.

తత్‌
జీవన, మరణాల రహస్యాన్ని తెలుసుకో. భయమూ, ఆసక్తీ లేకుండా జీవించు. వాస్తవికత అనే గట్టి ఆధారంపై నీ కార్యకలాపాలను రూపుదిద్దుకో. జీవితంలోని క్షణాలను సద్వినియోగపరచుకుంటే, ఆత్మలాభం అనే నిజమైన ప్రయోజనం కోసం వాటిని ఉపయోగిస్తే – నేడో రేపో మృత్యువు ఎదురైనప్పుడు మనం పశ్చాత్తాప పడవలసిన, దుఃఖించవలసిన అవసరం ఉండదు.

సవితుః
సూర్యుని వలె తేజస్విగా మారు. సప్త బలాలనూ నీ జీవిత రథానికి కట్టివేయి. మన అదృష్టానికీ, మన పరిస్థితులకూ నిర్మాతలం స్వయంగా మనమే. మన సామర్థ్యం ఆధారంగా మన ప్రతి ఇచ్ఛనూ, ప్రతి అవసరాన్నీ పూర్తి చేసుకునే బలం మనకు పూర్తిగా ఉంది. శరీర బలం, బుద్ది బలం, విద్యా బలం, ధన బలం, సంఘటన బలం, శీల బలం, ఆత్మ బలం – ఈ ఏడూ జీవితంలో వెలుగునూ, ప్రతిష్టనూ, సంపదనూ, స్థిరత్వాన్నీ నింపడానికి అవసరం అవుతాయి.

వరేణ్యమ్‌
మనం దురాలోచనను వదిలి సదాలోచనను స్వీకరించాలి. అమంగళకరమైన ఆలోచనను వదిలి మంగళకరమైన ఆలోచనను స్వీకరించాలి. అందువల్ల మనస్తాపం, అసంతృప్తి అంతమవుతాయి; అంతటా అన్ని పరిస్థితులలో ఆనందం తాండవిస్తుంది. ఒక మనిషి యొక్క అంతరిక ఉన్నతియే అతడి శేష్టత్వానికి కారణం అవుతుంది. మనం గొపావాళ్లం కావాలి, శ్రేష్టులం కావాలి, సంపన్నులం కావాలి. అయితే భౌతిక వస్తువు కాక, ఆంతరిక పరిస్థితి వాటికి పునాధి కావాలి.

భర్గో
మనుషులు పాపరహితులు కావాలి; పాపాల పట్ల మెలకువ వహించాలి; పాపాల వల్ల కలిగే దుష్ఫలితాలను గుర్తించి, వాటిని ఏవగించుకోవాలి; వాటిని నాశనం చేయడానికై నిరంతరం సంఘర్షణ జరుపుతూ ఉండాలి. పవిత్రత కోసమై మన కృషి కొనసాగితే – ప్రపంచంలోని కష్టాల నుండీ, భవ బంధనాల నుండీ విముక్తి పొంది, మనం జీవన్ముక్తునిలో ఉండే స్వర్గమయ ఆనందాన్ని చూరగొనగలుగుతాము.

దేవస్య
మలినమైన దృక్పథాన్ని వదిలి, విశుద్ధమైన ఆలోచనా విధానాన్ని అవలంభించాలి. అసురత్వపు విధానాన్ని వదిలి దేవత్వపు కార్యకలాపాలను చేపట్టాలి. భవిష్యత్తులో దుఃఖాన్ని కలిగించే, ఆత్మను పతనం చెందించే క్షణిక సుఖాలకూ, ఆకర్షణలకూ, ప్రలోభాలకూ దూరంగా ఉండాలి. మనం దేవతత్వాన్ని వికసింపజేసు కోవాలనీ, దేవత్వాన్ని ప్రోత్సహించాలనీ, దైవీయమైన ఆత్మ సంకేతాలను అనుసరించాలనీ గాయత్రి బోధిస్తోంది.

ధీమహి
మనం మనలోపల సద్గుణాలను నింపుకోవాలి. నమ్రంగా, మధురంగా, శిష్టంగా, భయరహితంగా, దయాళువుగా, పురుషార్థ పూరితంగా, అలసత్వరహితంగా, శ్రమశీలంగా మన స్వభావాన్ని మలచుకోవాలి. మన వ్యవహరణలో ఉదారత, సత్యసంధత, నిజాయితీ, కపటరాహిత్యం, సహృదయత, న్యాయపరాణత్వం, సమానత్వం, ఉద్యమించే గుణం ప్రతిబింబించాలి. ఆరోగ్యం, కీర్తి, ప్రతిష్ట, ఉన్నత పదవి, ధనం, వైభవం మున్నగు వాటిని అందించే గుణాలనూ, విశేషతలనూ, అర్హతలనూ మనం గడించాలి. భగవద్గీతలో 26 దేవీ గుణాలు పేర్కొనబడ్డాయి. వాటి సారాంశం – ఉద్వేగం లేకపోవడం, స్వచ్ఛత, వివేకశీలత, సహనశీలత, సంయమనం, శక్తి సమీకరణ, ఉదారత, కర్తవ్య పరాయణత, ఈ గుణాలను మన స్వభావంలో, అభ్యాసంలో ఇమడ్చడం అంటే – శిఖరాగ్ర స్థాయి సంపదను ఉత్పత్తి చేయడమే.

ధియో
ఏ గ్రంథం కన్న, ఏ వ్యక్తికన్న వివేకం మరింత ప్రధానమైంది. కనుక బుద్ధి సంగతమూ, వివేక సమ్మతమూ, మనకు యోగ్యమూ, సముచితమూ అయిన దానిని మాత్రమే గ్రహించాలి. వివేకం అనే గీటురాయి మీద గీయడం ద్వారా మనం ప్రతి సందర్భంలో మంచి చెడ్డలను కనుగొనగలుగుతాము. మనం వివేకవంతులం కావాలి. వివేకాన్ని అవలంభించాలి. వివేకమనే గీటురాయిపై గీసి, మనం మన ఆలోచనలనూ, పనులనూ, నిర్ణయించుకోవాలి.

యోనః
మన శక్తులలో సాధనాలలో – అవి తక్కువగా ఉన్నా, హెచ్చుగా ఉన్నా – అతి కనీసమైన భాగాన్ని మన అవసరాల కోసం వినియోగించాలి; మిగతా భాగాన్ని నిస్వార్థ భావంతో అసమర్థులకు పంచాలి. కూడబెట్టడం, అనుభవించడం అనే ఎండమావుల వెంట పరుగులు తీయకూడదు. మన అవసరాలను కనీస స్థాయికి తగ్గించుకోవాలి. వాటిని పూర్తి చేసుకున్న తరువాత మిగిలి ఉన్న శక్తిలో అత్యధిక భాగాన్ని బలహీనూలనూ, పేదలనూ, అమాయకులనూ, చదువురాని వారినీ పైకి తేవడానికై ఖర్చు చేయాలి. ఈ పని దైవ కార్యంలో పాల్గొనడమే. మన బుద్ధి కుశలతనూ, దూరదృష్టినీ, కర్తవ్య పరాయణతనూ నిరూపించడమే ఇది. ఆత్మ సంయమనంతో, పరమార్థంతో కూడిన ఈ దైవ మార్గాన్ని ‘యోనః’ మనకు చూపుతుంది. ఈ మార్గంలో పయనించే గాయత్రీ ఉపాసకుడు జీవన లక్ష్యాన్ని సాధించి తీరుతాడు.

ప్రచోదయాత్‌
ఓ భగవంతుడా! మాకు ప్రేరణను ప్రసాదించు. మా బుద్ధికి స్ఫూర్తిని ఇవ్వు. బుద్ధిలో ప్రేరణ జనిస్తే – ధనం, వైభవం అన్నీ స్వయంగా మన కాళ్ల వద్ద మోకరిల్లుతాయి. ఈ ప్రేరణ లేకపోతే కుబేరుని ఖజానాను పొందినప్పటికీ, సోమరులు దాన్ని వృథా చేస్తారు. గాయత్రిలోని ‘ప్రచోదయాత్‌’ శబ్ధంతో సద్భుద్ధికి మాత్రమే ప్రేరణ ఇవ్వవలసిందని మనం పరమాత్మను యాచన చేస్తున్నాము. మీరు ఎవ్వరినీ నిరుత్సాహపరచవద్దు. ఆత్మవిశ్వాసాన్ని కూలద్రోసే మాటలను, నిరాశ అనే కూపంలో కూరుకుపోయేటట్లు చేసే మాటలను మీరు ఎవరికీ చెప్పవద్దు. ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించండి. మనిషిలోని ఆలోచనలను ఉన్నతం ఉదాత్తం చేసేదీ, సన్మార్గంలో పయనించడానికి మనిషి ఆత్మను ప్రోత్సహించేదీ అయిన జ్ఞానాన్ని ఇవ్వడం అన్నింటినీ మించిన దానం. మీరు మిమ్మల్ని ప్రాణవంతులను చేసుకోండి; ఇతరులతో ప్రాణ శక్తిని నింపండి.

గాయత్రి వల్ల భయరాహిత్యం
అంపశయ్యపై పడిఉన్న భీష్మ పితామహుణ్ణి యుధిష్ఠిరుడు అడిగాడు – ఏ మంత్రాన్ని జపిస్తే మనిషికి శాంతి, పుష్టి, రక్షణ, నిర్భయత్వం లభిస్తాయని. భీష్మ పితామహుడు ఇలా జవాబిచ్చాడు – ‘ఓ యుధిష్ఠిరా! గాయత్రి జపం చేసే వ్యక్తికి ధనం, గృహం, ఇతర భౌతిక వస్తువులన్నీ లభిస్తారుు. దుష్టూలు, రాక్షసులు, అగ్ని, జలం, వాయువు, సర్పాలు – వేటి వల్లా అతడికి భయం ఉండదు. నాలుగు వర్ణాలవారు, నాలుగు ఆశ్రమాల వారు దీన్ని జపించి సఫలత పొందవచ్చు. ఈ మంత్ర జపం జరిగే చోట్ల పిల్లల అకాల మరణం ఉండదు; ఎవరికీ ఎలాంటి కష్టమూ ఉండదు’.

గాయత్రీ మంత్రద్రష్ట విశ్వామిత్ర
హిమాలయాలలో తపస్సు చేస్తున్న ఋషి విశ్వామిత్రునికి సూర్య భగవానుడు ప్రత్యక్షం అయాడు. సవిత నారాయణుని రూపంలో ఆయనకు దివ్య దర్శనం ప్రసాదించాడు. పరమతత్వ స్వరూపి అరుున సవితా భగవానుని దర్శనం జరగడం వల్ల ఆయనకు పరమచేతన లభించింది, పరమ ప్రేరణ లభించింది. దాని ప్రభావం వల్ల ఆయన ముఖ మండలం దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది. ఆయన నోటి నుండి మూడు మంత్రాలు వెలువడ్డారుు. దానిలో మెుదటిది గాయత్రీ మహా మంత్రం. ఋగ్వేదంలో పది మండలాలు ఉన్నారుు. మూడవ మండలంలోని 617 మంత్రాలకు ద్రష్ట విశ్వామిత్ర మహర్షి. ఆ మంత్రాలలో అనాది అరుునదీ, శ్రేష్టమైనదీ గాయత్రీ మంత్రం.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top