You Are Here: Home » ఇతర » దేవుడి ప్రతిరూపాలు అమ్మానాన్నకు జేజేలు పేరెంట్స్‌ డే నేడు

దేవుడి ప్రతిరూపాలు అమ్మానాన్నకు జేజేలు పేరెంట్స్‌ డే నేడు

సాక్షాత్తూ దేవుడి ప్రతిరూపాలే తల్లిదండ్రులు అన్నది భారతీయ ఆలోచనా ధోరణి. పలు విదేశీ సంస్కృ తుల్లోనూ సూచనప్రాయంగానైనా ఈ భావన కనిపిస్తోంది. ఆయా దేశాల్లో తల్లిదండ్రులను గౌరవించేం దుకు ప్రత్యేకంగా పేరేంట్స్‌ డే నిర్వహిస్తుంటారు. మదర్స్‌ డే, ఫాదర్స్‌ డే…తరువాత ఆ కోవలోకి చెందిందే పేరెంట్స్‌ డే. దీనికి కొనసాగింపుగా గ్రాండ్గ పేరెంట్స్‌ డే నిర్వహిం చడం కూడా ఇటీవల పెరిగిపోరుుంది. ఏటా జులై నాలుగో ఆదివారం నాడు పేరెంట్స్‌ డే నిర్వహిం చడం పలు విదేశా ల్లో కొన్నేళ్ళుగా ఆనవారుుతీగా మారింది. ఇటీవలి కాలంలో భారతదేశంలోనూ ఈ ప్రత్యేక దినాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేరెంట్స్‌ డే పై కలర్స్‌ ప్రత్యేక కథనం…

aaaపేరెంట్స్‌ డే అంటూ ప్రత్యేకంగా ఓ రోజును దేశంలో నిర్వహిం చకపోయినప్పటికీ, తల్లిదండ్రులను అమి తంగా గౌరవించిన దాఖలాలు ఎన్నో పురాణాల్లో, చరిత్రలో కానవ స్తాయి. రామాయణాన్ని ఉదాహర ణగా తీసుకుంటే తల్లిదం డ్రులను కావడిలో కూర్చొబెట్టు కుని వారిని తీర్థయాత్రలకు తీసుకెళ్ళిన శ్రావ ణుడి ఉదంతాన్ని గమనించవచ్చు. ఇలాంటివే మరెన్నో మన సంస్కృతిలో కానవ స్తాయి. ఆధునిక సంస్కృతి విషయానికి వస్తే కుటుంబ అను బంధాలు బక్కచిక్కిపోయిన విదేశాల్లో, ఆ అనుబంధాన్ని పటిష్ఠం చేసుకొనే రీతిలో మదర్స్‌ డే, ఫాదర్స్‌ డే, పేరెంట్స్‌ డే నిర్వహించడం ఆన వాయితీగా వస్తోంది. ఇవి ప్రాచుర్యంలోకి రావడానికి కారణం గ్రీటింగ్‌కార్డులు, మిఠాయిలు, చాక్లెట్లు, గిఫ్ట్‌ ఆర్టి కల్స్‌ తయారు చేసే సంస్థలే కారణమనే విమర్శ కూడా లేకపోలేదు. ఆ విమర్శ ఎలా ఉన్న ప్పటికీ కనీసం ఆ ఒక్కరోజైనా తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఆదరించడం, గౌరవించడం అభినంద నీయమే.

అమెరికాలో…
అమెరికాలో పేరెంట్స్‌ డే ను అధికారికంగా నిర్వహించడం 1994లో మొదలైంది. పిల్లలను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్రను గుర్తిసూ నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ కాంగ్రెస్‌ తీర్మానంపై సంతకం చేశారు. నాటి నుంచి ఈ ప్రత్యేక దినానికి అమెరికాలో అధికారిక గుర్తింపు లభించినట్లయింది. తల్లిదండ్రుల పాత్రలో లైంగికపరమైన వివక్షను దూరం చేసేలా మదర్స్‌ డే, ఫాదర్స్‌ డే స్థానంలోనే పేరెంట్స్‌ డే ను పాటించే విషయాన్ని పరిశీలించాలని అప్పట్లో అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి రుత్‌ బాడర్‌ సూచించడం విశేషం.

ఇదీ లక్ష్యం
Pareaపేరెంట్స్‌ డే నిర్వహించడం వెనుక రెండు ప్రధాన లక్ష్యాలు న్నాయి. తల్లిదండ్రులను వారి పిల్లలు, సమాజం గౌరవించడం ఒకటైతే, తల్లిదండ్రుల్లో పిల్లల పెంపకంపై అవగాహన పెంపొం దించడం మరొ కటి. పేరెంట్స్‌ డే రోజున వివిధ వాణిజ్య, స్వచ్ఛం ద సంస్థలు, విద్యాసంస్థలు తల్లిదండ్రులకు ప్రత్యే క పోటీలు నిర్వహిస్తుంటాయి. ఆదర్శ తల్లిదండ్రులను ఎంపిక చేసి బహు మతులు ఇస్తుంటాయి. ‘పేరెంట్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ ను ఎంపిక చేస్తుంటాయి. ఆ రోజున పిల్లలు తమ తల్లిదండ్రులకు ప్రత్యేక బహుమతులు ఇస్తుంటారు. పలు నగరాల్లో ఈ రోజున ప్రత్యేక ప్రదర్శనలు కూడా నిర్వహిం చడం ఆనవాయితీగా వస్తోంది.

ప్రత్యేక పుస్తకాలు, సీడీలు
ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నం కావడం పిల్లల పెంపకంపై కూడా ప్రభావం కనబర్చింది. కుటుంబ బాధ్యతలకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకుకోకుండా యువత తల్లిదండ్రులై పోతు న్నారు. పిల్లల పెంపకంపై వారికి పలు సందేహాలు కలు గుతుంటాయి. అవి తీర్చుకుందామంటే వారి తల్లిదండ్రులు వారి దగ్గర ఉండరు. ఈ నేపథ్యంలో పేరెంటింగ్‌ పై పలు పుస్తకా లు, సీడీలు మార్కెట్లోకి వచ్చాయి. పేరెంటింగ్‌కు సంబంధించిన వివిధ అంశాలను ఇందులో చర్చించడం విశేషం. భారత్‌లోనూ ఈ విధమైన సీడీలు, పుస్తకాల విక్రయాలు జోరందుకున్నాయి.

ఎన్నో రకాల బహుమతులు
Parenwవిదేశాల్లో పేరెంట్స్‌ డే సందర్భంగా తల్లిదండ్రులకు ఇచ్చే బహుమతులు పలు రకాలుగా ఉంటాయి. కొంతమంది తమ తల్లిదండ్రులను డిన్నర్‌ కోసం చక్కటి హోటల్‌కు తీసుకెళ్తారు. మరి కొందరు ఆ రోజంతా తమ తల్లిదండ్రులతో వెచ్చిస్తారు. కేక్‌ కట్‌ చేయడం, చక్కటి బహుమతులు ఇవ్వడం చేస్తుంటారు. పర్సనలైజ్డ్‌ గిఫ్ట్‌లు (ఓ మగ్గుపై తల్లి దండ్రుల ఫోటోలు చిత్రింపజేయడం లాంటివి) ఇవ్వ డం కూడా అధికమైపోయింది. ఇటీవలి కాలంలో ఈ ప్రత్యేక దినం వేడుకలు మన దేశంలోనూ అధికంగా సాగడం మొదలైంది.

ఆధునిక సంస్కృతి విషయానికి వస్తే కుటుంబ అనుబంధాలు బక్కచిక్కిపోయిన విదేశాల్లో, ఆ అనుబంధాన్ని పటిష్ఠం చేసుకొనే రీతిలో మదర్స్‌ డే, ఫాదర్స్‌ డే, పేరెంట్స్‌ డే నిర్వహించడం ఆన వాయితీగా వస్తోంది. ఇవి ప్రాచుర్యంలోకి రావడానికి కారణం గ్రీటింగ్‌ కార్డులు, మిఠాయిలు,చాక్లెట్లు, గిఫ్ట్‌ ఆర్టికల్స్‌ తయారు చేసే సంస్థలే కారణమనే విమర్శ కూడా లేకపోలేదు. ఆ విమర్శ ఎలా ఉన్నప్పటికీ కనీసం ఆ ఒక్కరోజైనా తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఆద రించడం,గౌరవించడం అభినంద నీయమే. పేరెంట్స్‌ డే నిర్వహించడం వెనుక రెండు ప్రధాన లక్ష్యాలు న్నాయి. తల్లిదండ్రులను వారి పిల్లలు, సమాజం గౌరవించడం ఒకటైతే, తల్లిదండ్రుల్లో పిల్లల పెంపకంపై అవగాహన పెంపొం దించడం మరొకటి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top