You Are Here: Home » దైవత్వం » సాహిత్యం » పురాణాలు » దురిత క్షయముస్వామి

దురిత క్షయముస్వామి

రోగం నయమైనపుడే మనిషి ఆరోగ్యవంతుడై, కార్యోన్ముఖుడవ్ఞతాడు. మనిషి హృదయంలో పాపం తొలగినపుడే మనిషి సుకృతాత్ముడై పరమేశ్వరుని ఆరాధనలో చరిస్తాడు. పాపాన్ని లోపలే ఉంచుకొని ఎంతగా సాధన చేసినా, మోక్షమార్గంలో సాధన సాగకుండా పాపమే అడ్డు తగుల్తూ ఉంటుంది. జ్ఞానానికి పాపం ప్రతిబంధకమై కూర్చుంటుంది.
జ్ఞానం నోత్పద్యతే పుంసాం పాపోపహత చేతసామ్‌!
పాపం చేత ఉపహతమైన చిత్తం కలవారికి జ్ఞానం కలగదు అని స్మృతివాక్యము. ‘ఉపహతం అంటే కొట్టబడింది, లేదా నశించింది అని అర్థము. పాపిపాపిగా ఉంటూ మోహం నుండి విడిపడలేదు. ద్వంద్వ మోహ విముక్తి కలగాలి అంటే, పాపం ప్రక్షాళనం కావాలి. పాపం పుణ్యకర్మల ద్వారా క్షీణిస్తుంది. జ్ఞానం చేత నశిస్తుంది. పుణ్యకర్మలు చేస్తే పాపం అంతమౌతుంది (అన్తగతం సమాప్త ప్రాయం).
అంతగతం అంటే సమాప్త ప్రాయం అని శ్రీ శంకర భాష్యము. సమాప్త ప్రాయం అంటే పాపక్షయం అని అర్థం (సమాప్త ప్రాయం క్షీణపాపం). సమాప్తం అంటే పూర్తి అయింది అని అర్థం. సమాప్త ప్రాయం అంటే పూర్తి కావచ్చింది అని భావం. ఈ రెండింటి యొక్క తేడాను బాగా అర్థం చేసుకోవాలి. జ్ఞానంతోనే పాపం సమూలంగా సమాప్తం అవ్ఞతుంది. ప్రస్తుతం వీరు       జ్ఞానాన్ని పొంది ముక్తులు కాలేదు. ఇంకా               జ్ఞానాభ్యాసంలోనే ఉన్నారు. కనుక పాపం అంతమైంది. సమాప్తం అనకుండా పాపం అంతగతమైంది, సమాప్తప్రాయమైంది అనడం జరిగింది.
పాపం ఎలా అంతగతమౌతుంది? ఎలా క్షీణిస్తుంది? పుణ్యకర్మల ద్వారానే పాపం క్షయిస్తుంది. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణామ్‌- యజ్ఞము, దానము, తపస్సు మొదలైన పుణ్యకర్మలు బుద్ధి మంతుల్ని పవిత్రం చేస్తాయి అని గీతాచార్యుడు పద్దెనిమిదవ అధ్యాయంలో చెబుతాడు.
దానధర్మాలు, జపధ్యానాలు, పరోపకారాది సేవలు-ఇవన్నీ పుణ్యాన్ని కలిగిస్తాయి. కాయ పెరుగుతూ ఉంటే పూలరేకులు రాలిపోయినట్లు, పుణ్యము పెరుగుతూ ఉంటే, పాపం క్షీణిస్తూ ఉంటుంది. ధర్మేణ పాప మపనుదతి- ధర్మజీవనము పాపక్షయానికి తోడ్పడుతుంది అని ధర్మశాస్త్రం. పుణ్యకర్మాచరణం చేత పూర్వ జన్మ సంస్కార జనిత పాపాలు క్షీణిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ధర్మజీవనంలో కొనసాగుతూ ఉన్నందున, నూతనంగా పాపం తయారు కాదు. ఇలా పుణ్యకర్మల మధ్య సాధకుడు శీఘ్రంగా పవిత్రతను పొందుతాడు. అందుచేత, పూజ, జప, ధ్యాన, సంకీర్తన, స్వాధ్యాయాది అలైకిక కర్మలను నిర్విరామంగా కొనసాగిస్తే, పాపనాశనుడైన పరమేశ్వరుని దయచేత పాపం క్షయమవ్ఞతుంది.
కీర్తితః పూజితో ధ్యాతః స్మృతః పాపరాశిం నాశయాన్‌ పాపనాశనః
భగవంతునికి పాపనాశనుడు అనే పేరు కూడా ఉంది. అది ఎలా వచ్చిందంటే, మన చేత కీర్తింపబడి, అర్చింపబడి, ధ్యానింపబడి, స్మరింపబడి-ఈ అలౌకిక కర్మలకు ఫలంగా తన దయను వర్షింపచేసి, ఆ పవిత్ర జ్ఞానజలాల చేత పాపపంకిలాన్ని లేకుండా చేసేవాడు. కనుక ఆయన పాపనాశనుడు. ఈవిధంగా దురితక్షయం జరుగుతుంది. ద్వంద్వ మోహ విముక్తి కలుగుతుంది. (ద్వంద్వ మోహేన నిర్తుక్తాః)
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top