You Are Here: Home » చిన్నారి » కవితలు » దుగ్గినపల్లి

దుగ్గినపల్లి

బియ్యాన్ని బంగారంలా
చూస్తున్నారిప్పుడు
బియ్యాన్ని ముత్యాల హారాల్లా
సంపన్నులు సౌందర్యం కోసం
ధరిస్తారేమో?

బిచ్చగాడికి గుప్పెడు బియ్యం
పిడికెడు అన్నం పెట్టే వాళ్ళం
కళ్ళంలోకి పేదవారొస్తే
ధాన్యం చాటల్లో పోసేవాళ్ళం
ఇపుడు బియ్యాన్ని భద్రంగా
బీరువాల్లో దాచుకుంటామేమో
ఏడువారాల నగల్లా!

కిలో బియ్యం ఒక్క రూపాయే కదా?
అయితే దండుకు గంజి వార్చే
దమ్మెవడికుంది
చేలో పంట ఇంట్లో వంట
లేక విగత జీవులౌతున్న జనం
మధ్య తరగతి బతుకు మాడు వాసనై
ఉత్తి గిన్నెలు తాలింపులౌతున్నై
ఇంట్లో దీపం మంట బెడుతుంది
కంచంలో కూరలు బదులు
కన్నీళ్ళు రాలుతున్నాయ్‌
కోట్లు గడిస్తున్న వాడికంటే
నాలుగు బియ్యపు గింజలున్నవాడే కుబేరుడు

Editorial-Photo21గోదాముల్లో ధాన్యాన్ని
రైసు మిల్లుల్లో బియ్యాన్ని
స్విస్‌ బ్యాంకుల్లో డబ్బుల్లా దాచేస్తున్నారు
షేర్‌ మార్కెట్‌లో చేతులు మారుతున్నది బియ్యం వ్యాపారమే
వడ్ల గింజలో బియ్యపు గింజలు మాయమవుతున్నాయ్‌
గొంతుకు అడ్డం పడుతున్న బియ్యపు గింజలు!

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top