You Are Here: Home » ఇతర » దీపావళి ఆంతర్యం అందం ఆరోగ్యం వెలుగుల వేడుక

దీపావళి ఆంతర్యం అందం ఆరోగ్యం వెలుగుల వేడుక

చిమ్మచీకటిని మోసుకు వచ్చే అమావాస్యనాడు దేశాన్ని వెలుగుపుంతగా మార్చే అద్భుతమైన పండగ దీపావళి. లోకాలను ఆవరించి ఉండే చిమ్మచీకటిపై మనిషి చేసే దండయాత్రే దీపావళి. చిరుదీపాలతోనే అమావాస్య చీకటిని ఎదుర్కొని పారదోలడంలో మనిషి తెలివి, అందమైన అభిరుచి కనబడుతుంది. చుట్టూ ఆవరించి ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూచునే కన్నా ప్రయత్నించి ఒక చిన్న దీపాన్నైనా వెలిగించడం మేలన్న సామెత దీపావళికి అక్షరాక్షరంగా వర్తిస్తుంది. ప్రయత్నం ఎంత చిన్నదైనా సామూహికంగా చేసినపుడు దాని ఫలితం పెద్దగా ఉంటుందని, సంఘజీవనం కళకళలాడుతుందని దీపావళి మనకు నిరూపించి చెబుతోంది

diwaliచీకటిలో బతకడం మానవస్వభావానికి విరుద్ధం. అది రాక్షస ప్రవృత్తి. వాళ్ళకు వెలుగంటే పడదు. చీకటిలో సంచరించే జీవజాతులు ఇప్పటికీ చాలానే ఉన్నాయి. అందరూ ఆదరించే, ఆరాధించే సూర్యోదయాన్ని అవి తిట్టుకుంటాయి. చీకటికి, వెలుగుకు ఆగర్భ శ్త్రుత్వం. అది నిరంతరంగా సాగే మహాభారత సంగ్రామం. పరస్పరం పొడగిట్టని నీతఇవినీతి, సత్యంఅసత్యం కూడా ఇలాగే పోరాడుతుంటాయి. వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం మానవనైజం. అందుకే మని షికి నరుడు అని పేరొచ్చింది. నృణంతి నయంతి సర్వం స్వవశమితి నరా: అని నర శబ్దానికి వ్యుత్పత్తి. అంటే అన్నిటినీ తన వశం చేసుకునే వారని అర్థం. మరి నరకుడు అంటే నృణాతి ప్రాపయతి పాపినస్స్వ సమీపమితి నరక: పాపాష్టి వాళ్ళను చేరదీసే వాడు అని అర్థం. నరునిది అభ్యుదయ వాదమైతే నరకుడిది అంటే చెడ్డవాడిది విధ్వంసక బుద్ధి.

అందుకే నరుడికి, నరకుడికి పడదు. చీకటి శక్తులను ఏరిపారేయాలని మనిషి ఎప్పటికపడు ఆరాట పడుతుంటాడు. కడదాకా పోరాడు తుంటాడు. ఈ లక్షణాన్ని మెచ్చినందుకే నారాయణుడు కూడా నరుడికే సహకారిగా ఉంటాడు. ఆయన పది అవతారాలెత్తింది కూడా మనిషికి అనేక రకాలుగా సాయపడడానికే! నారాయణుని పరపూర్ణ అవతారాలైన రామ, కృష్ణ అవతారాలలో ఈ విషయం మరింతగా స్పష్టమవుతుంది. ఎంతకైనా తెగించి, తీవ్రంగా ప్రయత్నించి చీకటిమీద విజయం సాధించాలని మానవుడు చేస్తున్న కృషికి లభించిన ఫలితం ఈ దీపావళి పండగ.

కళాకాంతి ఆనందానుభూతి
సూర్యుని దయతో అంతటా వెల్లువలా పరుచుకునే వెలుగును తనకు కావలసిన విధంగా మార్చుకోడానికి మనిషి తరతరాలుగా తపించాడు. అందుకు అగ్ని సహకారం తీసుకున్నాడు. అది సాధ్యపడిన తరువాత మనిషి అనేక విశేషాలను ఆవిష్కరించాడు. వెలుగు లకీదేవికి ఉన్న పదహారు కళలలో ఒకటి. అందుకే ఎవరైనా అందంగా కళకళలాడిపోతుంటే అచ్చంగా లకీదేవిలా ఉంది అనేస్తాం. మరి ఆద్యంతం కళకళలాడే దీపకళికను లకీకళగా సంభావించకుండా ఎలా ఉంటాం? అంతటి లకీకళను మోసుకు వచ్చే దీపాన్ని దీపలకి
అని అనకుండా ఎలా ఉంటాం? శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీప జ్యోతిర్నమోస్తుతే పగటిపూట పనీపాటు ఎలాగైనా సాగిపోతుంది.

చీకట్లో ఒక్క అడుగుకూడా ముందుకు పడదు. చీకటి దృష్టి నిరోధకం. అందుకే చీకట్లో మనం కళ్ళున్న కబోదులమవుతున్నాం. గుడ్డి దీపం వెలుతురైనా ఉంటే కొన్ని పనులైనా చేసుకోగలుగుతాం. అందుకే దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా మన పెద్దలు భావించారు. దీప జ్యోతి: పరంబ్రహ్మ అన్నారు.

చిమ్మచీకటిలో కమనీయ వెలుగులు
Untitaఅర్జునుడు చీకట్లో అన్నం తిన్నాడని సామెత. అలవాటుపడ్డ పనులను ఎలాగో ఒకలాగ చేసుకున్నా అది క్షేమకరమైనది కాదు. చీకట్లో పురుగు పున్రు గుర్తించేదెలా? పైగా విషకీటకాలు సంచరించే సమయం చీకటే! వాటి వల్ల మన ఆరోగ్యానికి ప్రమాదం ఉంది. ఇంట్లో దీపాన్ని వెలిగిస్తే ఇలాంటి కీటకాలన్నీ దాని ఆకర్షణలో పడి కాలి బూడిదవుతాయి. ఆ విధంగా దీపం మనకు మహోపకారం చేస్తోంది. మన ఆరోగ్యాన్ని కాపాడు తోంది. రక్షణ నారాయణుని లక్షణం. ప్రజలను రక్షించడమే కార్యక్రమంగా ఉన్న ఆయనను జనార్దనుడు అని కీర్తిస్తున్నాం. నారాయణస్వరూపంగా ఉండి మనను కాపాడుతున్నందుకు దీపాన్ని దీపజ్యోతి: జనార్దన అంటూ జనార్దనుడితో పోల్చి దండాలు పెడుతున్నాం. మన కృతజ్ఞతను చాటుకుంటున్నాం. చీకటిని చీల్చి చెండాడే దీపం సాయం ఉంటే అన్నీ సాధ్యమే!

పగటిపూట మన పనులను ఎంత ధారాళంగా చేసుకోగలుగుతామో దీపకాంతిలోనూ పనులు అంతే వేగంగా చేసుకోగలుగుతాం. అందుకే దీపేన సాధ్యతే సర్వం అన్నారు పెద్దలు. అనేక దోపిడి దొంగలు, కన్నం దొంగలు తిరిగేది చీకట్లోనే! వెలుతురు పరుచుకున్న ఉన్న చోట వాళ్ళ ఆటలు సాగవు. చీకట్లో సాగే వ్యభిచారాలు సాగవు. అందుకే దీపం హరతు సర్వతమోపహం దీపో మే హరతు పాపం అన్నారు. ప్రతీ ఇంటా తన కాంతితో కళాకాంతులు తీసుకువస్తున్న దీపానికి దీపా జ్యోతిర్నమోస్తుతే అని నమస్కరించడం, లకీకళకు ప్రతీకగా నిలిచిన ఈ రోజున లకీదేవికి పూజ చేయడం అన్నది మనిషి ప్రదర్శించే కృతజ్ఞతా భావానికి అందమైన నిదర్శనం.

వెలుగు లక్ష్మీకళ
ఈ రోజున లకీపూజ చేయడానికి పురాణాలు ఒక కథ చెప్పాయి. వెనకటికి దుర్వాసుడు అనే మహర్షి ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఇంద్రుడు ఆయనను ఘనంగా సత్కరించాడు. అందుకు ఎంతగానో సంతోషించిన రుషి ఇంద్రుడికి మహామహిమాన్వితమైన హారాన్ని బహూకరించాడు. సకల సంపదలతో తులతూగే ఆ స్వర్గలోకాధిపతి గర్వంతో దాన్ని స్వీకరించినట్టే స్వీకరించి పక్కనే ఉన్న తన వాహనం ఐరావతం మెడలో వేశాడు. ఏ తెల్ల ఏనుగుకు ఆ ఆభరణాన్ని ఏం చేసుకోవాలో అర్థంకాక కాలి కింద పడేసి తొక్కింది. అది చూసి ఆగ్రహించిన రుషీశ్వరుడు సర్వసంపదలు కోల్పోయి అఘోరించమని శపించాడు. దాంతో కంగారెత్తిన ఇంద్రుడు నారాయణుని ఆశ్రయిస్తాడు. కీస్వరూపంగా భావించి ఒక జ్యోతిని వెలిగించి పూజించమని సలహా ఇస్తాడు. ఇంద్రుడు అలాగే చేస్తాడు.

దాంతో సంతృప్తి చెందిన లకీదేవి ఇంద్రుడు పోగొట్టుకున్న సమస్త వైభవాలను తిరిగి ప్రసాదిస్తుంది. ఆమె శక్తిని అర్థం చేసుకున్న ఇంద్రుడు లకీదేవిని సామాన్యుడికి కూడా అందుబాటులోకి రావాలని అర్థిస్తాడు. త్రికరణ శుద్ధితో ఎవరెవరు నన్ను ఎలాఎలా సంభావించి ఆరాధిస్తారో వారివారిని ఆయా రూపాలలో అనుగ్రహి స్తాను.మోక్షాన్ని కోరుకునే వారికి మోక్షలకిగా, విజయాన్ని కోరుకునే వారికి విజయలకిగా, విద్యను కోరుకునే వారికి విద్యాలకిగా, సంతానాన్ని కోరుకునే వారికి సంతానలకిగా, ఐశ్వర్యం కోరుకునే వారికి ధనలకిగా వరాలిచ్చే వరలకిగా కనిపించి కోరికలు నెరవేరుస్తాను అంటుంది. అప్పటి నుంచి లకీదేవిని 8 రకాలుగా ఆరాధించడం మొదలైంది. అష్టలకీ వైభవం వెనుక ఉన్న కథ అది.దక్షిణాయనంలో మనకు రక్షణగా నిలిచేందుకు వచ్చిన పండగ దీపావళి. కనుక దీన్ని డబ్బుదండగ పండగగా భావించకూడదు.

అగ్పిపూల పండగ
Unaచీకటిని జయించడమంటే అజ్ఞానాన్ని, అవిద్యను జయించడమే! విజయం లకీ స్వరూపాలలో ఒకటి. అందుకే ఎవరైనా పరీక్షలో ఉత్తీర్ణుడైతే వాణ్ణి విజయలకి వరించిందని అంటుంటాం. మనిషి సాధించే విజయం పరమ కళ్యాణకారకం. కనుకనే దాన్ని విజయలకి అనుగ్రహంగా భావిస్తాం. మనిషి ఏనాటి నుంచో కోరు కుంటున్న మహత్తర విజయం చీకటిపై ఆధిపత్యం. కనుకనే ఈ దినాన్ని లకీకళకు ప్రతీకగా మలచి వేడుక చేసుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. భయంకరంగా మండే మంటను పరమ ప్రసన్నంగా మార్చు కోవడం, మనోహరమైన అలంకార వస్తువుగా మలచు కోవడం మరో మహత్తర విజయం. మనిషి తెలివికి, అభిరుచికి తార్కాణం. ఆ విధంగా చూసినా దీపావళి అందమైన పండగే అవుతోంది.

మహిళకు పెద్దపీట
దీపం పెట్టడం అంటే లకీదేవిని ఆహ్వానించడమే కనుక ప్రతీ ఒక్కరూ నరక చతుర్దశి నుంచి కార్తీకపౌర్ణమి వరకు దీపాలు పెడుతుంటారు. కార్తీకపౌర్ణమినాడు సముద్రస్నానం చేయడం, జీవజాలలున్న తావులను దీపాలతో నివాళులర్పించడం చేస్తుంటాం. అలా చేయడం వల్ల నీటిలో పుట్టే క్రిములు దీపానికి ఆకర్షింపబడి అంతరించిపోతాయి. లకీదేవి కథను అటుంచితే నరకాసురుడనే రాక్షసునిపై సత్యభామ వీరోచితంగా పోరాడి మహిళా శక్తిని లోకానికి చాటిన రోజుగా కూడా పురాణాలు అభివర్ణించాయి. నరకుని చెరలో మగ్గిన 16వేల మంది మహిళలకు బంధవిముక్తి లభించిన రోజుగా కూడా నరకచతుర్దశికి గుర్తింపు ఉంది. దుర్గాదేవి మహిషాసురునిపై సాధించిన ఘన విజయం ఉండనే ఉంది.

అంటే ఈ పండగ మహిళా శక్తికి, సాధికారతకు తార్కాణంగా నిలుస్తోందన్నమాట. ఏ దేవుణ్ణయినా ఎవరైనా ఏం కోరుకుంటారు. మా పిల్లాపాప బాగుండాలి. ఆయురారోగ్యాలు బాగుండాలి. ఆర్థికంగా బాగుండాలి. మనకు విశాల హృదయానికి కొదవలేదు కనుక పక్కవాడు బాగుండాలి. ఊరు బాగుండాలి. దేశం బాగుండాలి. అన్ని లోకాలు బాగుండాలి. అన్నీ ఇచ్చే దేవుడా నువ్వూ బాగుండాలి. దేవుడికి చదివే మంగళం తాత్పర్యం ఇదే కదా! దీపావళి రోజున లకీపూజ చేసి కోరుకునేది కూడా ఇదే!
సువర్ణ వృద్ధిం కురుమే గృహే శ్రీ, సుధాన్య వృద్ధిం కురుమే గృహే శ్రీ
కళ్యాణ వృద్ధిం కురుమే గృహే శ్రీ, విభూతి వృద్ధిం కురుమే గృహే శ్రీ

దీపం పెట్టడానికీ పండగ కావాలా?
Untit6దీపాలు రోజూ పెడుతూనే ఉన్నాం కదా! కరెంటు వచ్చిన ఈ రోజులలోనూ దేవుడికంటూ ఇంట్లో ఓ మూల కేటాయించి నూనె దీపాలో, నెయ్యి దీపాలో పెడుతూనే ఉన్నాం కదా! దీనికంటూ ఒక పండగ అవస రమా?…అవసరమే..! ఈ ఆశ్వయుజ మాసంలో, శరదృతువులో ఎక్కువ దీపాలను పెట్టడం చాలా అవసరం. వానాకాలం వెళ్ళిపోయి మంచు ముసురుకునే సమయం ఇది. అంటే వానాకాలానికి అంతం, చలికాలానికి ఆరంభ సమయమన్నమాట. వానాకాలం తెచ్చిన తడి చిత్తడి పోయి మంచు భారీగా కుర వడానికి రంగం సిద్ధమవుతున్న కాలం ఇది. ఈ సమయం లోనే భూమిలో దాగి ఉంటే అనేక క్రిములు, కీటకాలు బైటికి వస్తాయి.

క్రిములు కీటకాలు మూడు రకాలు. గాలిలో పుట్టేవి, నీటిలో పుట్టేవి, మట్టిలో పుట్టేవి. ఇవన్నీ ఒక్క సారిగా దాడిచేసే సమయం. ఈ రోజులలో క్షేమంగా బతికి బట్టకట్టాలంటే ఒక్కుమ్మడిగా వాటిని చంపాలి. దోమల్ని కొట్టినట్టో, ఈగల్ని కొట్టినట్టో చప్పట్లు కొట్టి చంపుతామంటే కాదు. దానికి పెద్ద ప్రయత్నమే కావాలి. సామూహిక పోరాటమే జరగాలి. మానవ సమాం అంతా కట్టకట్టుకుని ఆ పని చేయాలి. అలాంటి మంచి పని చేయించడానికే దీపావళి పండగ వచ్చింది. ఈ రోజున పెట్టే దీపాలు, కాల్చే టపాసులు విషకీటకాలను చంపడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

– డా వంగల రామకృష్ణ

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top