You Are Here: Home » ఇతర » ది రన్నింగ్‌ ట్రెయిన్‌

ది రన్నింగ్‌ ట్రెయిన్‌

ప్రపంచంలో అత్యధికంగా ప్రయాణికులకు రవాణా సాధనంగా ఉపయోగపడుతున్న వాహనం రైలు. రోజూ కోట్లాది మందిని ఇవి మోసుకుపోతుంటారుు. లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూంటారుు. ఆవిరితో నడిచింది మెుదలు ఇప్పటి వరకు రైలు బండిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నారుు. దీని వెనుక ఎందరో శాస్తవ్రేత్తల కృషి ఉంది. నేడు దాదాపు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లు అందుబాటులోకి వచ్చారుు. అభివృద్ధి పథంలో అత్యంత ప్రబలశక్తిగా దూసుకుపోతున్న భారత్‌ రైల్వే విషయంలో కొంత వెనుకబడి ఉంది. మన రైళ్ల అత్యధిక వేగం ేకవలం 150 కిలోమీటర్లు మాత్రమే. 1804, ఫిబ్రవరిలో రైలు ఇంజన్‌ నడవడం ప్రారంభం అరుుంది. ఈ నెల 26న పార్లమెంట్‌లో మన రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రైల్వే ప్రస్థానంపై కథనం.

22Colఒకదాని వెనుక ఒకటి తగిలించబడిన బోగీలతో పట్టాల మీద ప్రయాణిస్తూ, ప్రయాణీకులను, సరుకులను ఒకచోటు నుంచి మరొక చోటకి చేరవేసే ఒక రవాణా సాధనమే రైలు. గ్రాంధికంలో ధూమశకటం అని అంటారు. భూమిపై నడుస్తున్న రవాణా సాధనాల్లో అత్యంత వేగంగా దూసుకుపోయేవి, అతి ఎక్కువ మందిని చేరవేసేవి రైళ్లే. శరవేగంగా దూసుకుపోతున్న నేటి రైళ్లకు మూలం ఆవిరితో నడిచే ధూమశకటం. దీనిని స్కాట్లాండ్‌ దేశానికి చెందిన జేమ్స్‌ వాట్‌ అనే శాస్తవ్రేత్త 1776లో కనుగొన్నాడు. మొదట్లో దీనిని వస్తువులను చేరవేయడానికి మాత్రమే వాడేవారు. తరువాత ప్రయాణీకుల రాకపోకలకు కూడా వినియోగించడం ఆరంభించారు. అప్పటి నుంచి రోజూ కోట్ల మందికి రవాణా సాధనంగా ఉపయోగపడింది. ప్రస్తుతం ప్రపంచ ఎక్కువగా బుల్లెట్‌ రైళ్లు బాగా వాడుకలో ఉన్నాయి. ఇవి గంటకు దాదాపు 300కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి.

నాటినుంచి నేటి వరకు…

 • ప్రయాణికులను రైలులో తరలించడం 1825లో ప్రారంభమయింది. ఇంగ్లాండ్‌లోని స్టాక్‌టన్‌ నుంచి డార్లింగ్‌టన్‌కు మొదటి రైలు నడిచింది. ప్రయాణికులను ఎక్కించుకుని ఆవిరితో కదిలే ఇంజన్‌ను జార్జ్‌ స్టీఫెన్‌సన్‌ తయారుచేశాడు.
 • మొట్టమొదటి రైల్వే లైన్‌ను బొగ్గు తరలింపు కోసం నిర్మించారు. దాన్ని లేక్‌ లాక్‌ రైల్వే రోడ్‌ అంటారు.
 • రష్యా, అస్ట్రేలియా, ప్రాన్స్‌ ఇలా దేశాల్లో 1837లోనే రైళ్లు ప్రారంభం అయ్యాయి.
 • 1837లో రాబర్ట్‌ డేవిడ్‌ సన్‌ విద్యుత్‌తో నడిచే ఇంజన్‌ కనుగొన్నాడు.
 • 1838లో రైల్వే టిక్కెట్‌ను ఎడమండ్‌సన్‌ ప్రవేశపెట్టాడు.
 • 1851లో ఇండియాలో రైల్వే నిర్మాణం జరిగింది. దీన్ని బ్రిటిష్‌ వారు తమ అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్నారు.
 • మన దేశంలో 1853లో ముంబయ్‌-థానే మార్గంలో మొదటి రైలు నడిచింది.
 • 1857లో ఉక్కుతో తయారైన రైళ్లను బ్రిటన్‌లో ఆవిష్కరించారు.
 • 1890లో అండర్‌గ్రౌండ్‌ నుంచి రైళ్లు నడవడం లండన్‌లో ప్రారంభమైంది.
 • 1913లో డిజిల్‌తో నడిచే ఇంజన్లు అందుబాటులోకి వచ్చాయి. అది రైల్వేలకు విస్తృతంగా వినియోగపడింది.
 • 1935లో రష్యాలో చిన్న పిల్లల కోసం ప్రత్యేక రైలు ప్రారంభించారు.
 • 1969లో ఆవిరితో నడిచే రైలు తన చివరిసారి ప్రయాణం సాగించింది. తరువాత ఆవిరితో నడిచే రైళ్లు దాదాపు ఆగిపోయాయి.
 • 2007లో దాదాపు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల రైలును చైనా తయారు చేసి ప్రారంభించింది.
 • వేగంలో చైనానే టాప్‌
  chinaప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లు చైనాలో నడుస్తున్నాయి. ఆ దేశంలోని ఓ ప్రధాన నగరం గ్వాంగ్ఘా నుంచి వుహన్‌ వరకు ఈ రైలు ప్రయాణిస్తుంది. ఇది గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. గ్వాంగ్ఘా నగరం నుంచి బీజింగ్‌ నగరాల మధ్య గతంలోప్రయాణించడానికి ఏడున్నర నుంచి ఎనిమిది గంటలు పట్టేది. ప్రస్తుతం మూడు గంటళ్లలోనే ప్రయాణికులు ఈనగరాల మధ్య ప్రయాణిస్తున్నారు. ఈ రైలును 2008లో ప్రారంభించారు. తాజాగా దాదాపు 8358కిలోమీటర్ల దూరం గల రైల్వే లైన్‌ను చైనా నిర్మిస్తోంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద రైల్వే లైన్‌. 2015లోగా దీని నిర్మాణం పూర్తి కావడం కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. పూర్తయిన వాటిల్లో 2298 కిలో మీటర్ల లైన్‌ అతిపెద్దది. ఇది కూడా చైనాలోనే ఉంది. బీజింగ్‌ నుంచి హాంగ్‌కాంగ్‌ మధ్య నడుస్తోంది. మనదేశంలోఅత్యధిక వేగంతో నడుస్తున్న రైలు భోపాల్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌. వేగం గంటకు సుమారు 150 కిలో మీటర్లు.

  రాజధాని ఎక్స్‌ప్రెస్‌
  Chennమన దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి వివిధ రాష్ట్ర రాజధానులను కలుపుతూ ఈ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణిస్తుంది. దీన్ని 1969లో ప్రారంభించారు. అత్యధిక వేగంతో గంటకు 140/87 మైళ్ల వేగంతో పరుగుతీస్తుంది. మొట్టమొదటి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ న్యూఢిల్లీ నుంచి హౌరాకు 1,445 కి.మీ దూరం ప్రయాణాన్ని 16 గంటలా 55 నిమిషాల్లో పూర్తి చేసింది. రాష్ట్రంలోని మచిలీపట్నం/విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీకి అదేవిధంగా తిరుపతి నుంచి న్యూఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లను ఏర్పాటు చేయాలని ప్రజలు, నాయకులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు.

  దురంతో ఎక్స్‌ప్రెస్‌
  Duronto1ఆర్టీసీలో నాన్‌స్టాప్‌ బస్సుల్లాగా రైల్వేలోనూ బయలుదేరిన చోట ప్రారంభమై మళ్లీ గమ్యస్థానం వద్దే ఆగే రైలే దురంతో ఎక్స్‌ప్రెస్‌. దీని భోగీలు ప్రత్యేకమైన పసుపు-ఆకుపచ్చ చారల్ని కలిగి గుర్తించడానికి సులభంగా ఉంటాయి. ఈ దురంతో సర్వీసులు ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల మధ్య ప్రయాణిస్తున్నాయి. దీనికి నాందిగా 2007లో మంత్రివర్గం ఢిల్లీ-అమృత్‌సర్‌ మధ్య 500 కిలోమీటర్ల ప్రాంతాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌ కోసం దురంతోను ఎన్నికచేసింది. అంచనా వ్యయం సుమారు 25,000 కోట్లు. 2009-2010లో నాటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ దురంతో ఎక్స్‌పెస్‌లను ప్రకటించారు.

  మన దేశంలో…
  first-trainభారత్‌లో రైల్వేల ఏర్పాటు కోసం 1832లో ప్రణాళిక రూపొందించారు. అయితే పదేళ్లు గడిచినా ఆ దిశగా ఒక్క అడుగూ పడలేదు. 1844లో నాటి గవర్నర్‌ జనరల్‌ లార్డు హార్డింజ్‌ రైల్వే వ్యవస్థ ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చాడు. రైల్వే కంపెనీలను స్థాపించి, వాటికి సహాయం అందించాల్సిందిగా ఈస్ట్‌ ఇండియా కంపెనీని అదేశించారు. ఇంగ్లండ్‌లోని పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా అనంతర కొద్ది కాలంలోనే రైల్వే వ్యవస్థ ఏర్పడింది. 1851 ఏప్రిల్‌ 16న మొట్టమొదటగా రైలు పనిచేయడం ప్రారంభం అయ్యింది. రూర్కీలో నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లేందుకు దానిని ఉపయోగించారు. అనంతరం 1853 ఏప్రిల్‌ 16న బాంబేలోని బోరి నందర్‌, థానేల మధ్య(34 కి.మీ.దూరం) మొదటి ప్రయాణీకుల రైలును నడిచింది.

  ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌ప్రెస్‌
  Andhraదక్షిణ మధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడిపిస్తోంది. మన రాష్ట్ర రాజధాని నుండి బయలుదేరి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానా రాష్ట్రాల ప్రధాన పట్టణాల గుండా ప్రయాణించి న్యూఢిల్లీ చేరుతుంది. 27గంటల సమయంలో ఈ దూరాన్ని చేరుతుంది. ఈ రైలు సర్వీసును 1976 సంవత్సరంలో నాటి రైల్వే మంత్రి మధు దండావతే ఆరంభించారు.

  రకాలు
  computer

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top