You Are Here: Home » ఇతర » ది ఛేంజ్‌

ది ఛేంజ్‌

కిందపడిలేవడం అంటే మాటలేం కాదు.పాతాళంలోకి దిగబడిపోరుున చోటే భవనంనిర్మించడ మంటే సులువేంకాదు మత్తుజగత్తునుండి బయటపడాలంటే మనసుకు కళ్లెం వేయాలి. అది జరిగే పనేనా?తరతరాలపాటు పీల్చిపిప్పి చేసే అణుధార్మికతను ఊదిపారేయడమంటే ఊపిరితీసినంత ఈజీ కాదు.హత్యలు, దోపిడీలు.ఘర్షణలు.రాజ్యమేలిన చోట శాంతికపోతం ఎగరడం ఊహించగలమా?దీర్ఘరోగాలు.దొరకని మందులు.తాగడానికి పనికిరాని నీరు.తినడానికిఉపయోగపడని పంటలుఉన్న చోట మనిషి మనుగడ సాధ్యమా?.అక్కడివారు సాదాసీదాగా బతిేకయాలనుకుంటే ఇవేవీ సాధ్యం కాకపోయేవి.వారుకుంగిపోలేదు.వారుభయపడిపోలేదు.వారుపారిపోలేదు.పరిస్థితులను ఎదుర్కొన్నారు. మేధకు పదును పెట్టారు. మనసుకు ధైర్యం చెప్పుకున్నారు.తరువాతి తరాలు ఎలా ఉండాలో ఊహించారు.ఆ ఊహలు నిజం కావాలంటే ఏం చేయాలో నిర్ణరుుంచుకున్నారు. ఆ నిర్ణయాలను అమలు చేశారు.ేకవలం రెండు నుండిమూడు దశాబ్దాలలోపు చరిత్రను తిరగరాశారు. అథోజగత్తుకు మారుపేరుగా నిలిచిన అలనాటి మేడిలిన్‌ఇప్పు డు విశ్వంలో ఉత్తమ నగరంగా మారిపోరుుంది.అణుబాంబులతో అతలాకుతలమైన హిరోషిమా ఇప్పుడు అద్భుతనగరంగా భాసిల్లుతోంది. ఆ నగరాల్లో ఛేంజ్‌పై కలర్స్‌ కథనం.

మెడిలిన్‌
Medellín-rivarకొలంబియాలోని ఓ ప్రధాన నగరం. రెండు మూడు దశాబ్దాల క్రితం వరకు ఆ నగరంలో ఆశాంతి ఎక్కువ. మాదక ద్రవ్యాల చలామణి కీలక నగరం. నిత్యం మాదక ద్రవ్యాల ముఠాల మధ్య గొడవలు, పరస్పర దాడులతో భయానకంగా ఉండేది. అలాంటి నగరంలో ఇప్పుడు ఎన్నో మార్పులు జరిగాయి. అభివృద్ధి బాటలో పయనిస్తోంది. రవాణా, టూరిజం, పరిశ్రమల రంగంలో దూసుకుపోతోంది. చిన్న నగరమే అయినా ప్రపంచంలోని ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అత్యంత వినూత్న ఆవిష్కరణలు.. విధానాలు… వ్యవస్థలు కలగలిసిన నగరంగా మెడిలిన్‌ పేరు తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నగరాలు ఉన్నా వాటన్నింటిని పక్కకు నెట్టి మెడిలిన్‌ వినూత్న నగరం పురస్కారాన్ని అందుకుంది. రహదారి సౌకర్యంకూడా లేని ఆ నగరం ఇప్పుడు ఆశ్ఛర్యపరిచే రీతిలో ఎదిగింది.

Coltejeమెడిలిన్‌ కొలంబియాలో రెండవ అతిపెద్ద నగరం. ఇది అబ్బుర లోయలో ఉంది. దక్షిణ అమెరికాలో అండీస్‌ పర్వతాలకు ఉత్తరాన ఉంటుంది. కొలంబియా సంప్రదాయాలకు, సంస్కృతికి పెట్టింది పేరు మెడిలిన్‌. 1541 ఆగస్టులో కొలంబియాకు చెందిన మార్షల్‌ జార్జ్‌ రోబ్లిడో ఓ లోయలో పడిపోయాడు. తిరిగి వస్తూ ప్రస్తుతం హిలికోనియాగా పిలిచే ప్రాంతాన్ని చూశాడు. అనంతరం ఆ పట్టణాన్ని వేదికేందుకు జెరోనిమో లూయిస్‌ తేజిలో అనే అతన్ని పంపాడు. ఆగస్టు 23న ప్రస్తుతం మెడిలిన్‌గా పిలువబడుతున్న నగరాన్ని ఆయన చేరుకున్నారు. దీన్ని సెయింట్‌ బర్తలోమియు లోయగా పిలుస్తారని అక్కడి ప్రజలు ఆయనకు తెలిపారు. అలా కొద్ది రోజుల తరువాత దీని పేరు అబ్బురగా మారింది. వస్త్రాలపై సహజ సిద్ధమైన డిజైనింగ్‌ చేయడంతో ఈ పేరు వచ్చింది. అబ్బుర లోయలో ఉన్న పట్టణ అభివృద్ధి కోసం నాలుగు చదరపు మైళ్ల విస్తీర్ణం కేటాయించాలని 1574లో గాస్పర్‌ డి రోడాస్‌ ఆంటోక్యుయాను అడిగాడు. అయితే మూడు చదరపు మైళ్ల స్థలం ఇవ్వడం జరిగింది. గాస్పర్‌ డి రోడాస్‌ చేసిన ఎన్నో మార్పులు అభివృద్ధి బాటలు వేశాయి. నెమ్మదిగా జనాభా కూడా పెరగడం ఆరంభమయింది. షాన్‌ లారింజో చర్చి రికార్డుల ప్రకారం 1646 నుంచి 1650 మధ్య ఆరుగురు జంటలు పెళ్లి చేసుకున్నారు.

1671-75 మధ్య ఇది 41కి పెరిగింది. ఆంటోక్యూయా ఈశాన్య వైపు బంగారు గనులు తవ్వకం ప్రారంభించారు. అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయం చేసి ఆహాధాన్యాలను తెచ్చుకునేవారు. అబ్బుర లోయ ప్రాంతీయ రాజధానిగా ఎదగడానికి ఆంటోక్యూయా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.అప్పటికి ప్రాంతీయ రాజధాని అయిన శాంటా ఫే నెమ్మదిగా తన ప్రాముఖ్యతను కోల్పోతూ వచ్చింది. శాంటా ఫే నుంచి విడిపోయి ఆంటోక్యూయా కొత్త నగరంగా ఏర్పాటయింది. దీని పేరు విల్లా ది న్యూ ఎస్ట్రా సెనోరా డి లా కాండెలారియా. సిటీ ఏర్పడే సమయంలో కొందరు మెడిలిన్‌ నది చుట్టూ, మరికొందరు కాండలేరియా చర్చి చుట్టూ తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు.
మత గురువు పోపయన్‌ కోసం 1682లో వర్తకులు, విదేశీయులు వేరక్రుజ్‌ ఆశ్రమాన్ని నిర్మించడం ప్రారంభించారు. 1712కు ఇది పూర్తయింది. అనంతరం ప్రజలు, ప్రభుత్వ పాలకుల సమష్టి కృష్టి కారణంగా నగరం ప్రగతి వైపు పయనించింది. ఈ క్రమంలోనే దీని పేరు మెడిలిన్‌గా మార్పు జరిగింది.

పరిశ్రమలు
plaja-center1899 నుంచి 1902 మూడేళ్ల మధ్య సివిల్‌ వార్‌ కారణంగా కొంత అభివృద్ధి నిలిచిపోయింది. తరువాత నగర అధ్యక్షుడు రాఫెల్‌ రేయిస్‌ సంస్కరణల ఫలితంగా వేగం అందుకుంది. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కొలింబియాలోని ఇతర ప్రాంతాలకు రవాణా రంగాన్ని అభివృద్ధి పరిచింది. బంగారం ఉత్పత్తి అధికంగా ఉండడమే మేడిలిన్‌ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. లోయ ప్రాంతం కావడంతో 20వ శతాబ్దంలో కాఫీ ఉత్పత్తుల ఎగుమతులు కూడా విపరీతంగా పెరిగాయి. కొలింబియా చేస్తున్న ఎగుమతుల్లో కాఫీ ఉత్పత్తులదే ఎక్కువ భాగం. పారిశ్రామిక ప్రగతికి గుర్తుగా పెద్ద భవనం కూడానిర్మించుకు న్నారు. కొలంబియాలో రెండవ అతిపెద్ద పారిశ్రామిక నగరంగా ఖ్యాతికెక్కింది.1950 నుంచి 85 మధ్య కాలంలో ఈ లోయ ప్రాంతాల్లో కొందరు మాదక ద్రవ్యాలను పండించేవారు. వీటి అమ్మకం, అక్రమ రవాణాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. చలామణి చేసే క్రమంలో ముఠాల మధ్య గొడవలు, కొట్లాటలు జరిగేవి. శాంతియుత జీవనానికి విఘాతం మారడంతో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. పండించడం సహా రవాణా వరకు నిఘా వ్యవస్థను పటిష్టం చేసి కట్టుదిట్టంగా వ్యవహరించింది. ఇప్పుడు నగరం ఎక్కువ శాతం ప్రశాంతతను సంతరించుకుంది.

జనాభా
Vagonesmetro20వ శతాబ్దంలో జనభా విపరీతంగా పెరిగింది. 1905లో 59,815మంది ఉండగా 1951 వచ్చే సరికి ఇది 3,58,189కు చేరుకుంది. 2012 లెక్కల ప్రకారం ఈ నగర జనాభా 2.7 మిలియన్లు. దీని పక్కనే ఉన్న తొమ్మిది పట్టణాలతో కలిపి దీన్ని మెట్రో పాలిటిన్‌ సిటీగా పరిగణిస్తారు. ఈ మెట్రో పాలిటిన్‌ సిటీ జనభా 3.5 మిలియన్లు. జనాభా, ఆర్ధిక పరంగా కొలంబియాలో దీనిది రెండవస్థానం. చదరపు కిలోమీటరు వైశాల్యంలో 5820 మంది నివసిస్తున్నారు. నిరక్ష్యరాస్యత కేవలం 9.8 శాతం మాత్రమే. 98.8 శాతం ఇళ్లకు విద్యుత్‌ సౌకర్యం, 97.9 శాతం ప్రజలకు ప్రభుత్వ నీటి సదుపాయం, 91శాతం మంది ల్యాండ్‌లైన్‌ ఫోన్‌లను వినియోగిస్తున్నారు.

రవాణా
Metrocablemedమెడిలిన్‌లో మూడు రవాణా వ్యవస్థలు పనిచేస్తున్నాయి. రోడ్డు, మెట్రో రైల్వే, రోప్‌వే వసతుల్లో ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటారు. కొలింబియాలో మెడిలిన్‌లో మాత్రమే మెట్రో వ్యవస్థ ఉంది. నగరంలోకి ఎక్కువ ప్రాంతాల్లో మెట్రో రైల్‌ సౌకర్యం అందుబాటులో ఉంది. కొండ ప్రాంతాల్లో ఎక్కువగా రోప్‌వేను వినియోగిస్తారు.భూగర్భ రవాణా వ్యవస్థ అత్యంతభద్రంగా నిర్వహించడం మరో విశేషం. మెడిలిన్‌లో ఉన్న చక్కటి రవాణా వ్యవస్థను గుర్తించిన శాన్‌ప్రాన్సిస్‌ 2012లో అవార్డును కూడా ఇచ్చింది.

పర్యాటకం
medellinఆంటోక్వియా మ్యూజియం మెడిలిన్‌ సిటీలో చెప్పుకోదగినది. కొలింబియా మొత్తం మీద ఇది పేరుపొందిన మ్యూజియం. 1881లో దీన్ని నిర్మించారు. ఇక్కడి గ్రంథాలయాల్లో కూడా ఎంతో నైపుణ్యం కనిపిస్తుంది. వీటిని పార్కుల మాదిరిగా అభివృద్ధి పరిచారు. సాంఘిక అభివృద్ధి, సిటిజన్ల సమావేశాలు, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. పర్యాటక రంగం అభివృద్ధి వైపు మెడిలిన్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే నగర ప్రధాన ఆదాయ వనరుల్లో పర్యాటకం ఒకటి. మెడికల్‌ టూరిజంకేంద్రంగా మెడిలిన్‌కు గుర్తింపు ఉంది. మెడిలిన్‌లో ఆర్వి పర్యావరణ పార్కు కూడా చెప్పుకోదగింది. ఈ నగరానికి వచ్చిన వారు రోప్‌ వే కారు ప్రయాణం చేసి ఎంతో అనుభూతిని పొందుతారు. ప్రజలు ఎక్కువగా క్యాథలిక్‌లు కావడంతో వారి సంప్రదాయ కళాత్మకతే చర్చిల్లో కనిపిస్తుంది.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top