You Are Here: Home » సఖి » దివ్యౌషధం – వేపచెట్టు

దివ్యౌషధం – వేపచెట్టు

ప్రకృతిలో అనేక ఔషధ మొక్కలు తీగలుగా, గుల్మాలుగా, పొదలుగా, వృక్షాలుగా మనదేశంలో పెరుగుతాయి. ఇటువంటి మొక్కలకు తూర్పు, పశ్చిమ హిమాలయాలు , నీలగిరి పర్వతాలు నెలవులు. మనదేశంలో వేపను దివ్యవృక్షంగా పేర్కొంటూ పూజిస్తారు. వేపపుష్పాలు చిన్నగా, తెల్లగా,తీయని పరిమళముతో కూడిఉంటాయి. వేరు, బెరడు, పత్రములు, పూవులు, విత్తనాలు అన్నికూడా ఔషధ బలాన్ని చూపుతున్నప్పటికీ, ఆకులు అధిక ఔషధ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. చర్మవ్యాధుల నివారణకు ఇది పెట్టింది పేరు.

IMGవేప సాధారణంగా వేగంగా పెరిగే వృక్షము. వ ర్షాభావ పరిస్థితిని తట్టుకుంటుంది. బెరడు గర కుగా, నల్లగా ఉంటుంది. జిగురు పదార్థము ముద్దలుగా దీనిపెై ఏర్పడును. దీనిని ఈస్ట్‌ఇండియా గమ్‌ అని ఆంటారు. నాణ్యమైన కలప లభించడం వల్ల దీనిని గృహనిర్మాణ ము,గృహోపకరణ సామాగ్రికి , సేద్య పనిముట్లకు వాడుతారు.ఈ కలపలో కీటక నాశన రసాయనాలు ఉన్నందున చెదలు పట్టుటగాని, పుచ్చిపోవడం కాని జరుగదు. బెరడును టానిక్‌గా వాడుతారు. జిగు రును బట్టలనేతకు సంబంధించిన పరిశ్రమలలో, రంగులు, అద్దకం పరిశ్రమలలో ఉపయోగిస్తారు. అలాగే కొన్ని రకాల మందులలోను వాడుతున్నారు. విత్తనాలనుంచి తెైలాన్ని తీస్తారు. దోమలను పారదో లేందుకు దీన్ని వాడతారు.

వేప చెక్కను, వేపపిం డిని క్రిమిసంహా రిగా చెట్లకు వాడుతారు. పచ్చి ఆకులను ఎరువుగా వాడతారు.1942లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సైంటిఫిక్‌, ఇండస్ట్రియల్‌ ప్రయో గశాల లో(ఇండియా) దీనినుంచి మూడు చేదు మిశ్రమాలను వెలికి తీశారు. అవి నింబి, నింబినిన్‌, నింబి డిన్‌లు. విత్తనాలలో అజాడిరక్టిన్‌ అనే పదార్థము అధికం. వేప శీలింధ్రాలను, బాక్టీరియాను, వెైరస్‌ ను నశింపజేస్తుం ది. ఆయుర్వేద మందులలో వేప అతి ప్రధానమైనది. ఎక్కువగా వేపనూనెను చర్మవ్యాధులకు వాడతారు. అలంకార ద్రవ్యాలలోను, సబ్బులు, షాంపూల తయారీలోనూ విరివిగా వాడతారు. దీని వల్ల చర్మ సౌందర్యాన్ని పెంపొందించు కోవచ్చును.

ప్రపంచవ్యాప్తంగా పంటలను నాశనం చేసే 500 రకాల కీటకములను, శక్తిహీన ము చేయు స్వభావమును కలిగిఉంది. వేపనుంచి ఉత్పత్తి అయ్యే కీట క నాశక ములు చౌకగా లభిస్తాయి. అంతేకాక జం తువులకు, పంటకు ఉపయోగపడే కీట కాలు (సీతాకోకచిలుక) లకు హాని చేయవు.
చర్మవ్యాధులకు ఆకులను నూరి ముద్దగా చేసి వాడతారు. 4,5 వేపాకులను 2 కప్పుల నీటిలో వేసి బాగ మరిగించి ముఖానికి ఆవిరిపట్టి గోరు వెచ్చని నీటి తో ముఖాన్ని కడుక్కుంటే నిగారింపు చేకూరును. మొటిమలను, మచ్చలను నివారించును.

దురదలకు వేప చిగురు టాకులను పసుపును బాగా కలిపి మొత్త గా నూరి పూసిన తగ్గి పోవును. వేప గల్కండ్‌ను ఉదయం పూట ఒక చెంచా తీసుకుంటే రక్తశుద్ధి, ఆకలిని పెంపొం దించును. మశూచికి లేత వేపవేప ఆకు లను మెత్తగా నూరి ఉండలు చేసి తీసు కున్న కడుపులోని క్రిములు నశించును. బాలింతలు, మశూచి వ్యాధిగ్రస్తులు స్నా నానికి ముందు ఒంటికి రుద్దుకుంటే మంచిది. వేపపుల్లలను వాడడం వల్ల చిగుళ్లు గట్టిపడి, నోటి దుర్వాసన పోతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top