You Are Here: Home » ఇతర » దివి నుండి భువికి

దివి నుండి భువికి

భారత అమెరికన్‌ వ్యోమగామి సనీతా విలియవ్గ్సు నాలుగు నెలల పాటు అంతరిక్ష యానం ముగించుకుని మెున్న సోమవారం నాడు సురక్షితంగా భూమి మీద కాలు మోపింది. ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడిపిన తొలి వ్యోమగామిగానే కాకుండా తొలి మహిళగా కూడా సరికొత్త రికార్డ్‌ సృష్టించి ప్రపంచాన్ని ఆనంద డోలికల్లో ముంచెత్తింది. నిజంగా ఇది ఎంతో గర్వకారణం. ఈమెతో పాటు ఈ అంతరిక్ష యాత్రలో పాల్గొన్న మరో ఇద్దరు సహచురులు కూడా సురక్షితంగా చేరుకున్నారు. జులై 15న వీరు అంతరిక్షంలోకి వెళ్ళిన విషయం అందరికీ విదితమే. 127 రోజల ప్రయాణంలో ఎన్నో పరిశోధనలు చేస్తూ కజిగస్థాన్‌ ఆర్కలిక్‌ పట్టణం దగ్గర సోమవారం ఉదయం 7.30 నిముషాలకి సోయజ్‌ టి.ఎం – 5 నౌకలో భూమి మీద అడుగు పెట్టారు. అంతరిక్షంలో స్పేస్‌ స్టేషన్‌కి మరమ్మత్తులు చేసి అంతరిక్ష పరిశోధనా సంస్థకు తన అమూల్యమైన సేవలందించింది సునీతా విలియవ్గ్సు. అంతేకాకుండా అంతరిక్షంలో ఏడు సార్లు స్పేస్‌ వాక్‌ కూడా చేసి అద్భుతమైన రికార్డ్‌ని సొంతం చేసుకుంది.

సునీత సెప్టెంబర్‌ 19, 1965లో యూక్లిడ్‌లోని ఒహియోలో డా. దీపక్‌ పాండ్య, బొన్నీ పాండ్య దంపతు లకి జన్మించింది. తండ్రి ప్రముఖ న్యూరాలజిస్ట్‌. వీరి కుటుంబం తర్వాత మసాచుసెట్స్‌కి మారారు. తండ్రి వంశీయులు గుజరాత్‌కి చెందిన వారు. ఇక సునీత మసాచుసెట్స్‌లోని నీధంలో ‘నీథం హైస్కూలు ’లో విద్యాభ్యాసం అనంతరం 1983లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది. 1987లో యునైటెడ్‌ స్టేట్స్‌ నేవల్‌ అకాడ మీలో ఫిజికల్‌ సైన్స్‌లో పట్టా పొందింది. 1995లో ఫ్లోరిడా ఇన్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ద్వారా మాస్టర్స్‌ డిగ్రీ చేసింది. ఆ తర్వాత విలియమ్స్‌ని వివాహం చేసుకుని స్థిరపడింది.

అంతరిక్ష కేంద్రంలో…
Untiaసునీత 1998లో నాసాకి ఎంపికయ్యింది. అంతకు మునుపు భర్త విలియమ్స్‌తో పాటు కొంతకాలం హెలీకాఫ్టర్‌ నడుపుతూవుండేది. నాసా నుంచి ఆహ్వానాన్ని అందుకు న్నాకా ఆగస్ట్‌ 1998లో జాన్సన్‌ స్పేస్‌ సెంటర్లో తన ట్రైనింగ్‌ని పూర్తిచేసుకుంది. టి-38 విమాన యానానికి కావలసిన ట్రైనింగ్‌ అంతా ఎంతో క్షుణంగా నేర్చుకుంది. అందులోనే ఎన్నో సరికొత్త సాంకేతిక విధానాలు ఆకళింపుచేసుకుంది. అంతరిక్షంలో అడుగుపెట్టిన తర్వాత ఎన్నో సార్లు స్పేస్‌ వాక్‌ చేసింది. రష్యన్‌ స్పేస్‌ ఏజన్సీ, ఐఎస్‌ఎస్‌కి కూడా సునీత మాస్కోలో తన సేవలు అందించింది. అప్పుడే తన తొలి సాహసయాత్ర మొదలయ్యింది. విలియమ్స్‌ ఎక్స్‌పేడిషన్‌-1కి తిరిగి వచ్చింది. ఈమె ఈ సంస్థలో రోబోటిక్స్‌ విభాగంలో పనిచేసింది.

అంతే కాక ఈమె 2002లో నీమో-2 అనే జలాంతర్గామి వంటి నౌకలో సిబ్బందితో పాటు నీటి అడుగున 9రోజులు పనిచేసింది. అదే విధంగా డిశంబర్‌ 9, 2006లో విలియమ్స్‌-116 అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్‌కు డిస్కవరీ వ్యోమనౌకలో ఎక్స్పిడిషన్‌-14 బృందంతో కూడా కలిసి పనిచేసింది. 2007 ఏప్రిల్‌లో ఇదే బృందాన్ని మళ్ళీ ఎక్స్పిడిషన్‌ 15కు మార్చడంతో సనీతా విలియమ్స్‌ ఇక్కడ కూడా తన సేవలందించింది. ఎస్‌టిఎస్‌-117కి విలియమ్స్‌ మిషన్‌ స్పెషలిస్ట్‌గా పనిచేసి జూన్‌ 22, 2007లో భూమికి తిరిగి వచ్చింది. ఈ వ్యోమనౌక ఆరోజున కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్‌‌స ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌కు 3 గంటల 49 నిముషాలకి భూమికి చేరింది. రికార్డ్‌ స్థాయిలో సునీత 195 రోజులు అంతరిక్షంలో గడిపి ఇంటికి తిరిగి వచ్చింది.

తను ఈ విధంగా స్పేస్‌కు వెడుతున్నప్పుడు తన వ్యక్తిగత అవసరాల కోసం తీసుకువెళ్ళే సామాన్లతోపాటు ఒక భగవద్గీత పుస్తకాన్నీ, వినాయకుడి విగ్రహాన్నీ, సరదాగా తినడానికి సమోసాలు తీసుకువెళ్ళింది. ఇదే భారతీయత అంటే. ఈ సాహస యాత్రలో ఒకసారి కేప్‌ కెన్నెడీ అంతరిక్ష పరిశోధనా సంస్థ అధికారులు, వాతావరణం అనుకూలించక అట్లాంటిస్‌ను బలవంతంగా మొజావే ఎడారికి మళ్ళించడానికి మూడు సార్లు ప్రయత్నం చేసారు. కానీ మూడు ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఎంతో ఉత్సుకతతో మొత్తానికి సురక్షితంగా ఈ బృందం భూమికి చేరింది. స్వాగత సత్కారాలతో ఎందరో ప్రముఖులు అభినందనలు తెలి పారు. భూమికి దిగివచ్చిన తర్వాత ఏబీసీ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ వారు డిశంబర్‌లో 41 ఏళ్ళ వయసున్న సునీతని ‘పర్సన్‌ ఆఫ్‌ ది వీక్‌’గా ఎన్నుకున్నారు.

భారతదేవ పర్యటన
Sunitaaసునీత తల్లి భారత దేశాభిమాని, ఈమె సునీతకి భారత దేశంతో అనుబంధాన్ని మర్చిపోకుండా చేయడం కోసం స్కూలు సెలవల్లో సునీతని తీసుకుని ఇండియాకి వచ్చి, గుజరాత్‌లో వారి కుటుంబ బంధువుల్ని కలిసి కొద్దిరోజులు వారితో గడిపి వెడుతూవుండేది. అందువలన సునీతకు కూడా భారతదేశం మీద, తన బంధువర్గం మీద ఎంతో ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి. ఇక తను జీవితంలో స్థిరపడినా కూడా అదే అలవాటుని పాటిస్తూ వచ్చింది, సునీతా విలియమ్స్‌ 2007లో మనదేశానికి వచ్చింది. అప్పుడు ఈమె సబర్మతీ ఆశ్రమానికీ, గుజరాత్‌లో ఈమె పూర్వీకుల్ని కలవడానికి ఝులాసన్‌ వెళ్ళింది. అప్పుడు గుజరాతీ సొసైటీవారు ఈమెకు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అవార్డును ప్రధానం చేసి సత్కరించారు.

నిజానికి ఈ పురస్కారం భారత పౌరసత్వం లేనివారికి ఇవ్వరు. అయినప్పటికీ భారతీయ సంతతికి చెందిన ఒక మహోన్నత మహిళగా గుర్తించి ఆ అవార్డ్‌ని ఈమెకు అందించారు. ఈ పురస్కారాన్నందుకున్న ఇతర దేశ పౌరసత్వ తొలి వ్యక్తి సనీతే. అక్టోబర్‌ 4, 2007న తన మేనల్లుడి పుట్టినరోజు వేడుకకి హాజరయ్యి, అప్పటి భారత రాష్టప్రతి ప్రతిభా పాటిల్‌ని కూడా రాష్టప్రతి భవన్‌లో కలుసుకుని ముచ్చటించింది. అలాగే అమెరికన్‌ ఎంబసీ పాఠశాలలో కూడా ప్రసంగించింది.

పురస్కారాలు
నేవీ కమెన్డేషన్‌ మెడల్స్‌ (రెండుసార్లు)
నేవీ అండ్‌ మరైన్‌ కార్పస్‌ అచీవ్‌మెంట్‌ మెడల్‌
హ్యుమానిటేరియన్‌ సర్వీస్‌ మెడల్‌, వివిధ ఇతర సర్వీస్‌ పురస్కారాలు

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top