You Are Here: Home » సినిమా » దాసరి కిరణ్‌ కుమార్‌ ‘వస్తా నీ వెనుక’

దాసరి కిరణ్‌ కుమార్‌ ‘వస్తా నీ వెనుక’

దాసరి కిరణ్‌ కుమార్‌ ‘వస్తా నీ వెనుక’

హవీష్‌ హీరోగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్‌, కిరణ్‌ స్టూడియోస్‌ సంయుక్త నిర్మాణంలో దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘వస్తా నీ వెనుక’. ఇందులో కథానాయికగా అమలాపాల్‌ ఎంపికయ్యారు. మరో నాయికగా ఇష చేస్తున్నారు. దర్శకుడు రమేష్‌ వర్మ మాట్లాడుతూ… చక్కటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ప్రేమ, వినోదం సమపాళ్లలో మిళతమై ఉంటాయి. హవీష్‌ పాత్ర చిత్రరణ యువతరాన్ని బాగా ఆకట్టుకుంటుంది. అమలాపాల్‌ది గ్లామర్‌, అభినయం మిళితమైన పాత్ర. సినిమాకు వెన్నెముకలాంటి పాత్రను ఇష పోషిస్తున్నారని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ… ఈ సినిమాకు మంచి టీమ్‌ కుదిరింది. ‘బొమ్మరిల్లు’ ఫేమ్‌ విజరు కె. చక్రవర్తి ఫొటోగ్రఫీ అందిస్తున్నారు. ఏప్రిల్‌ 4నుంచి యూరప్‌లో చిత్రీకరణ మొదలు కానుంది. 55రోజుల అక్కడే షెడ్యూల్‌ చేస్తాం. కీలకమైన టాకీపార్ట్‌తోపాటు ఆరు పాటలనూ అక్కడే చిత్రీకరిస్తాం. స్పెయిన్‌లో రెండు పాటలు, స్విట్జర్లాంగ్‌లో మూడు పాటలు, పారిస్‌లో ఒక పాటను చిత్రిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఆర్ట్‌: ప్రకాష్‌, స్క్రిప్ట్‌ కో ఆర్డినేటర్‌: పాత్రికేయ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్‌ వర్మ.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top