You Are Here: Home » ఇతర » దార్శినికుడు గురజాడ!

దార్శినికుడు గురజాడ!

‘దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్న
దేశమంటే మట్టికాదోయ్‌, దేశమంటే మనుష్యూలోయ్‌!’
ఇది గురజాడ దేశభక్తి ప్రభోదం
ఆధునిక మహిళ చరిత్రను పునర్లిఖిస్తుంది.
ఇదిగురజాడ దార్శికత్వానికి నిదర్శనం!
మలినత్వమే మాలగాని… మనుషూలుకాదు
మంచి అన్నది మాల అరుుతే మాల నేనౌతాను!
అన్నదమ్ముల వలెను జాతులు, మతములన్ని మెలగవలెనోయ్‌
ఇది గురజాడ సమనత్వానికి సంేకతం!
పొగతాగనివాడు దున్నపోతైపుట్టున్‌!
మనం చేస్తే లౌక్యం – అవతలివాళ్ళుచేస్తే మోసం
ఇది ఆ మహాకవి హాస్యప్రియత్వానికి మచ్చుతునక!
ఇలా రాసుకుంటూపోతే గురజాడ అప్పారావు ఆలోచనలు ఉద్గంధ్రాలే అవుతారుు.

guraకృష్ణాజిల్లా గురజాడకు చెందిన పూర్వీకులు విశాఖ జిల్లా యలమంచిలి తాలుకా రామవరం గ్రామానికి వలసవచ్చిన తరువాత 1862 సెప్టెంబరు 21న రామదాసు,కౌశల్య దంపతులకు జన్మించిన గురజాడ వెంకటఅప్పారావు ఆధునిక సాహిత్యవేత్తలలో అగ్రస్థ్ధానాన నిలిచారు. అప్పటికి విశాఖజిల్లాలో ఉన్న విజయనగరానికి వచ్చి గురజాడ కుటుంబం విజయనగరం సామ్రాజ్యాధిపతులకు చేరువెైంది. గరివిడి మండలం గుడివింద అగ్రహారంలో చిన్ననాటి విద్యాభ్యాసం, హైస్కూలు విద్య చీపురుపల్లి బ్రాంచ్‌ స్కూల్‌చదివి ఆతర్వాత కాలేజి విద్యకు ఎంఆర్‌కాలేజి విజయనగరం వచ్చారు. ఆధునిక తెలుగుబాషా ఉద్యమానికి కలిసిన నడిచిన గిడుగు రామూర్తి పంతులతో లిసి చదివిన కాలేజిలోనే 19ఏటన ఉద్యోగంలో చేరి 29ఏళ్ళు పనిచేశారు. మధ్యలో కలెక్టర్‌ కచేరిలో హెడ్‌గుమస్తాగా పని చేశారు. తిరిగి మహారాజా కాలేజిలో 4వ ఉపన్యాసకుడిగా పనిచేశారు. 1886లో సంస్ధాన పరిశోధకునిగా చేరడంతో రాజావారితో పరిచయం ఏర్పడి బలపడింది.

1884లో కాలేజి ఉద్యోగం, 1886లో కలెక్టరు ఉద్యోగం, 1885లో అప్పల నరసమ్మతో వివాహం జరిగింది. 1887 నుంచి పూర్తిస్ధాయి అధ్యాపకునిగా పనిచేశారు.
గురజాడ గృహాన్ని 1986నుంచి సమాచార సాంస్కృతిక శాఖ పర్యవేణలో సాగుతోంది. అప్పటి నుంచి ఇక్కడ గ్రంథాలయం నిర్వహిస్తున్నారు. సమాచార శాఖ ఉద్యోగులే ఇక్కడ పనిచేస్తున్నారు. అయితే దీన్ని మార్చేసి గురజాడ మ్యూజియంగా మార్చే ప్రతిపాదన ఉంది.ముక్కుపచ్చలారని బాలికలను ముదుసులలుకు కట్టబెట్టే దురాచారంపెై గురజాడ పూరించిన శంఖారావమే కన్యాశుల్కం నాటకం.అప్పటికే ఆనంద గజపతిరాజు సర్వే చేయించి ఏటా సరాసరి 344 బాల్యవివాహాలు జరుగుతున్నట్టు గుర్తించారు. ఈ సాంఘిక దురాచారాలపెై ప్రజలను చెైతన్య పరచాలన్న ఆయన అభిప్రాయం మేరకు నాటకమే దీనికి దోహదపడింది. ఆ ఆలోచనలకు ఫలితంగా 1892లో కన్యాశుల్కం ఊపిరిపోసుకుంది.1897లో నాట కం తొలి కూర్పునకు ఆనంద గజపతిరాజుకు అంకితమిచ్చిన గురజాడ 1909లో నాటాకానికి మలికూర్పు చేశారు. 120ఏళ్ళను పూర్తి చేసుకున్న ఈ కన్యాశుల్కం నాటకంనేటికి సమాజానికి దర్పణం పడుతున్న వెైనం అపూర్వం.
కన్నడం, ప్రెంచ్‌, రష్యన్‌, తమిళంతో పాటు హిందీ, ఇంగ్లీష్‌ బాషలలో రెం డేసి సార్లు అనువాదమైన నాటకం సజీవ పాత్రల సమకాలిన దర్పణం.

రచనా వెైషమ్యాలు
గంగిగోవుపాలు గరిటిడెైనాచాలు అన్న ట్టు గురజాడ రచనలు రాశిలో తక్కు వెైనా వాసిలో విశేషమైనవే. పుత్తడిబొమ్మ పూర్ణిమ, సారంగధర, కొండు భల్టీయం, నీలగిరిపాటలు, ముత్యాలసరాలు, కన్య క, బిల్హణీయం, (అసంపూర్ణం) సుభద్ర, లంగరెత్తుము, దించులంగరు, లవణరా జుకల, కాసులు, సౌదామిని, (రాయలను కున్న నవలకు తొలిరూపు) కథానికలు, మీపేరేమిటి? దిద్దుబాటు, మెట్టిల్డా, సం స్కర్త హృదయం, మతము-వితము వంటిరచనలతో

వెలుగుజాడగామారారు.
1910లో ఆమనరాసిన దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచు మన్న గేయానికి ప్రముఖ సంగీత విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు సంగీత బాణికట్టగా, 1913లో కృష్ణాపత్రిక ఈగేయాన్ని ప్రచురించింది. 1954లో మహాకవి డెైరీల పేరుతో ఆయ న జీవితాన్ని విశాలాంధ్రలో ప్రత్యేక ప్రచు రణలతో ప్రజలకు చేరువ చేసింది. 1972లో బాహుముఖ చిత్రంతో ఎమ్మె స్కో సంస్థ ముత్యాల సరాలు పుస్తకాన్ని ప్రచురించింది. ఇక గురజాడ రచనలపెై వచ్చిన గ్రంధాలు, విశ్లేషణలు పరిశోధ నలు వేలల్లోనే ఉన్నాయి. గతంలో గుర జాడపెై భుజంగరావు అనే దర్శకుడు లఘ చిత్రాన్ని నిర్మించగా దూరదర్శన్‌ ప్రసారం చేసింది.

స్ఫూర్తిగానిలవాలి కలెక్టరు
గురజాడ ఉత్సవాల్లో అంతాపాల్గొనాలని కలెక్టరు వీరబ్రహ్మయ్య తెలిపారు. ఆ మహాకవి ఉత్సవాలు నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. మూడురోజలుపాటు జిల్లాలో ఉత్సవాలు జరుపుతున్నామన్నారు. 19న సాయంత్రంతో ప్రారంభించిన ఉత్సవాలు 21వరకు ఉత్సవాలు జరుపుతామన్నారు. 21న 10వేల మంది విద్యార్ధులో గజల్‌శ్రీనువాస్‌ జిల్లాకు చెందిన గాయనీ గాయకులు విద్యార్ధులంతా దేశమును ప్రేమించుమన్న గీతాలాపన చేస్తారన్నారు. అలాగే ప్రతిజ్ఞ ఉంటుందన్నారు. రాష్టవ్య్రాప్తంగా అన్ని పాఠశాలలో ఈ గీతాలపన ఉంటుందన్నారు.

ఎంతో గర్వకారణం
గ్రథాలయ చెైర్మన్‌ రొంగలి పోతన
సాంఘికదురాచారాలనిర్మూలనకు తన కలాన్నిపదు నుపెట్టిన మహాకవి. కన్యాశుల్క ద్వారా వరకట్న దురాచారాన్ని ఎండగట్టిన విశ్వకవి నడియాడిన నేలపెై తిరగడం మాగర్వకారణం. ఆయనపేరున గ్రంధాలయం, ఆడిటోరియం ఉన్నాయని ఎందరో దర్శిస్తూ ఉంటారన్నారు.

ఎందరో వస్తుంటారు
ల్రెబరేరియన్‌ వెంకట్‌
గురజాడ గృహంలో సమాచారసాం స్కృతికశాఖ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న గ్రంథాలయానికి ల్రెైబరీయన్‌ గురజాడ గృహం ఆలనాపాలనాచూస్తూంటార. ఇక్కడపనిచేయడం తన అదృష్టమన్నారు. ఎందరో వస్తుంటారన్నారన్నారు.

అడుగుజాడ గూరజాడ
జిల్లాలో ఇప్పటికీ సాంస్కృతిక వ్యవహారాల మండలి ఆధ్వర్యాన గురజాడ స్మారకభవనం సందర్శకులకు మధురానుభూతులుగా మిగులుతోంది.
గురజాడ కళాభారతి ఆధునీకరణతో సహా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాలో కోటిరూపాయలతో ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది.ఉత్సవాలను 19,20,21 తేదిల్లో నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు అతిరధమహారధులంతా హాజరుకానున్నారు.

ఎవరే మన్నారంటే…
గురజాడరచనలు కాలగర్భంలోకలిసినా ఆమన దేశ భక్తిగీతం ఒక్కటిచాలు… శ్రీశ్రీ
కన్యాశుల్కం నాటకం సాటిరాగల రచన భారతీయ సాహిత్యంలో మచ్చుకటికం తప్ప మరొకటిలేదు…. శ్రీశ్రీ
గురజాడ చనిపోలేదు.. 1915 నుంచే జీవించడం ప్రారంభించాడు.. దేవులపల్లి కృష్ణశాస్ర్తి
విత్రయం అంటే తిక్కన, వేమన, గురజాడ…. శ్రీశ్రీ
కన్యాశుల్కం భీభత్స, రసప్రధానమైన విషాదాంత నాటకం… శ్రీశ్రీ

ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం
స్పెషల్‌ ఆఫీసర్‌ వాసుదేవరావు
జిల్లాలో మహాకవి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 19, 20, 21 తేదిల్లో జరిగే ఉత్సవాలకు అతిరధ మహారధులంతా హాజరెైనారు.

ఉత్సవాలు జరపడం గర్వకారణం
డిపిఆర్‌ లక్ష్మికాంతం
మహాకవి ఉత్సవాల్లో మేము భాగస్వామ్యులు కావడం గర్వకారణమన్నారు.ప్రచారబాధ్యతలు నిర్వర్తిస్తూ ఉత్సవాల విజయవంతానికి కృషిచేస్తున్నామన్నారు.

ప్రత్యేకతలెన్నో…
1911లో మద్రాసు బోర్డుఆప్‌ స్టడీస్‌లో సభ్యత్వం పొందిన ఆయన ఒరిస్సా రాష్ట్రం బరంపురంలో జరిగిన అన్ని కులాల సహపంక్తి భోజన కార్కక్రమానికి పాల్గొని తానేమిటో చెప్పారు. ప్రజలకు అందుబాటులో లేని గ్రాంధి భాషను తెలుగు వాడుక భాషలోకి తెచ్చిన ఉద్యమంలో గిడుగు రామూర్తితో కలిసి ఆయన ఆధునికాంధ్ర కవితావెైతాళికునిగా గుర్తిండిపోయారు.

ప్రశంసల జల్లులు
కవిత్రయ నుండే తిక్కన, వేమన, గురజాడ-ఇది శ్రీశ్రీఉవాచ.
గురజాడ 1915లో చనిపోలేదు ఆయన అప్పటి నుంచి జీవించడం ప్రారంభించారు అన్నారు దేవులపల్లి కృష్ణశాస్ర్తి.

…అడుగుజాడ గురజాడ:
సాహిత్తీవేత గోపాలరావు
ప్రాంతాలకతీతంగా ప్రతిదేశంలో ఉండే పౌరుడు వారి దేశాన్ని ప్రేమించేలా దేశమునుప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న అనే గొప్ప సందేశాన్ని చాటిన మహాకవి అన్నారు. మనిషిలో స్వార్ధం తగ్గించేందకు సొంత లాభం కొంత మానుకో.. తోటి వారికి సాయపడవోయ్‌ అన్న మహాకవఇన్నారు.

… గురజాడకు సంబంధించి మునిమనువడు గురజాడ వెంకటేశ్వరప్రసాద్‌, అతని భార్య ఇందిరా ప్రసాద్‌లు గురజాడ గృహం పక్కనేఉంటున్నారు. 150జయంతి సందర్భంగా వారిని ‘మేజర్‌న్యూస్‌’ పలరించగా గురజాడ ఉత్సవాలు ఇంత ఘనంగా జరపడం వాటిని చూసే భాగ్యం కలగడం అదృష్టమన్నారు. ఆ మహావి గృహాన్ని మ్యూజియంగా మార్చి ఆయనకు సంబంధించిన వస్తువులన్ని అక్కడే భద్రపరిచి అందరికి స్ఫూర్తినిచ్చేలా తీర్చిదిద్దాలన్నారు. ఆయనకు వారసులమైనా ఆయన రచనలకు అందరూ వారసులేనన్నారు. ఉత్సవాలు ఇంతఘనంగా నిర్వహించడానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం వీరి ఇద్దరికి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు కల్పించారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top