You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » దళిత జనోద్ధరణకు భూదానోద్యమం

దళిత జనోద్ధరణకు భూదానోద్యమం

తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలో కృష్ణ మ్మాళ్‌ పుట్టారు. దళిత కుటుంబంలో జన్మించిన ఆమెకు ఇల్లు తప్ప బయట ప్రపంచం తెలియదు. ఆ తర్వాత శంకర్‌ లింగం జగన్నాథన్‌తోవివాహం జరిగాక ఆమె స్వాతంత్య్ర సమరయోధురాలిగా మారారు. గాంధీ బాటలో నడిచారు. సంఘంలో ఉన్న కువాదాన్ని గట్టిగా వ్యతిరేకిస్తారామె. అందుేక దళితుల సముద్ధరణకు ఆ దంపతులు నడుం బిగించారు. భూములు లేనివారికి, పేదరికంతో బాధపడుతున్న దళి తులకు సేవ చేయడమే తమ లక్ష్యంగా ఎంచుకున్నారు. దళితుల హక్కులకోసం అనేక సార్లు ప్రభుత్వంతోనూ, పెద్ద పరిశ్రమల యాజమాన్యాలతోనూ పోరాటం కూడా చేశారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో గాంధీజీ పిలుపునందుకుని ఉద్యమంలోకి దూకారు. ఆ సమయంలో నే ప్రముఖ గాందేయవాది, సంఘసేవకులు అరుున వినోభా బావేతో పరిచయం అరుుంది. తను సమాజానికి ఏదో చేయాలన్న సంకల్పాన్ని భర్త జగన్నాథన్‌ ముందు వెల్లడించింది. తన భార్యలో ఉన్న సామాజిక సృ్పహకు ఆయన కూడా వెన్నుతట్టారు.

బాల్యం నుంచే సామాజిక స్పృహ
Undకృష్ణమ్మాళ్‌ 1926లో ఒక నిరుపేద దళిత కుటుంబంలో జన్మిం చారు. ఆ రోజుల్లో దళితులపెై వివక్ష కొనసాగుతోంది. ముఖ్యం గా తన తల్లి నిండుగర్భిణిగా ఉండికూడా పుట్టెడు చాకిరి చేయా ల్సిరావడం ఆమెను కలచి వేసింది. అందుకే వివక్షపెై యుద్ధం చేయాలని సంకల్పించారు. సర్వోదయ ఉద్యమంలో చేరి అనేక ఉద్యమాలు నిర్వహించారు. ఆ సమయంలోనే జగన్నాథన్‌తో పరిచయం పెరిగింది. ఆ పరిచయమే వారిని ఒకటి చేసింది. స్వాతంత్య్రం వచ్చేంతవరకు వివాహం చేసుకోకూడదనుకున్న వారిద్దరూ అనుకున్నట్లే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1950లో పెళ్లి చేసుకున్నారు. జగన్నాథన్‌ ఉన్నత కుటుంబానికి చెందిన వాడు. సహాయ నిరాకరణ సమయంలో గాంధీజి పిలుపునందుకుని చదువును వదిలి స్వాతంత్య్ర పోరాటంలో చేరారు.

భూదానోద్యమం
దళితులు పేదలుగా ఉండడానికి ప్రధానకారణం వారికి భూము లు లేకపోవడమే అని గుర్తించిన వారు వినోభ బావేతో కలసి భూదానోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయురాలిగా కృష్ణమ్మాళ్‌ పని చేయగా, జగన్నాథన్‌ ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్‌ అయ్యారు. రిటైర్‌ అయిన తర్వాత 1968లో దళిత జనోద్ధరణకు నడుం బిగించారు. భూమిలేని నిరుపేద దళితులకు భూపంపిణీ చేయడంతో పాటు వారికి విద్యనందించాలన్న దృడ సంకల్పంతో 1981లో వారు లాఫ్టి అనే సంస్థను స్థాపించారు.

లాఫ్టీ కార్యకలాపాలు
DSCeనిరుపేద దళితులను, భూస్వాముల ఆస్తులను గుర్తించి వారి పేర్లను నమోదు చేస్తుంటారు. భూస్వాముల ఆస్తులను కొనుగోలు చేసి దాన్ని దళితులకు బదిలీ చేస్తారు. ఇలా ఆస్తులు స్వీక రించేవారికి ఎంతో కొంత ఆస్తి ఉంటే గనక దఫ దఫాలుగా డబ్బు కట్టించుకుంటూ ఆస్తిని అందచేస్తారు. ముందు ఆస్తి బదిలీ భూస్వాములకు, లాఫ్టికి మధ్య జరుగుతుంది. ఆ తర్వాత లాఫ్టికి, పేద ప్రజలకు మధ్య జరుగుతుంది. అలాగే లాఫ్టి యాజమాన్యం బ్యాంకులు, తమిళనాడు ఆది ద్రావిడ హౌసింగ్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ (టిఎహెచ్‌ డిసివొ), నేషనల్‌ ఎస్‌సి, ఎస్‌టి ఫెైనాన్షియల్‌ హౌ సింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొ రేషన్‌ వంటి సంస్థల నుండి రుణాలను కూడా తీసుకుంటుంది.

భూబదిలీ ప్రక్రియ
గ్రామాల్లో సంస్థ గ్రామ సభ కమిటీలను ఏర్పాటు చేస్తుంది. ఈ సభకు హాజరవ్వాలనుకున్నవారికి ఎటు వంటి ఆస్తి ఉండకూ డదు. వారు దళితులెై ఉండాలి. ఏభెై ఏళ్లు నిండి ఉండకూడదు. ఆస్తి బదిలీ ఇంటి యజమానురాలి పేరుపెైనే చేస్తారు. ఈ నియ మాల్లో ఎంపికైన తర్వాత లాఫ్టికు, భూస్వాములకు ఎగ్రిమెంట్‌ కుదురుతుంది. ఎవరెైతే ఆస్తి అందుకోవాలనుకుంటు న్నారో వారి నుండి కమిటీ అదాయ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఫొటోలు, వయస్సు ధృవీకరణ పత్రం, ఇతర కుటుంబ వివరాలు స్వీ రిస్తుంది. అంతేకాకుండా ఈ భూబది లీల ప్రక్రియలో భూస్వా ములకు, పేద ప్రజలకు ప్రభుత్వం సహకారం వెంటనే అందిస్తోంది.

విద్యసేవలో…
DSaaలాఫ్టి సంస్థ ద్వారా కృష్ణమ్మాళ్‌ అతి తక్కువ ఫీజులు తీసుకునే స్కూళ్లను ఏర్పాటుచేశారు. కులభేదం లేకుండా స్కూళ్లో పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు . వారికోసం హాస్టల్‌ కూడా. మహిళల చేత పొలం పనులు చేయించడం, మగవారికి ఇళ్ళ నిర్మాణంలో మెళకు వలు నేర్పించడం వంటివి కూడా ఇందులో ఉంటాయి. అమ్మ, అప్పా అని అక్కడి వారు అప్యాయంగా పిలిచే వీరిద్దరిని గురించి తెలియని తమిళులుండరంటే అతిశయోక్తి కాదు. పేదల సేవలో తరి స్తున్న కృష్ణమ్మాళ్‌, జగన్నాథ్‌లు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందారు. వారు చేసిన సేవకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, బహు మతులు లభించాయి. ఉమెన్స్‌ వరల్డ్‌ సుమిత్‌ ఫౌండేషన్‌ వారు ‘ఇండియాస్‌ జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌’ అవార్డు కృష్ణమ్మాళ్‌కు అందించారు.

అవార్డులు

స్వామి ప్రణవానంద శాంతి అవార్డ్డు(1987)
జమ్నా లాల్‌ బజాజ్‌ అవారు ్డ(1988),
పద్మశ్రీ (1989), భగవాన్‌ మహావీర్‌ అవార్డు(1999)
స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం నుంచి సమ్మిట్‌ అవార్డు (2008)
ఏడు ఎన్జీఓ అవార్డులు
ఇవే కాక పలు ఇతర అవార్డులు కూడా వారు అందుకున్నారు.

స్వాతంత్య్రం వచ్చేంతవరకు వివాహం చేసుకోకూడదనుకున్న వారిద్దరూ అనుకున్నట్లే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1950లో పెళ్లి చేసుకున్నారు. జగన్నాథన్‌ ఉన్నత కుటుంబానికి చెందిన వాడు. సహాయ నిరాకరణ సమయంలో గాంధీజీ పిలుపునందుకుని చదువును వదిలి స్వాతంత్య్ర పోరాటంలో చేరారు.నిరుపేద దళితులను, భూస్వాముల ఆస్తులను గుర్తించి వారి పేర్లను నమోదు చేస్తుంటారు. భూస్వాముల ఆస్తులను కొనుగోలు చేసి దాన్ని దళితులకు బదలీ చేస్తారు.

దళితులు పేదలుగా ఉండడానికి ప్రధానకారణం వారికి భూము లు లేకపోవడమే అని గుర్తించిన వారు వినోభా బావేతో కలసి భూదానోద్యమానికి శ్రీకారం చుట్టారు. భూమిలేని నిరుపేద దళితులకు భూపంపిణీ చేయడంతో పాటు వారికి విద్యనందించాలన్న దృఢ సంకల్పంతో 1981లో వారు లాఫ్టి అనే సంస్థను స్థాపించారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top