You Are Here: Home » యాత్ర » దర్శనీయ ప్రదేశాలు » దర్శించండి .. తరించండి .. విహరించండి

దర్శించండి .. తరించండి .. విహరించండి

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మహా ధార్మిక సమ్మేళనం… ప్రతి హిందువు మనసును ఆధ్యాత్మికానందంలో ఓలలాడించే మహా సంబరం… యావత్‌ హిందూలోకం విశిష్టమైన తీర్థంగా భావించే… ప్రపంచంలోెకల్లా అతిపెద్ద మెత్సవం… మహా కుంభమేళా. ప్రయాగ (అలహాబాద్‌) లోని త్రివేణీ సంగమం వద్ద 14వ తేదీన మెుదలైన ఈ మహా హిందూ సమ్మేళనం మార్చి 10వ తేదీ వరకు 55 రోజుల పాటు కొనసాగనుంది. 144 ఏళ్ళ తరువాత జరుగుతున్న మహా కుంభమేళాకు దేశ విదేశాల నుండి వస్తున్న లక్షలకొద్ది భక్తులు ఆధ్యాత్మాకానందాన్ని పొందుతున్నారు. ఈ మహా కుంభమేళా ముగిసేనాటికి భక్తుల సంఖ్య కోటి దాటుతుందని ఓ అంచనా. ఇలాంటి అరుదైన మెత్సవ నేపథ్యంలో… అలహాబాద్‌ మాత్రమే కాకుండా… కుంభ మేళాల జరిగే నాసిక్‌, ఉజ్జరుు నీ, హరిద్వార్‌ వంటి పుణ్యక్షేత్రాలు… అక్కడి చూడదిగిన ప్రదేశాలపై ప్రత్యేక కథనం…..
త్రయంబేకశ్వరుడు కొలువైన… నాసిక్‌
మహారాష్ట్రలో ఉన్న మరో కుంభమేళా క్షేత్రం నాసిక్‌. ముంబయి నుండి 180, పుణెకు 220 కి.మీ.ల దూరంలో ఉంటుంది. భారతదేశ వైన్‌ కాపిటల్‌ గా ప్రసిద్ధిగాంచిన నాసిక్‌ దగ్గరలోనున్న త్రయంబకేశ్వర్‌ గోదావరి నదికి జన్మస్థానం. ఇక్కడ చివరిసారిగా 2003లో కుంభమేళా జరిగింది.

Trimbaaత్రయంబకేశ్వరాలయం: త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. ‘అంబక’మంటే ‘నేత్ర’మని అర్థం. మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని – అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన దేవుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మథుణ్ణి ఈ నేత్రా గ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి – అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. ‘త్రయంబకం యజామహే – సుగంధిం పుష్టి వర్ధనమ్‌’ మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు.

పురాతన త్రయంబకేశ్వరాలయం నాసిక్‌ నుండి 28 కి.మీ.దూరంలోని త్రయంబకం అనే పట్టణంలో ఉన్నది. శివుని ఆరాధన ప్రాముఖ్యంగా గల ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది పవిత్ర గోదావరి జన్మస్థానం. ప్రఖ్యాత సినీతంగ పితామహుడు దాదా సాహెబ్‌ ఫాల్కే ఇక్కడానే జన్మించారు. గోదావరి నది జన్మించిన పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వర్‌. త్రయంబకేశ్వర్‌లో పూజించే దేవుడు మహ శివుడు. ద్వాదశ మహా జోతిర్లింగా లల్లో ఒక పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వర్‌. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కూచెవులు కోసింది ఇక్కడేనట. భారత కరెన్సీని ముద్రించే మింట్‌ ఇక్కడే ఉంది. నాసిక్‌ పట్టణం… హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ల మాదిరిగా నాసిక్‌, పంచవటి అని రెండు భాగాలుగా ఉంది. గోదావరి ఉత్తరపు ఒడ్డున నాసిక్‌, దక్షిణపు ఒడ్డున పంచవటి ఉన్నాయి. సీతారాములు వనవాస కాలంలో ఈ పంచవటిలోనే పర్ణశాల నిర్మించుకొని ఉన్నారట! రావణుడు సీతాపహరణం ఇక్కడే చేశారని చెబుతారు.

త్రేతాయుగంలో ఇది దండకారణ్యం. లక్ష్మణుడు ఇక్కడే శూర్పణఖ నాసిక కోశాడు కాబట్టి ఇది నాసిక్‌గా పేరుపొందిందట. పంచవటి అంటే 5 మర్రిచెట్లు అని అర్థం. పంచవటిలో చూడదగ్గ ప్రాంతాలు తొమ్మిది ఉన్నాయి. అయితే అన్నీ చిన్న చిన్న దేవాలయాలు. పర్ణశాల అని రాసిన మందిరంలో సీతారాముల విగ్రహాలున్నాయి. పక్కనే ఉన్న మందిరంలో ఒక గుహ, దానిలో సొరంగం ఉంది. సొరంగంలో దిగడానికి మెట్లుంటాయి. లక్ష్మణుడు అందులో సీతమ్మను దాచి రాముడికి సహాయంగా వెళ్లాడట. తర్వాత నాసిక్‌లోని ముక్తిధామ్‌ (బిర్లామందిర్‌) చెప్పుగోదనికి వివాహకేంద్రం. పాలరాతితో నిర్మించిన ఈ భవనంలో కృష్ణుని దేవాలయం ఉంది.

ఆలయాలకు ఆలవాలం… ప్రయాగ…
Bharaaభరద్వాజ ఆశ్రమం: అతి పురాతనమైన ఈ ఆశ్రమం కలోనల్‌ గంజ్‌ లో ఆనంద భవన్‌ సమీపంలో ఉంది. త్రేతాయుగంలో వనవాసానికి బయల్దేరిన శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడితో సహా గంగానదిని దాటి ఈ ఆశ్రమానికి వచ్చాడు. ఇక్కడ మూడు రాతలు వుండి, భరద్వాజ మహర్షి దగ్గర అనేక విషయాలు తెలుసుకుని, ఆయన ఆశీర్వచనంతో యమునా నదిని దాటి చిత్రకూట్‌ కి పయనమయ్యాడు. ఆ కాలంలో గంగానది ఈ ఆశ్రమానికి సమీపంలో ప్రవహిస్తూ వుండేది. తర్వాత కాలంలో అక్బరు నిర్మిచిన బక్షి, బేని అనే ఆనకట్టల వలన గంగా ప్రవాహ గతి మారింది అంటారు.

ఆ కాలంలో చాలా దూర ప్రదేశాలనుంచి విద్యార్ధులు విద్యనభ్యసించటానికి ఇక్కడికి వచ్చేవారు. సందర్శకుల దర్శనార్ధం ఈ ఆశ్రమంలో శివ, కాళీమాత విగ్రహాలతోబాటు భరద్వాజ మహర్షి విగ్రహం కూడా వున్నది. ప్రస్తుతం ఆశ్రమానికి అతి సమీపంలో అనేక నివాస గృహాలు నిర్మించడమే కాకుండా ఆశ్రమానికి ఆనుకుని పార్కును కూడా అభివృద్ధి చేశారు.

అక్షయవటం: యమునానది తీరంలో ఉన్న అతి పెద్ద వృక్షం ఇది. పురాతన కాలానికి చెందిన పవిత్రం వృక్షం ఇది. ఈ వృక్షానికి మరణం లేదని ప్రతీతి. ఈ చెట్టుక్రింద ఎవరైతే పూజలు చేస్తారో లేదా మరణిస్తారో వారికి స్వర్గసుఖాలు లభిస్తాయట. 1999లో ఈ వృక్షం వద్ద సీతా సమేత రామలక్ష్మణులకు చిన్న ఆలయం నిర్మించారు. జైనులు కూడా అత్యంత పవిత్ర స్థలంగా భావించే ఈ వటవృక్షాన్ని దర్శించుకోవాలంటే ఆర్మీ అనుమతి తప్పనిసరి.

ఇవేకాకుండా… గంగానదీ తీరాన దరాగంజ్‌ వద్ద ఉన్న నాగవాసుకి దేవాలయం, యమునా నదీ తీరాన కొలువై ఉన్న మణికేశ్వర దేవాలయం… ఇంకా… పదిల మహాదేవ్‌, శృంగవేర్పూర్‌, లలితా దేవీ ఆలయం, లక్షగృహ, అలోపీ దేవాలయం, తక్షకేశ్వరనాథ్‌, సముద్రకూప్‌, సోమేశ్వరాలయం, శీత్లా టెంపుల్‌, కళ్యాణీ దేవి, ప్రభాస్‌ గిరి, శివకుటి మొదలైన అనేక దేవాలయాలను, ఆధ్యాత్మిక విహార కేంద్రాలను సందర్శించుకోవచ్చు.

ఉజ్జయినీ
ujjainaద్వాదశ జ్యోతిర్లింగాలలో పేరుగాంచిన పుణ్యక్షేత్రం… మరో కుంభమేళా మహోత్సవం కేంద్రం ఉజ్జయినీ. మహాకాళేశ్వరుడు ఇక్కడి ప్రధాన దైవం. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం… క్షప్రా నదీ తీరాన ఉన్నది. ఇక్కడి చివరిసారిగా 2004లో కుంభమేళా జరిగింది. ఉజ్జయిని అందరూ చుడతగ్గ శైవపుణ్యక్షేత్రం. మొత్తం 12 జ్యోతిర్లింగాలులో రెండు జ్యోతిర్లింగాలు మధ్యప్రదేశ్‌ లోనే ఉన్నాయి, ఒక జ్యోతిర్లింగం ఉజ్జయని లో మహాకాళేశ్వర్‌ గాను మరొక జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్లో ఓంకారేశ్వర్‌ గాను వెలిశాయి. పూర్వం ఉజ్జయిని నగరాన్ని అంధకాసురుడనే రాక్షసుడు పరిపా లించేవాడు. అతనికి ఒక ప్రత్యేక మైన వరం ఒకటి ఉంది. అది ఏమి టంటే యుద్ధరంగంలో నేలకు తాకిన అతని ప్రతి రక్తపుచుక్క నుండి అంతటి శక్తివంతమైన ఒక రాక్షసుడు పుడతాడు. మహకాళేశ్వరుడు దేవతల ప్రార్ధన మీరకు అతనితో యుధ్ధం చేస్తాడు.

మహావినాయకుడు /స్థిరమన్‌ గణేష్‌ అత నిని అదుపు చేస్తాడు. అప్పుడు శివుడు అంధకాసురుని హృద యమును త్రిశూ లంతో ఛేదిస్తాడు. అప్పుడు చాలామంది అంధకాసురులు పుడతారు. అప్పుడు మహకాళి ఆవిర్భవించి ఆ అంధకాసురుని రక్తాన్ని అంతా తాగివేస్తుంది. ఆ తరువాత శివుడు అంధకాసురుని త్రిశూలంతో పైకిఎత్తి తన మూడో కన్నుతో దహిస్తాడు. చివరకి అంధకాసురుడు తన ఓటమిని ఒప్పుకొని శివుని ప్రార్ధిస్తా డు. దానికి సంతోషించిన శివుడు అతనిని క్షమించి భృంగిగా మార్చి గణాధ్యక్ష పదవిని ఇస్తాడు.

ఉజ్జయిని మహాకాళి గఢకాళి / గఢకాళిక: ప్రాంతీయ నామము అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం. సతీదేవి పైపెదవి ఈ ప్రాంతంలో పడింది. ఈమె మహాకాళేశ్వరుని శక్తి. ఈమె మహాకవి కాళిదాసు యొక్క ఆరాధ్యదేవత. అమ్మవారి గుడి ఉజ్జియిని ఊరికి ఉత్తరాన భైరవ్‌ గడ్‌/భేరుగడ్‌ అనే ప్రాంతంలో క్షిప్రా నది తీరాన చిన్నగుట్ట మీద ఉంది. ఈ ప్రాంతాన్ని పూర్వం రత్నాచలం లేదా భైరవ పర్వతం అని పిలిచేవారు.
మహాకాళి దేవాలయం: గర్భగుడిలో అమ్మవారి విగ్రహానికి ఇరునైపులా మహాలక్ష్మి మరియు సరస్వతి విగ్రహాలు ఉన్నాయి. హనుమత్కేశ్వర్‌ అనే శివలింగం అమ్మవారి గుడి లో ఉంది. అమ్మవారి గుడి వెనుక భాగాన స్థిరమన్‌ గణేష్‌ గుడి కలదు. స్థిరమన్‌ గణేష్‌ గుడిలో సింహేశ్వర్‌ శివలింగం ఉంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top