You Are Here: Home » సినిమా » పాటలు » దడ (2011)- దీవాలీ దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని

దడ (2011)- దీవాలీ దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని

సాకీ : చక్కెర చిన్నోడా… (ఆలే)
కత్తెర కళ్లోడా… (ఆలే)
చూడర బుల్లోడా… (ఆలే) అందాన్ని
ఒంటరి పిల్లోడా… (ఆలే)
తుంటరి పిల్లోడా… (ఆలే)
వద్దకు లాగెయ్‌రా (ఆలే)… వజ్రాన్ని

పల్లవి : దీవాలీ దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని
నీ క ళ్లలోన ఆకళ్లు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని
తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని

ఊరించే నిషాని ఊపిరిపోసే విషాన్ని
నెత్తురు లోతుకు
హత్తుకుపోయిన స్నేహాన్ని
అత్తరు పూసిన బాణాన్ని
అల్లాడిస్తా ప్రాణాన్ని
అల్లుకుపోరా కాముడు
రాసిన గ్రంథాన్ని ॥
చరణం : 1

కదిలే నావలా వయసే ఊయల
ఎద టే నువ్వలా గిచ్చే కన్నై చూస్తుంటే
నిజమా ఈ కల అనిపించేంతలా
మనసే గువ్వలా గాల్లో తేలిందే
నీ పక్క చోటిస్తే
నన్నే నా నుంచి దోచిస్తా
నాకే నీలోన చోటిస్తే నన్నే దాచేస్తా
నీ గూడు నాకిస్తే
ఇందా నా గుండె నీకిస్తా
నీతో వెయ్యేళ్లు రానిస్తే నన్నే రాసిస్తా

చరణం : 2

ఒకడే వేయిగా కదిలే మాయగా
కనిపించావుగా అటూ ఇటూ
నా చుట్టూ
సలసల హాయిగా సరసున రాయిగా
కదిలించావుగా ప్రాయం పొంగేట్టు
పొందుకు వస్తావో
నాతో పొత్తుకు వస్తావో
ఎటో ఎత్తుకు పోతావో
అంతా నీ ఇష్టం
ఉప్పెన తెస్తావో
నొప్పిని ఉప్ఫనిపిస్తావో
తప్పని తప్పును చేస్తావో
అందం నీ సొంతం ॥

చిత్రం : దడ (2011)
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : ఆండ్రియా, కళ్యాణ్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top