You Are Here: Home » ఇతర » తేనెతో అందం

తేనెతో అందం

ప్రకృతి సిద్ధంగా దొరికే తేనెతో ఉపయోగాలు ఎన్నో. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా తేనె వినియోగిస్తారు. వైద్యులు, బ్యూటీషియన్లు తేనె ఎక్కువగా వాడుతుంటారు. తేనెతో ఫేషియల్స్‌ ఎలా చేసుకోవాలో, జుట్టు నిగారింపుకు ఎలా వాడాలో చిట్కాలు తెలుసుకుందాం…

honeyతేనెను నిమ్మరసంతో కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. కొద్దిసేపు ఉంచిన తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతం కావడంతో పాటు మొటిమలు తగ్గుతాయి. ఓ కప్పు తేనెను జుట్టు కుదుళ్ల నుంచి మొత్తం రాసుకుని గంటసేపు ఆరిన తరువాత కుంకుడు కాయ రసంతో స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు మెరుస్తూ ఉంటుంది. తలస్నానం చేసిన తరువాత తేనె, ఆలివ్‌ ఆయిల్‌ కలిపి జుట్టుకు మర్థన చేయాలి. కొద్దిసేపు ఆరిన తరువాత కడిగితే కురులు నల్లగా దట్టంగా నిగారింపు సంతరించుకుంటాయి. తేనె, పంచదార కలిపి ముఖానికి రాసుకుంటే మృతకణాలు పోయి ప్రకాశవంతంగా తయారవుతుంది. నారింజ రసం, తేనె కలిపి చర్మానికి రాసుకుంటే నిగారింపు వస్తుంది. తేనె, పాల మీగడ, శనగపిండి కొద్దిగా నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలపాలి. తరువాత కొద్దిసేపు సన్నని సెగపై ఉడికించి చల్లరాక చర్మంపై పూయాలి. ఆరిన అనంతరం చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారకుండా మృదువుగా తయారవుతుంది.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top