You Are Here: Home » చిన్నారి » తెల్ల చీమలు ఉన్నాయా?

తెల్ల చీమలు ఉన్నాయా?

చీమల్లో నల్లవి, ఎరవ్రి ఉంటాయని మనకు తెలుసు. కానీ తెల్ల చీమలు కూడా ఉంటాయా! మన ఇళ్లలో పుస్తకాల్ని, తలుపు ద్వారాలను తినే తెల్లటి పురుగుల్ని చూసే ఉంటారు. అవి చెద పురుగులు. ఈ చెద పురుగులను తెల్లచీమలు (వైట్ ఆంట్స్) అని కూడా అంటారు. అయితే ఈ చెద పురుగులు నిజానికి చీమలు కావు.

కలపకు హాని చేసే, ఉష్ణ ప్రాంతంలో కన్పించే ఒక రకమైన కీటకాలు చీమల మాదిరిగానే ఈ చెద పురుగులు కూడ సమూహాలుగా నివసిస్తూ ఉంటాయి. వాటి పనిని విభజించుకుంటాయి. పిల్లల సంరక్షణను కూడా సామూహికంగా నిర్వహిస్తాయి. ఇవి ఆహారాన్ని ఒంటరిగా అన్వేషించలేవు. ఆహారం ఎక్కడ ఉందన్న విషయాన్ని గుంపులుగానే గ్రహించగలుగుతాయి.

ఒక చెదల సమూహంలో నింఫ్స్ (పూర్తిగా ఎదగని చెదపిల్లలు), పని చేసే చెదపురుగులు, సైనికులుగా వ్యవహారించే చెదపురుగులు ఉంటాయి. వీటితో పాటు పునరుత్పత్తి కోసం కొన్ని ఆడ మగ చెదపురుగులు ప్రత్యేకంగా ఉంటాయి. వీటిలో గుడ్లు పెట్టే రాణి చెద పురుగులు కూడా ఉంటాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top