You Are Here: Home » సఖి (Page 61)

సఖి

అవాంఛిత రోమాలు పోవాలంటే…

అవాంఛిత రోమాలు పోవాలంటే... కోడిగుడ్డుసొన, పంచదార, మొక్కజొన్న పిండిని బాగా కలిపి వెంట్రుకలు ఉన్నచోట రాసి ఎండిపోయాక మెల్లగా తీసేయాలి. ఇలా మూడు సార్లు చేస్తే నొప్పి లేకుండా వెంట్రుకలు తొలగిపోతాయి. ...

Read more

కమిలిన చర్మానికి…

కమిలిన చర్మానికి... ఎండల వల్ల కమిలిన చర్మానికి వెంటనే ఉపశమనం కలగాలంటే... మార్కెట్లో దొరికే క్యాలమైన్ లోషన్‌ని దట్టంగా రాసుకొని ఎండిన తరవాత చల్లటి నీటితో కడుక్కోవాలి. బంగాళదుంప తురుముని సన్నటి బట్టలో చుట్టి రసాన్ని పిండాలి. ఆ రసాన్ని కమిలిన చర్మం పై పూసుకోవాలి. ...

Read more

క్యారెట్ ఫేస్ ప్యాక్ …

క్యారెట్ ఫేస్ ప్యాక్ ... ముందుగా క్యారట్ ముక్కల్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులో రెండు టీ స్పూన్ల పచ్చిపాలు, రెండు టీ స్పూన్ల ఓట్స్ పొడి, అయిదారు చుక్కల తేనె వేసి అన్నిటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ ప్యాక్‌ని సమయం దొరికినప్పుడల్లా వేసుకుంటే ముఖంపైన ఉన్న జిడ్డు తగ్గి చర్మం కాంతివంతంగా ఉంటుంది. ...

Read more

చలికాలంలో చర్మం పొడిబారకుండా…

చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే... రాత్రి పడుకోబోయే ముందు టీ స్పూన్ బాదమ్ నూనెలో చిటికెడు చందనం పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అయిదారు నిమిషాలు మసాజ్ చేసి ఉదయానే గోరు వెచ్చని నీటితో కడిగి మెత్తని టవల్‌తో తుడవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి. ...

Read more

చర్మం ఎండకు వడలిపోయి త్వరగా ముడతలు…

చర్మం ఎండకు వడలిపోయి త్వరగా ముడతలు పడుతుంది. అవి పోవాలంటే... టొమాటోను గుజ్జులా చేసి, అంతే మోతాదులో మీగడ పాలను కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే ముడతలు తగ్గి చర్మం కాంతిమంతమవుతుంది. ఈ మిశ్రమాన్ని ఎక్కువగా తయారు చేసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుని నాలుగైదు రోజుల పాటు వాడుకోవచ్చు. ఎండకాలంలో జుట్టు త్వరగా నిర్జీవంగా మారుతుంది. కాబట్టి గోరువెచ్చని కొబ ...

Read more

బనానా మాస్క్

బనానా మాస్క్ముందుగా పండిన అరటిపండుని మెత్తగా పేస్ట్ చేసి అందులో రెండు టీ స్పూన్ల పచ్చిపాలు, రెండు టీ స్పూన్ల తేనె, రెండు టీ స్పూన్ల ఓట్స్ పౌడర్ వేసి అన్నిటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా సమయం దొరికినప్పుడల్లా చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది. ...

Read more

మొటిమలు తగ్గాలంటే…

మొటిమలు తగ్గాలంటే... నానబెట్టిన రెండు బాదం పప్పుల పేస్ట్‌లో గుడ్డులోని తెల్ల సొన రెండు టీ స్పూన్లు, అయిదారు టీ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలున్న చోట అప్లై చేసి 10-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top