You Are Here: Home » సఖి (Page 4)

సఖి

గుడ్డులోని పచ్చసొన, తెల్లసొన, అర…

గుడ్డులోని పచ్చసొన, తెల్లసొన, అర కప్పు ఉడికించిన ఓట్స్, టేబుల్ స్పూన్ బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు, వీపుకు ప్యాక్‌లా వేసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. సున్నితమైన చర్మం గల వారికి ఇది మేలైన ప్యాక్. ...

Read more

అరటిపండు గుజ్జు, ఉడికించిన ఓట్స్ అర…

అరటిపండు గుజ్జు, ఉడికించిన ఓట్స్ అర కప్పు, గుడ్డులోని పచ్చ సొన, టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, శరీరానికి పట్టించి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడి చర్మం గల వారికి ఇది మేలైన ప్యాక్. ...

Read more

ఉడికించిన ఓట్స్ అర కప్పు, గుడ్డులోని…

ఉడికించిన ఓట్స్ అర కప్పు, గుడ్డులోని తెల్ల సొన, అరకప్పు ఆపిల్ గుజ్జు, టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ముఖానికి, శరీరానికి పట్టించి పది నిముషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. జిడ్డు చరం్మగల వారికి ఇది మేలైన ప్యాక్. ...

Read more

అవకాడో గుజ్జు టీ స్పూన్, గుడ్డులోని…

అవకాడో గుజ్జు టీ స్పూన్, గుడ్డులోని తెల్లసొన, అర టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మకాంతి పెరుగుతుంది. ...

Read more

అవకాడో గుజ్జు, దోస గుజ్జు, తేనె,…

అవకాడో గుజ్జు, దోస గుజ్జు, తేనె, పెరుగు సమపాళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పదిహేను నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ముఖ చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మారుస్తుంది. ...

Read more

రెండు టేబుల్ స్పూన్ల…

రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌లో రెండు టీ స్పూన్ల బాదం నూనె, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. పిండి జారుగా అవడానికి కొద్దిగా రోజ్‌వాటర్‌ని ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకొని, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. ...

Read more

పెరుగు, నారింజ రసం సమపాళ్లలో కలపాలి.

పెరుగు, నారింజ రసం సమపాళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు, పాదాలకు పట్టించి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇది సహజసిద్ధమైన బ్లీచ్‌లా పనిచేస్తుంది. ప్రతి రోజూ ఇలా చేస్తుంటే మలినాలు తొలగిపోయి చర్మం కాంతివంతం అవుతుంది. ...

Read more

కప్పు మరిగే నీటిలో టీ స్పూన్ సోంపు…

కప్పు మరిగే నీటిలో టీ స్పూన్ సోంపు వేసి మూతపెట్టాలి. చల్లారిన తర్వాత వడకట్టి ఆ నీటిని ముఖానికి, ఒంటికి రాసుకోవాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీనివల్ల మలినాలు తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది. ...

Read more

బ్రష్ చేసుకోవడానికి ముందు…

బ్రష్ చేసుకోవడానికి ముందు లవంగనూనెను వేలికి అద్దుకొని, దంతాలను, చిగుళ్లను మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల దంతాల మీద మరకలు పోయి, మెరుస్తాయి. ...

Read more

కప్పు పెరుగులో, పావు కప్పు పెసరపిండి,…

కప్పు పెరుగులో, పావు కప్పు పెసరపిండి, గుడ్డులోని తెల్లసొన కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు, మాడుకు, శిరోజాలకు పట్టించాలి. పావుగంట తర్వాత తలస్నానం చేయాలి. ప్రతి మూడు రోజులకోసారి ఇలా నెలరోజుల పాటు చేస్తే చుండ్రు, జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది. శిరోజాలు మృదువుగా తయారవుతాయి. ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top