You Are Here: Home » సఖి » అందం (Page 9)

ఆడవారి అందం కోసం చిట్కాలు..

ఓట్స్‌పొడి, బంకమట్టి టీ స్పూన్…

ఓట్స్‌పొడి, బంకమట్టి టీ స్పూన్ చొప్పున తీసుకొని, దాంట్లో బాదంపప్పు, గులాబీ రేకుల పొడి, పెరుగు అర టీ స్పూన్ చొప్పున కలపాలి. అందులో ఎసెన్షియల్ ఆయిల్, నిమ్మరసం పది చుక్కలు వేసి, కొద్దిగా నీరు జతచేర్చి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచు కోవాలి. ముఖం కాంతివంతంగా తయారవుతంది. ...

Read more

కప్పు గోరువెచ్చని నీటిలో టీ స్పూన్…

కప్పు గోరువెచ్చని నీటిలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ నీటిని తలమీదుగా జుట్టంతా తడిసేలా పోసుకోవాలి. మళ్లీ నీటితో శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే శిరోజాలు నిగనిగలాడుతాయి. ...

Read more

టొమాటోను బ్లెండ్ చేసి, అందులో…

టొమాటోను బ్లెండ్ చేసి, అందులో టేబుల్‌స్పూన్ పాలు కలపాలి. దూదితో ఈ మిశ్రమాన్ని అద్దుకుంటూ ముఖానికి, మెడకు, చేతులకు రాయాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. రెండు రోజులకోసారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మం బిగుతుగా మారి, ముడతలు తగ్గుతాయి. ...

Read more

సగం ఆపిల్ ముక్కను ఉడికించి గుజ్జు…

సగం ఆపిల్ ముక్కను ఉడికించి గుజ్జు చేయాలి, అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పదినిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి, తీసి, ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి.ఈ ప్యాక్ చర్మకాంతిని మెరుగుపరుస్తుంది. ...

Read more

అరటిపండు గుజ్జులో కొద్దిగా ఆలివ్…

అరటిపండు గుజ్జులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి మాడుకు, శిరోజాలకు పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల శిరోజాలు మృదువుగా తయారవుతాయి. ...

Read more

క్యారట్‌ను ఉడికించి గుజ్జు చేయాలి….

క్యారట్‌ను ఉడికించి గుజ్జు చేయాలి. తేనె, క్యారట్ గుజ్జు మూడు టీ స్పూన్ల చొప్పున తీసుకొని, పావుకప్పు పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, శరీరానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. ...

Read more

టేబుల్‌స్పూన్ తేనెలో అర టీ స్పూన్…

టేబుల్‌స్పూన్ తేనెలో అర టీ స్పూన్ ఆరెంజ్ జ్యూస్, టేబుల్ స్పూన్ ముల్తానీమట్టి, టేబుల్‌స్పూన్ రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకొని, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డు చర్మంగల వారికి ఇది మేలైన ప్యాక్. ...

Read more

పెరుగులో రెండు టీ స్పూన్ల పెసరపిండి…

పెరుగులో రెండు టీ స్పూన్ల పెసరపిండి కలపాలి. మాడుకు, జుట్టుకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. పెరుగు శిరోజాలకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. పెసరపిండి చుండ్రును నివారిస్తుంది. ...

Read more

బీట్‌రూట్‌ను గుజ్జులా చేసి,నీళ్లలో…

బీట్‌రూట్‌ను గుజ్జులా చేసి,నీళ్లలో వేసి మరిగించాలి. ఆ నీటిని వడకట్టి, చల్లారిన తర్వాత తలకు, కేశాలకు పట్టించాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ...

Read more

టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, పావు టీ స్పూన్…

టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, పావు టీ స్పూన్ అలొవెరా జెలా, విటమిన్ ‘ఇ’, ‘ఎ’ లిక్విడ్ క్యాప్సుల్ తీసుకొని, కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ట్రెచ్ మార్క్స్ పడిన చోట రోజూ రాస్తూ ఉండాలి. కొన్ని రోజులకు చర్మం సాగడం వల్ల అయిన మచ్చలు తగ్గిపోతాయి. ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top