You Are Here: Home » సఖి » అందం (Page 11)

ఆడవారి అందం కోసం చిట్కాలు..

పుచ్చకాయ ముక్కలు కప్పు, రెండు టేబుల్…

పుచ్చకాయ ముక్కలు కప్పు, రెండు టేబుల్ స్పూన్ల నీరు కలిపి బ్లెండ్ చేయాలి. తర్వాత వడకట్టుకోవాలి. దూదిని ఈ రసంలో ముంచి ముఖంతా రాసుకొని ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. మేకప్ చేసుకోవడానికి ముందు పుచ్చకాయ రసం రాసుకుంటే చర్మానికి మంచి క్లెన్సింగ్‌లా ఉపయోపడుతుంది. ముఖం ఎక్కువ సేపు తాజాగా కనిపిస్తుంది. ...

Read more

రెండు టేబుల్ స్పూన్ల పంచదార, మూడు…

రెండు టేబుల్ స్పూన్ల పంచదార, మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు తీసుకొని కలపాలి. పంచదార కరిగాక వడగట్టుకోవాలి. ఈ నీటిని వేళ్లతో అద్దుకుంటూ ముఖానికి, మెడకు, భుజాలకు రాసుకొని, ఐదు నిమిషాలు వృత్తాకారంలో మసాజ్ చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా అవుతుంది. ...

Read more

రాత్రి పడుకునే ముందు ఆముదం, కొబ్బరి…

రాత్రి పడుకునే ముందు ఆముదం, కొబ్బరి నూనె కలిపి కళ్లచుట్టూ రాసి సున్నితంగా ఐదు నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తుంటే రక్తప్రసరణ మెరుగై కళ్లకింద నల్లని వలయాలు తగ్గుతాయి. ...

Read more

పసుపులో ఆరెంజ్ జ్యూస్ కలిపి పేస్ట్…

పసుపులో ఆరెంజ్ జ్యూస్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని మృదువుగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. మృతకణాలు, మురికి తొలగిపోయి చర్మకాంతి పెరుగుతుంది. మొటిమలు, మచ్చల నివారణకు కూడా ఇది మేలైన ప్యాక్. ...

Read more

సగం అరటిపండు గుజ్జు, టీ స్పూన్ తేనె,…

సగం అరటిపండు గుజ్జు, టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ జొజోబా ఆయిల్, టీ స్పూన్ పెరుగు, గుడ్డులోని తెల్లసొన... ఇవన్నీ ఒక పాత్రలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, భుజాలకు రాసుకొని, పది నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడి చర్మం మృదువుగా మారుతుంది. ...

Read more

అరకప్పు గులాబీ రేకలను పేస్ట్ చేసి…

అరకప్పు గులాబీ రేకలను పేస్ట్ చేసి అందులో టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు కలపాలి. ఈ పేస్ట్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి స్నానం చేయాలి. గులాబీల సుగంధం ఒత్తిడి నుంచి త్వరగా ఉపశమనం పొందేలా చేస్తుంది. కొబ్బరిపాలు చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌ని ఇస్తాయి. ...

Read more

సగం అరటిపండు గుజ్జు, టీ స్పూన్ తేనె,…

సగం అరటిపండు గుజ్జు, టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ జొజోబా ఆయిల్, టీ స్పూన్ పెరుగు, గుడ్డులోని తెల్లసొన... ఇవన్నీ ఒక పాత్రలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, భుజాలకు రాసుకొని, పది నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడి చర్మం మృదువుగా మారుతుంది. ...

Read more

రెండు, మూడు బాదంపప్పులను గ్రైండ్…

రెండు, మూడు బాదంపప్పులను గ్రైండ్ చేసి అందులో పాలు, ఆలివ్ ఆయిల్ కొద్దిగా కలిపి పేస్ట్ చేయాలి. ఇందులో ఆరెంజ్ పీల్ తురుము కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పదిహేను నిమిషాలు వదిలేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకొని, ఐస్ క్యూబ్‌తో ముఖమంతా రబ్ చేయాలి. నిస్తేజంగా ఉన్న చర్మం కాంతివంతం అవుతుంది. ...

Read more

రెండు బాదం పప్పులు నానిన తర్వాత …

రెండు బాదం పప్పులు నానిన తర్వాత నీళ్లు కలిపి పేస్ట్ చేసి నిమ్మరసం, అర టీ స్పూన్ పంచదార కలిపి ముఖానికి రాసి మసాజ్ చేయాలి. తర్వాత పెసరపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ...

Read more

ఆపిల్ గుజ్జులో గోధుమ పొట్టు కలిపి…

ఆపిల్ గుజ్జులో గోధుమ పొట్టు కలిపి పేస్ట్ చేయాలి. ముఖానికి, చేతులకు ఈ మిశ్రమాన్ని పట్టించి స్క్రబ్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది ఈ స్క్రబ్. ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top