You Are Here: Home » సఖి » అందం (Page 10)

ఆడవారి అందం కోసం చిట్కాలు..

సీజన్ మారుతున్నప్పుడు పెదవులు…

సీజన్ మారుతున్నప్పుడు పెదవులు త్వరగా పొడిబారడం, పగుళ్లు వచ్చి నొప్పిగా అనిపిస్తుంటాయి. వెన్నలో గులాబీ రేకల పేస్ట్ కలిపి రాత్రి పడుకునే ముందు పెదవులకు రాసుకోవాలి. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే పెదవులు మృదువుగా తయారవుతాయి. ...

Read more

ఆభరణాలు ధరించడం,నూనె జిడ్డు,…

ఆభరణాలు ధరించడం,నూనె జిడ్డు, కాలుష్యం వల్ల మెడ నలుపుగా మారుతుంది. పసుపులో నిమ్మరసం కలిపి మెడకు ప్యాక్ వేసి, ఆరిన తర్వాత మెల్లగా రుద్దుతూ, శుభ్రపరుచుకుంటే మెడ నలుపు తగ్గుతుంది. ...

Read more

ఎర్ర కందిపప్పు, బియ్యం పిండి,…

ఎర్ర కందిపప్పు, బియ్యం పిండి, రోజ్‌వాటర్ సమపాళ్లలో కలపాలి. అందులో చిటికెడు పసుపు కలిపి ముఖానికి, రాసుకొని ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ చర్మకాంతిని పెంచుతుంది. ...

Read more

కప్పు పెరుగులో టేబుల్ స్పూన్ ఆరెంజ్…

కప్పు పెరుగులో టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్, టేబుల్ స్పూన్ నిమ్మరసం క లపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాలు వదిలేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మకాంతి పెరుగుతుంది. ...

Read more

యూకలిప్టస్ నూనె, జొజోబా నూనె…

యూకలిప్టస్ నూనె, జొజోబా నూనె సమపాళ్లలో కలిపి గోళ్లకు రాయాలి. తర్వాత ఐదు నిమిషాలు గోళ్లను మసాజ్ చేసుకోవాలి. రోజూ రాత్రి పడుకునేముందు ఇలా చేస్తూ ఉంటే గోళ్లు విరిగిపోవడం, పెలుసుగా మారడం, నిస్తేజంగా కనపడటం వంటి సమస్యలు త గ్గుతాయి. గోళ్ల అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి. ...

Read more

అరకప్పు ఆపిల్ సైడర్ వెనిగర్‌ను…

అరకప్పు ఆపిల్ సైడర్ వెనిగర్‌ను కప్పు నీళ్లలో కలపాలి. తలస్నానం చేసిన తర్వాత ఈ వెనిగర్ నీటితో తలంతా తడపాలి. పొడిబారిన కేశాలు మృదువుగా అవుతాయి. చుండ్రు తగ్గుతుంది. ...

Read more

గుమ్మడికాయ, బొప్పాయి గుజ్జు…

గుమ్మడికాయ, బొప్పాయి గుజ్జు సమపాళ్లలో తీసుకోవాలి. అందులో గుడ్డు సొనను కలపాలి. వేళ్లతో ఈ మిశ్రమాన్ని అద్దుకుంటూ ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇది మలినాలను శుభ్రపరచడమే కాకుండా, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ...

Read more

నూనె, నిమ్మరసం, రోజ్‌వాటర్, గ్లిజరిన్…

నూనె, నిమ్మరసం, రోజ్‌వాటర్, గ్లిజరిన్ సమపాళ్లలో తీసుకొని అందులో గుడ్డులోని పచ్చసొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు పట్టించి ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. తడిలేకుండా తుడుచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేస్తే గరుకుగా మారిన చర్మం మృదువుగా తయారవుతుంది. ...

Read more

రెండు ద్రాక్ష పండ్లను తీసుకొని…

రెండు ద్రాక్ష పండ్లను తీసుకొని సగానికి కోయాలి. ఆ ముక్కలతో ముఖం, మెడ, భుజాలను రబ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇది మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఎండవేడి నుంచి ఉపశమనం లభించడమే కాదు, రక్తప్రసరణ మెరుగై, చర్మకాంతి పెరుగుతుంది. ...

Read more

పచ్చిపాలు, అలొవెరా జెల్, తేనె టీ…

పచ్చిపాలు, అలొవెరా జెల్, తేనె టీ స్పూన్ చొప్పున తీసుకొని, అందులో ఎసెన్షియల్ ఆయిల్ రెండు చుక్కలు కలపాలి. ముఖాన్ని చల్లని నీటితో శుభ్రపరుచుకొని, తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత పాల మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని ముఖానికి రాసుకుంటూ మసాజ్ చేసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మకాంతి పెరుగుతుంది. ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top