You Are Here: Home » యాత్ర » దర్శనీయ ప్రదేశాలు (Page 14)

దర్శనీయ ప్రదేశాలు

ప్రకృతి సోయగాల నెలవు… పేరుపాలెం బీచ్‌

మన రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరు మండలానికి చెం దిన గ్రామము పేరుపాలెం. ఈ గ్రామం ఒక సుందరమైన పర్యాటక ప్రదేశమని చెప్పుకో వచ్చు. ఎందుకంటే, ఇక్కడ మనోహరమైన, సువిశాలమైన సాగరతీరం కలదు. ఈ పేరుపాలెం బీచ్‌ ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు.పేరుపాలెం సాగర తీరంలో హిందువుల ఆరాధ్య దెైవం శ్రీ వేంకటేశ్వరుని పుణ్యక్షే త్రం, వేళాంగణి మాత ఆలయాలు ప్రసిద్ధమై నవి. ప్రతి కార్తీక మాసంలో ఇక్కడ వనభోజ నాలు ఘనంగా జరుగుతాయ ...

Read more

మైమరిపించే మాంగ్రోవ్‌ అందాల దీవి.. పిచ్చావరం

సముద్రంలోకి వెళ్లేముందు చుట్టూ చెట్ల మధ్య ఉండే కాలువల్లో కాసేపు విహరిస్తే...! అన్న ఊహే మనల్ని ఒక్కసారిగా ఆనంద తీరాలకి తీసుకెళ్లక మానదు. మరి అలాంటి ప్రాంతం ఈ భూప్రపంచంలో నిజంగా ఉంటే, రెక్కలు కట్టుకుని వాలిపోతాం కదూ..? అయితే వెంటనే చిదంబరం అనే ఊరికి చేరుకోవాల్సిందే..!ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన మాంగ్రోవ్‌ చెట్ల (వీటినే తెలుగులో సముద్రపు ఉప్పునీటి వాతావరణంలో పెరిగే నీటి చెట్లు, మడ చెట్టు, నల్లమడ చెట్లు అని ...

Read more

ఇవి ప్రపంచంలోనే అందమైన… సుందర తీరాలు

సాయం సంధ్య వేళల్లో అస్తమించే సూర్యుడిని చూస్తూ... పట్టుకుంటే సుతారంగా జారిపోయే సముద్రపు ఇసుకతో ఆడుకుంటూ... కడలి అందాలను కళ్లతో జుర్రుకుంటూ... అమాంతం చిన్నపిల్లలైపోవాలని ప్రతి ఒక్కరూ అనుకోవటం తప్పుకాదు. ఎందుకంటే, ఈ అనుభూతి చిన్నా, పెద్దా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుేక కుటుంబంతో కలిసి ఆనందంగా విహరించే స్థలాల్లో సముద్ర తీరాలకు చాలామంది మెుదటి స్థానాన్నిస్తుంటారు. ఓ ప్రపంచ ప్రముఖ ట్రావెల్‌ ఏజెన్సీ... ప్రపంచంలోన ...

Read more

పులుల రాజధాని… సరిస్కా జాతీయ పార్క్‌

ఢిల్లీ నుంచి మూడు గంటలు ప్రయాణిస్తే రాజస్థాన్‌ రాష్ట్రంలోని అరవాలీ కొండ ప్రాంతం వస్తుంది. దాదాపు 800 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులకు కొదవలేదు. రకరకాల అటవీ జంతువులు ఇక్కడ ఉన్నాయి. భారత దేశంలో పేరు పోయిన వన్య మృగాల ప్రాంతాలలో ఇది ఒకటి.ఇది నిజంగా చూడదగిన ప్రాంతం. ఇక్కడున్న పులులు, జంతు వృక్షజాలం అహ్లాదకరంగా ఉంటుంది. పులులు, చిరుతులు, జింకలు, మొసళ్లు ఇందులో ఉన్నాయి. ఇక్కడ ఉండే జంత ...

Read more

జైన దేవాలయం… కొలనుపాక

దేశంలో జైన దేవాలయాలకు ప్రముఖమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నా మన రాష్ట్రంలోనూ ఓ ప్రముఖమైన జైన దేవాలయం ఉంది. నల్గొండ జిల్లాలోని కొలనుపాక ప్రముఖ జైన దేవాలయంగా గత కొన్నేళ్లుగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. దాదాపు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రదేశం కొత్త రూపం సంతరించుకోవడంతో పర్యాటకులను విశేషంగా ఆకర్షించడంతోపాటు నేడు ప్రముఖ పర్యాటక క్షేత్రంగా విలసిల్లుతోంది. దాదాపు వందేళ్ల క్రితం కనుగొనబడిన కొలునుపాక జైన దేవాలయం ప్రస్తుతం ...

Read more

కనువిందు చేసే సముద్రతీరం… వర్కల

వేసవి సెలవులను ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఎంజాయ్‌ చేస్తుంటారు. కొంత మంది కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉబలాటపడితే... ఎప్పుడూ బిజీగా పనిచేయటమేనా, సెలవుల్లోనయినా కాస్తంత విశ్రాంతిగా గడుపుదామని మరికొంత మంది ఆలోచిస్తారు. ఇలా ఆలోచించేవారికి సరెైన హాలిడే స్పాట్‌ వర్కల సముద్ర తీరప్రాంతం.కేరళ రాష్ట్రంలోని కోవలంకు వచ్చే పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో... కొత్తగా ఈ వర్కల బీచ్‌ను కనుగొన్నారు. గత ఆరేడు సంవత్సరాల ...

Read more

మేఘాల(య)లో తేలిపోదామా..?!

పచ్చని చెట్లమధ్య తెల్లని మేఘాలు రాసి పోసినట్లుండే మేఘాలయకు వర్షాకాలంలో వెళ్లటం ఒక అందమైన అనుభూతి. రోడ్ల పక్కన ఉండే చెట్లు, దూరంగా కనిపించే కొండలమీద ఉన్న చెట్లు... ఇలా ప్రకృతి మొత్తం పచ్చని రంగుతో పెయింట్‌ వేసినట్లుగా ఉంటుందిక్కడ. ఇక వానాకాలంలో అయితే ఎటుచూసినా మేఘాల గుంపుతో మేఘాలకు ఆలయంగా, ప్రశాంతతకు చిహ్నంగా కనిపిస్తుంటుంది.భారతదేశపు ఈశాన్యప్రాంతంలో ఒక చిన్న రాష్టమ్రైన మేఘాలయ 300 కిలోమీటర్ల పొడవు, వంద కిలోమ ...

Read more

కాఫీ తోటల ఘుమఘుమల… సకలేష్‌ పూర్‌

అద్భుతమైన ఆకుపచ్చదనాన్ని కప్పుకున్న ఎత్తయిన కొండలు ఓ వెైపు, చిక్కటి కాఫీ తోటలు పరచుకున్న లోయలు మరోవెైపు... ఈ రెండింటి మధ్యలో ఉండే సన్నటి ఘాట్‌ రోడ్డుపెై మలుపులు తిరిగే ప్రయాణం... చదువుతుంటేనే మైమరిపించేదిగా ఉంది కదూ... ఇంత అందమైన ప్రాంతం పేరే సకలేష్‌ పూర్‌.కర్నాటకలోని హసన్‌కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుం దీ సకలేష్‌ పూర్‌. చిన్న ఊరే అయినప్పటికీ... కాఫీ, యాల కులు, మిరియాల తోటలతో, సకల సిరిసంపదలతో తులతూ గుతూ ఉంటు ...

Read more

అదరహో అనిపించే… డెడ్ సీ అందాలు

అనాదిగా మధ్యధరా సముద్రపు తీర ప్రాంతాల నుంచి అనేకమంది యాత్రికులను ఆకర్షిస్తున్న ఓ ఉప్పునీటి సరస్సునే మృత సముద్రం (డెడ్‌ సీ) అని వ్యవహరి స్తున్నారు. ఇది పశ్చిమాన ఇజ్రాయిల్‌, వెస్ట్‌ బ్యాంక్‌... తూర్పున జోర్డాన్‌ దేశాల మధ్య సముద్ర మట్టానికి 420 మీటర్ల దిగువన ఉంది. 380 మీటర్లు లోతు కలిగిన ఈ మృత సముద్రం... ప్రపంచంలోనే అత్యంత లోతైన ఉప్పునీటి సరస్సుగా పేరుగాంచింది. అంతేగాకుండా ఇది 33.7 శాతం లవణీయతతో ప్రపంచంలోనే అత ...

Read more

గమ్మత్తైన అందాల నెలవు…గ్యాంగ్‌టక్‌

అందమైన మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు, చూడముచ్చటైన కొండలు వీటితోపాటు సెలయేళ్లు, గడ్డిపూలు, పచ్చిక బయళ్లతో రారమ్మని స్వాగతం చెప్పే పర్యాటక ప్రాంతమే గ్యాంగ్‌టక్‌. మనసుకు ఎంతగానో హారుునిచ్చే ఈ ప్రదేశంలోని మంచు పర్వతాలు, తీస్తానది ఒంపులు తనివితీరా ఆస్వాదించాలంటే... అక్కడికి వెళ్లాల్సిందే మరి.సిక్కిం రాష్ట్ర రాజధాని నగరమే గ్యాంగ్‌టక్‌. ఇది కొండల నగరంగా పేరుగాంచింది. ఉత్తర, పశ్చిమ, తూర్పు అనే మూడు భాగాలుగా ఉంటు ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top