You Are Here: Home » చిన్నారి (Page 161)

చిన్నారి

డార్లింగ్‌

(గతవారం తరువాయి)ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యెంత పొంగి పులకించి పోయిందంటే... ఇద్దరూ ఎలా మంగిట్లోకి వెళ్ళింది, టీ తాగడానికి కూర్చున్నదీ ఆమెకి తెలియలేదు.‘‘ అబ్బ! ఎంత సంతోషంగా వుంది! ఎంత బెంగ పెట్టుకున్నాను! ఎందుకింత దయ చూపించావు’’ అని సంతోషంతో కంపిస్తూ మెల్లగా అంది.‘‘ఇక్కడే స్థిరపడదామనుకుంటున్నాను. రిజిస్ట్రేషన్‌ కోసం కాగితాలు పంపించేను. కొలువు బంధనాలు వదిలించుకుని మన అదృష్టం ఎలా వుంటుందో పరీక్షించాలనుకున్నాను ...

Read more

వివక్షా వ్యాకరణం

ఇన్నాళ్ళూ మాపేర్లేవివక్షకు మారు పేర్లనుకున్నాంాసత్యంగారు ఊళ్ళో ఉంటేఅబద్దంగాడు వాడలో ఉండడం చూస్తూనే ఉన్నాంఊళ్ళో అంతా ముత్యాలయ్యలు వరహాలయ్యలు జన్మిస్తుంటేవాడలో పుట్టిన ప్రతివాడుపెంటయ్య, తుక్కయ్య, గడ్డయ్యలుగామారిపోతున్న వైనాన్ని పసిగట్టాంప్రపంచంలో ఏ మనిషికీ లేని వింత పేర్లుమాకే ఎందుకున్నాయో ఆలోచించుకుంటున్నాంఒళ్ళు దగ్గర పెట్టుకునిమేమేంటో మేము నిరంతరం గుర్తుంచుకుంటూఆత్మన్యూనతతో అణిగి మణిగి ఉండడానికిమా నామవాచకాల ...

Read more

కొత్తపుస్తకం

శ్రీకృష్ణ కమిటీ ఏమంటోంది?సంక్షిప్త తెలుగు అనువాదంవెల: రూ. 125ప్రచురణకర్తలుఏజెండ్ల యాడ్స్‌ అండ్‌ ప్రింటర్స్‌ప్రతులకు విశాలాంధ్ర బుక్‌హౌస్‌లు పోరుగడ్డ3 కథలు, 7 వ్యాసాలుపెద్దింటి అశోక్‌ కుమార్‌ ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు పిట్టగూడుజానపద కథలుపుప్పాల కృష్ణమూర్తి వెల: రూ. 50ప్రతులకు అన్ని ప్రముఖపుస్తక కేంద్రాలు పుటల్లోకి సాహిత్య సమీక్షా వ్యాసాలురామా చంద్రమౌళివెల: రూ. 80ప్రతులకుఅన్ని ప్రముఖ పుస్తక కేంద్ ...

Read more

సైకిల్‌

సైకిల్‌ క్కూడా రెండు కాళ్ళే-మనిషిలాగే-కాకపోతే ఇవి గుండ్రంగా తిరుగుతాయిమనిషి దూరిపోయేంత ఇరుకిరుకు సందుల్లోనూఇది సర్దుకుపోగలదు తలనటూ ఇటూ తిప్పుతూ-విశ్రాంతి వేళ దీని నిల్చునే నిద్రకు గోడవారగా కొంచెం పొడుగాటి జాగా చాలుగదంత గ్యారేజీని కోరదిది ఇది నన్ను సుతారంగా మోస్తూ తీసుకెళ్తుంది దీనికి జబ్బు చేస్తే నేను మోసుకెళ్తానుకదలడానికి ఖరీదౌన ద్రవాలనేమీ అడగదుకాళ్ళల్లో సత్తువకై నిండెైన వాయు భోజనం చాలు చాలంటుందితడబడి ఎత్త ...

Read more

సెక్షన్‌ 143 (ప్రేమ ఖైది)

కాళ్ళకు సత్తువ కూడగట్టుకొని పరిగెడుతోంది లావణ్య. తను పరుగుదీస్తున్న దారి స్పష్టంగా లేకున్నా కూడా, ప్రాణ భయంతో వెనక్కి ముందుకి చూస్తూ... గొంతు క్రింద చమట దారల్ని ఓణితో తుడుచుకొంటూ... ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని పరుగు లఘిస్తోంది. దేహ దారుడ్యం గల నలుగురు మగాళ్ళు, లావణ్యను వెంబడిస్తున్నారు. వారి కళ్ళల్లో కసివుంది. లావణ్య దొరికితే చాలు ముక్కల క్రింద నరకాలన్నంత ఆవేశంతో వెంట పడ్డారు వాళ్ళు. వేట కొడవళ్ళు చేతిలో ప ...

Read more

బానిస

సగేసిన కళ్ళను మసి పూసి మారేడు కాయలా మార్చేయవచ్చును...ముసుగేసిన మొఖానికిబ్రాందీలను గాంధేయ వాదులుగా చూపించేయ వచ్చును...మనుషులు మనసులు పక్కన పెట్టినంత కాలం మరో ప్రపంచపు నగారా మరలా మ్రోగినా వినపడదు...మదమెక్కిన మనుజులు కర్పూర హారతి చుట్ట కాల్చుకోవడానికే అనుకుని అంధకారంలో బ్రతికేస్తారు...కాలం నిరుపయోగంగా, నిర్దాక్షిణ్యంగా కాల గర్భంలో కలిసి పోతోంది...ఒక్కడంటే ఒక్కడూ మారడం లేదు...ఇది అన్యాయమనీ- అధర్మమనీ...ఎలుగెత్తి ...

Read more

నీకవిని బతికించుకోవాలిరా!

నీ కవిని బతికించుకోవాలిరా!సంకలనంకందిమళ్ళ ప్రతాపరెడ్డివెల: రూ. 110ప్రతులకువిశాలాంధ్ర బుక్‌హౌస్‌లు‘సవాలన్న నెైజాముకు సమాధాన మెవ్వడురా?’ అన్న అనుమానమొచ్చినప్పుడు తెలంగాణ గెరిల్లాలు కదన భూమికురికినారు. ‘తెలంగాణ వీరులం తెగ నరికే కత్తులం’ అంటూ తర తరాలుగా బాంచనన్న పీల గొంతు- రణ గర్జన చేసింది. సమాధానం దొరికింది. తెలంగాణ విముక్తమయింది. స్వాతంత్య్ర సమర సందర్భాల్లో నడిచిన అన్ని దశల పోరాట సమయాల్లో ‘వీర గంధం తెచ్చినారము ...

Read more

భోషాణం పెట్టె

మిన్ను విరిగి మీద పడినా ఈ మనిషి చలిం చడు కదా.. ఆ పేపర్లో ఏముందో గానీ.. హె డ్డింగ్‌ నుండి చివరి దాకా చదివి తీరాలి. అస్స లు లోకజ్ఞానం లేని వాడికి ఈ గ్లోబల్‌ జ్ఞానం మాత్రం ఎందుకు. చూసేవాళ్లకు నా నోరే కని పిస్తుంది కానీ ఆయన చేసే పనులు కనబడవు. అటు ఇటు కూడా నేను గయ్యాళిని... నాదే గయ్యాళితనం. ఆయనేమో దేవుడు. శ్రీరామ చంద్రుడు. నా గోడు ఏ గోడకో చెప్పుకోవడమే తప్ప మొగుడికి చెప్పుకునే యోగం నాకీ జన్మ కి ఉన్నట్లు లేదు. పేప ...

Read more

బాధ

నా బాధ ఎవరికి చెప్పుకోను?సాయం సంధ్య. వీధి దీపాలు వెలిగాయి. చెమ్మ మంచుతరకలు వాటి మీద పడుతున్నాయి. ఇళ్ళ కప్పుల మీద, గుర్రాల వీపుల మీద, మనుషుల భుజాల మీద, టోపీల మీద పడుతున్నాయి. పల్చని పొరలు పేరుకుంటున్నాయి. బండి మీదా, బండి తోలే ఆయోనాపోతాపోవ్‌ మీదా మంచు పడింది. అతను తెల్లగా, మంచుభూతంలా ఉన్నాడు. ముణగ లాక్కుపోయి కూర్చున్నాడు. ప్రాణంతో ఉన్న మనిషి ఎంత ముణుగలాక్కుపోయి ఉండగలడో అంత ముణగలాక్కుపోయేడు. బండి మీద రాయిలా కూ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top