You Are Here: Home » చిన్నారి » తెలుసా…!! (Page 3)

తెలుసా…!!

‘పక్షులు దివ్యమైన సరీసృపాలు’ అని ఎందుకు అంటారు?

సరీసృపాలు, పక్షులు రెండూ ఒక వర్గానికి చెందినవి కావు. కానీ ఒక శాస్త్రవేత్త పక్షులను దివ్యమైన సరీసృపాలు అన్నాడు. అలా ఎందుకు అన్నాడో తెలుసుకుందాం. చార్లెస్ డార్విన్ రచించిన ఆరిజన్ ఆఫ్ స్పీసిస్ 1859లో ప్రచురితమైన తర్వాత పక్షుల పుట్టుక గురించి అధ్యయనం ప్రారంభం అయింది. థామస్ హెన్రీ హక్స్‌లే శాస్త్రవేత్త కూడా పక్షుల పుట్టుకపై అనేక పరిశోధనలు చేశాడు. ఆయన పక్షులకు సరీసృపాలకు కొన్ని లక్షణాలు ఒకేలా ఉన్నాయని చెప్పాడు. ప ...

Read more

నాన్‌స్టిక్ వంటపాత్రలను ఎలా తయారుచేస్తారు?

ఇటీవల కాలంలో నాన్‌స్టిక్ వంటపాత్రల వాడకం గణనీయంగా పెరిగింది. వండే పదార్థాలు పాత్రలకు అడుగుభాగాన అంటుకుపోకుండా, మాడిపోకుండా ఉంటాయనే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ నాన్‌స్టిక్ పాత్రలను ఎలా తయారుచేస్తారో చూద్దాం. టెఫ్లాన్ అనే పదార్థాన్ని పాత్రలో పైపూతగా వాడటం వలన వండే పదార్థాలు పాత్ర అడుగున అంటుకుపోకుండా, మాడి పోకుండా ఉంటాయి. ఇథిలియం (ఇథిలీన్) ఫ్లోరిన్‌తో చర్య జరిపినప్పుడు టెట్రాఫ్లోరో ఇథిలిన్ ఏర్పడ ...

Read more

విమానాల టైర్లలో ఏ వాయువును నింపుతారు?

సైకిళ్లు, మోటార్‌బైక్‌లు రోడ్లపై తిరిగే వాహనాల్లో గాలి నింపటం చూస్తూనే ఉంటాం. అయితే విమానాల టైర్లలో ఏ వాయును నింపుతారో తెలుసుకుందాం. విమానాల టైర్లలో హీలియం అనే వాయువును నింపుతారు. ఇది తేలికైన జడ వాయువు. జడ వాయువు అంటే ఇతర పదార్థాలతో ఎటువంటి రసాయనికచర్య జరపనివి. హీలియం వాయువు తేలికగా ఉండటం వలన దీనిని వాతావరణ బెలూన్లలో కూడా నింపుతారు. విమానాల టైర్లలో కూడా వాడతారు. ఆస్తమా రోగులకు ఆక్సిజన్, హీలియం వాయువుల మిశ్ర ...

Read more

వనస్పతి (డాల్డా)ని ఎలా తయారుచేస్తారు?

స్వీట్లు, బిరియానీ లాంటి ప్రత్యేకమైన వంటకాలు తయారు చేయటానికి వనస్పతిని ఉపయోగిస్తారు. వనస్పతిని ఎక్కువమంది డాల్డా అని పిలుస్తారు. ఒక తయారీ సంస్థ తాలూకు బ్రాండ్ నేమ్ వల్ల వనస్పతికి డాల్డా అనే పేరు వచ్చింది. దీనిని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. మూమాలు వంటలకు వాడే నూనెల హైడ్రోజనీకరణ వలన వనస్పతి తయారవుతుంది. వెజిటబుల్ ఆయిల్ తీసుకుని దానికి నికెల్ అనే మూలాకాన్ని ఉత్ప్రేరకంగా ఉపయోగించి హైడ్రోజన్ వాయువుతో కలిిపి ...

Read more

టైటానిక్

ఒక పదం 1912లో మరోసారి కొత్తగా పుట్టింది. దీనికి నిఘంటువు చెప్పే అర్థం సరిపోదు. ఇక్కడ భాషకన్నా భావం ముఖ్యం. ఆ కొత్తపదం ‘టైటానిక్’. దానర్థం ఏమిటి? ఒక విశేషణం, ఒక చరిత్ర, ఒక చెదిరిపోయిన కల, ఒక ఉద్వేగం, ఒక దుఃఖం, ఒక సజీవసమాధి, ఒక మూఢనమ్మకం, ఒక విలాసం, ఒక పుట్టిమునిగిన ఓడ, ధైర్యం, కర్తవ్యం, ఆర్తనాదం, విధ్వంసం, మృత్యువు, మహాసముద్రంలో కలిసిపోయిన వందలాదిమంది కన్నీటిధార. కనీ వినీ ఎరగని రీతిలో నిర్మితమై, మహా ఆర్భాటంగ ...

Read more

పూజలో పుష్పాలను ఎందుకు ఉపయోగిస్తారు?

పుష్పాలకు గల ఆకర్షణశక్తి వల్ల అవి వాతావరణంలోని దైవిక శక్తుల తరంగాలను తమలో ఐక్యం చేసుకుంటాయి. అలా ఐక్యం చేసుకున్న దైవిక శక్తికి తమలోని సువాసనను జోడించి, పరిసర ప్రాంతాలను అవి పవిత్రంగా మార్చుతాయి. వాటిని దైవానికి సమర్పించినప్పుడు వాటిలోని పుప్పొడి కోశం దైవంలోని శక్తిని గ్రహించి, ఆ శక్తిని సుగంధ పరిమళాలనిచ్చే ప్రాణవాయువు రూపంలో తిరిగి బయటకు ప్రసరింపచేస్తుంది. శాస్త్రపరంగా చెప్పాలంటే పుష్పాలు మనలోని వ్యతిరేక భా ...

Read more

172 రోజులు – ఏడు పర్వతాలు

రాష్ట్రంలో ఆ ఊరు ప్రత్యేకం. ఆ ఊరిలో ఆ మనిషి ప్రత్యేకం. ఇంతకీ ఆ ఊరేది? ఆ మనిషెవరు? నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరికీ సుపరిచితమైన ఆ ఊరు ‘గాంధీ జనసంఘం’. ఆ మనిషి మల్లి మస్తాన్ బాబు. ప్రపంచంలో ఎత్తయిన ఏడు పర్వతాలను కేవలం 172 రోజుల్లో అధిరోహించి ఆయన తన సత్తా చాటాడు. అది గిన్నిస్ రికార్డు కూడా సాధించాడు. మల్లి మస్తాన్‌బాబు ఓ సామాన్య కుటుంబానికి చెందిన యువకుడు. చిన్నప్పటి నుంచి సాహసాలను ప్రేమించాడు. ఎంత సాహసవంతుడో, ...

Read more

మెదడుకు మేత

Food Facts కివీ పళ్లు తింటే కంటిచూపు మెరుగుపడుతుంది! మందులు వేసుకున్న తర్వాత ద్రాక్షపళ్లు తినకూడదు. ఎందుకంటే కొన్ని రకాల మందులు పనిచేయకుండా చేసే లక్షణం వాటికుందని పరిశోధనలో తేలింది! దాల్చినచెక్కకు ఇన్సులిన్‌ని వృద్ధి చేసే శక్తి ఉంది! సైనస్ సమస్య ఉన్నవాళ్లు క్యాప్సికమ్ ఎక్కువ తింటే శ్వాస తేలికగా ఆడుతుంది! కొత్తిమీర తరచుగా తినేవాళ్లకు కొలెస్ట్రాల్ కాస్త దూరంగా ఉంటుంది! .................... Interesting Facts ఎ ...

Read more

డైనోసార్లు ఏ యుగానికి చెందినవి?

డైనోసార్లు మీసోజాయిక్ యుగం అంతా జీవించి ఉన్నాయని చెప్తారు. ఈ యుగం 240 మిలియన్ల సంవత్సరాల క్రితం ప్రారంభం అయింది. ఈ యుగాన్ని సరీసృపాల యుగం అని కూడా అంటారు. ఈ యుగంలో మూడు భాగాలు ఉన్నాయి. 1) ట్రైయాసిక్ కాలం- 245 నుంచి 208 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు ఉన్న కాలం. ఈ కాలంలో అనేక జంతువులు అంతరించినా డైనోసార్లు మనుగడ సాగించాయి. 2) జురాసిక్ కాలం-208 నుంచి 146 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు. ఈ కాలంలో డైనోసార్లులు అభివ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top