You Are Here: Home » చిన్నారి » కవితలు (Page 6)

కవితలు

మన్నించు..!!

నీలోకి నిర్భయంగా ప్రవేశిస్తుంటాను నా లోంచి నువ్వు గాయాలతో నిష్ర్కమిస్తుంటావు ఒక్కొటొక్కటిగా దుస్తుల్ని వలుస్తూనే ఉంటానునా లోని నిస్సిగ్గు కోరికలకు నిర్మలమైన నీ మనసును కప్పుతూనే ఉంటావువేళా పాళా లేకుండా వెకిలి మకిలిగా అంగాన్ని తడముతుంటానునా ఆకలి పేగుల్ని ఆయాసపడుతూ నింపుతూనే ఉంటావునీ కోసం ఎప్పుడూ ఏదో చేస్తున్నట్టు నటిస్తూనే ఉంటాను నా కోసం ఎప్పుడూ దేవుడిముందు అంజలి ఘటిస్తూనే ఉంటావునవ్వుల పువ్వుల్ని రువ్వుతూ ఎప్ ...

Read more

కన్నతల్లి నా కోమళ్ళ

అయ్య చేసే కూలీపనిఅవ్వ చేసే పాచిపనిఅన్న చేసే జీతగాని పని...రోజుకు ఒక్కపూటైన సరేగొడ్డుకారం మెతుకులు తినితాకటలేని అతుకుల బతుకులు మాయిచినిగిన అంగి అతుకుల లాగుఎర్రని దారం కండెతోమా అవ్వ చేతి కుట్టు మా మానాలను దాచేఆ ‘చందన’నపు పట్టుపండగలు, పబ్బాలుఅందరికి విందు వినోదాలిస్తేఆపూట పస్తులతో గడిపే మాకుఅరువు తెచ్చిన నూకల పరంనల్లరేగడి మట్టిపెల్లలేరుతూమొండి చింతకిందున్నపెద్దమనిషి చిన్నరామయ్య తాతఅగ్గిపుల్ల ఇస్తేగాని... ఆకలి ...

Read more

దుగ్గినపల్లి

బియ్యాన్ని బంగారంలా చూస్తున్నారిప్పుడుబియ్యాన్ని ముత్యాల హారాల్లాసంపన్నులు సౌందర్యం కోసంధరిస్తారేమో?బిచ్చగాడికి గుప్పెడు బియ్యంపిడికెడు అన్నం పెట్టే వాళ్ళంకళ్ళంలోకి పేదవారొస్తే ధాన్యం చాటల్లో పోసేవాళ్ళంఇపుడు బియ్యాన్ని భద్రంగాబీరువాల్లో దాచుకుంటామేమోఏడువారాల నగల్లా!కిలో బియ్యం ఒక్క రూపాయే కదా? అయితే దండుకు గంజి వార్చేదమ్మెవడికుందిచేలో పంట ఇంట్లో వంటలేక విగత జీవులౌతున్న జనంమధ్య తరగతి బతుకు మాడు వాసనైఉత్తి గి ...

Read more

మరొక

నాబతుకును కాలం కంటికతికించిఒక రాగంలాంటి భవిష్యత్తు కోసంఅలుపెరుగక నీకోసం ధారపోశా...బట్టకు మరకంటితే బతుకుకేమరకంటినంతగా మథనపడి చెమటతో కడిగి,నీ జీవితానికి వారధినయ్యా...ఆకలి అలలై ఎగసిపడుతున్నానీకు పాలు, పళ్లు సమకూర్చినేను మాత్రం మంచినీళ్ళకు పరిమితమయ్యా...నీ ఎదుగుదలకు పలవరించిశ్రమించిన నాన్న రాలిన పువె్వైతే,నేను నాన్ననై నీ జీవితాన్ని వడ్డించిన విస్తరి చేశా...లక్షమందిలో ఒకడిగానీవు గుర్తింపు పొందినప్పుడు పెద్దోళ్ళం ...

Read more

దిల్‌ దుఖ్‌ నగర్‌!

అయ్యో నా బిడ్డలార ఈ నెత్తుటి కళ్లాపిని చూడలేను మీ నిస్సహాయ రోదనల్ని వినలేను బయటపడ్డ పేగులు తెగిపోయిన కాల్జేతులు పేలిపోయిన కండ ముద్దలు పగిలిపోయిన చెవుల పొరలు గాల్లో కలిసిన ఊపిర్లు చెల్లాచెదరైన నూకలు మట్టిలో కలిసిన మెతుకులు పిల్లలవో పెద్దలవో నల్లనివో తెల్లనివో హిందువువో మహమ్మదీయునివో ఎంచలేను తేల్చలేను అవన్నీ నా బిడ్డలవే అన్నీ నావే, నా లోపలివే నా అశోక వనంలో కొమ్మల్ని నరికి మొక్కల్ని పెరికి అభద్రతల మంట బెట్టిన ...

Read more

గోడ

గోడకు నోరూ ఉందికాళ్లు చేతులు గుండె చర్మంరక్తనాళాలూ - ఇవీ ఉన్నాయిరక్తనాళాల్లో ప్రవహించేరక్తంలో బయటి ఊపిరి-ఇవీ ఉన్నాయి! 2దట్టమైన పెనుచీకటివ్యాపించనీ ఏదో అరిపోయే దీపంలా గోడశాంతమవ్వనీ! 3నేల మీద పడినఒక ఈకను ఎత్తటానికి గోడవొంగుతోంది! 4ఎప్పుడో ఒకసారిఈ గోడరెండు పార్శ్వాలనూచూడవచ్చు! 5సుడిగాలి వీచినపుడుగోడ చేయూపి ఊపి చేయి విరిగిపోయింది! 6చెవియొగ్గి వింటే ఈ గోడల్లో లెక్కలేనన్ని పక్షుల రెక్కల చప్పుడు వినిపిస్తుంది!గుజర ...

Read more

ఒక డప్పు కథనం

నెత్తుటి బొట్లు కురిసిన చోటగచ్చ పొదలు మొలిచాయిమంచు తెమ్మెరల నిండా కన్నీటి చారలేచంక నేసుకొన్న పిల్లోడుతల్లికి ఎన్నో ప్రశ్నలు వేస్తూఉన్నాడుపుట్టిన బిడ్డకు రొట్టె ముక్క పెట్టలేని దారిద్య్రంనిజమేఅందరూ ఆ భరతమాతకే పుట్టారుఆ భూమి పుత్రులే ఒకరు పుట్టగానేబంగారు స్పూనులతో నెయ్యన్నాలు,మరొకరి అంగిట్లో నిప్పుకణికలు!అస్పృశ్య భావనలుఆ బడిలో చెంచీలు ఎందుకు ఖాళీ అయ్యాయిఆ పిల్లలు తల్లితో కలిసిఏ పచ్చాకుకో వెళ్ళారా!చలిలో తోటల్ల ...

Read more

ఎవరితను!

హింస సర్వ నామమై చుండూరు పేరు పెట్టుకున్నాక లక్షల యోజనాల గూడెమూ అగ్రహారాల దవ్వుని దాటొచ్చి రిక్త హస్తాలతో రక్త క్షేత్రం దగ్గర చతికిలపడ్డ పేదలకు ఏకవచనమై కనబడతాడు నరవాసన మరిగిన రక్తానికీనరహంతక సీతారామాంజనేయులుకూ దెబ్బవేటు దూరమేనని కనిపెట్టితెగిన తలల చరిత్రకుతెరపివ్వని నరమేధానికి హేతువు సేతువుల్ని కట్టిసాక్ష్యాల శకలాలు తవ్వుతూ కనబడతాడు నల్ల కోటుకు నల్ల సంపాదన రహదారి గానీనల్ల జనం కోసం పోరాడిన చరిత్ర శూన్యమేగానీ ...

Read more

తిత్తవ

ఒకరి తర్వాత వొకరు ముందో వెనుకో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు చెప్పా చెయ్యకుండా అలికిడే లేకుండా విడి విడిగా హడావిడిగా జీవితాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారుఎంతటివారల ఖాతాల్లోని రోజులన్నీ తరిగిపోవడమే కానీ మిగిలింది లేదు పచ్చి ఆకు తెగి పడ్డా పండాకు రాలి పడ్డా దానికి నిండా నూరేళ్ళన్నదే మన లెక్క అయినా అందరి లెక్కా వొక్కటిగా లేదు ఈ తప్పుడు లెక్క లెక్క తప్పిందీ లేదుఔను, వచ్చిన పని పూర్తయినట్టు ఒక్కరొక్కరూ వెళ్ళ ...

Read more

కాంక్రీటు పిచ్చుగ్గూళ్ళలో!

జీవితమంతా గడిపిన గుర్తుల్నేవో వెతుక్కొంటూ ఊళ్ళోనే ఉంటామంటూ అమ్మా, నాన్న... కొత్త జీవితాన్నేదో కోరుకొంటూబాల్య జ్ఞాపకాలన్నింటినీ తొక్కుకొంటూ నగరంలోనే నేను...తరాల మధ్య అంతరమేదో అనివార్యమౌతోందికుటుంబమంతా కలిసుండాలనేదో కలగానే మిగిలి పోతోందిడాలర్‌ సంబంధాలో, గ్లోబల్‌ గొప్పలో, బతుక్కొచ్చిన తిప్పలోరక్తసంబంధాలకీ, వ్యక్తిసంబంధాలకీ మధ్య మిణుగు మిణుగుమని వెలుగుతున్న వంతెనలన్నీ కూల్చేస్తున్నాయి.మొన్నీమధ్యే...అమ్మని నా దగ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top