You Are Here: Home » చిన్నారి » కథలు (Page 6)

కథలు

పేద – గొప్ప

అనగనగా ఓ పల్లెటూరు. ఆ ఊరిలో ఒక గొప్ప ధనవంతుడు. పెద్ద భవనం... బోలెడంత మంది పనివాళ్లు... ఇంటినిండా బంధుమిత్రులతో వైభవంగా జీవించేవాడు.ఆ భవనానికి కొద్దిదూరంలో ఓ పేదవాడు. చిన్న పూరిగుడిసె... వారసత్వంగా వచ్చిన తోట... అందులో పండ్లచెట్లు, పూల మొక్కలు పెంచుతూ వాటి ద్వారా వచ్చే కొద్దిపాటి ఫలసాయంతో పొట్టపోసుకునేవాడు. ధనికుడికి ఆస్తి ఉన్నా ఆరోగ్యం లేకపోవడంతో కడుపునిండా తినడానికి, కంటినిండా నిద్రపోవడానికి నోచుకోలేదు. దా ...

Read more

శుభలగ్నం..!

శ్రీమతి దుర్గ అంటే ఆ వీధి వారెవరకీ తెలీదు ఓహో ఆవిడ పేరు దుర్గానా! అనుకుని ఆశ్చర్యపోతారు. కారణం ఆమెకు మరో పేరు వుంది శుభలగ్నమని. శుభలగ్న మంటే అదేదో సినిమా టైటిల్‌ అనుకునేరు! ఎంతమాత్రం కాదు. ఆవిడ చేసే చేష్టలు, ఆచ రించే పద్ధతులు అలాంటివి. ముఖ్యంగా పం డుగ దినాలలో చేతుల దగ్గర నుండి పాదాల వరకు పసుపు రాసుకేనేతీరు, అంతేనా ప్రతి శుక్రవారం తలంటు పోసుకుని మడితోనే వంటవార్పు... ఇలా చేస్తుండటంతో ఆవిడకు ఆ వీధి వారు శుభలగ్ ...

Read more

వెన్నెట్లో తడిసిన పాట

‘‘మహ చక్కహా కుదిరిందే అమ్మలూ సందర్భం!’’ పాత సినిమా పాటలతో దూరదర్శన్ రాత్రిని ఓలలాడిస్తోంది. ఆ పాట వినేశాక అత్యవసరమైన సంగతి చెప్పదలిచినట్టు చటుక్కున టీవీకి గళ దిగ్బంధనం చేసి అన్నారు, నాన్నగారామాట. పదిన్నరయి ఉంటుంది. బయటంతా చల్లగా, నిశ్శబ్దంగా; గదిలో వెచ్చగా. అలాంటి వేళలో నాన్నకీ, నాకూ పాటలు వినడం మహా ఇష్టం. టీవీకి ఎదురుగా గోడకి చేర్చి ఉన్న మంచం మీదే బాసిం పట్టు వేసుకుని , తొడమీద తాళం వేస్తూ వింటున్నారు నాన్న ...

Read more

గుంపులో గోవిందమ్మతో…

‘‘నువ్వులక్ష చెప్పవయ్యా నీలాచలం. నే ను ఆ అమ్మాయిని మన...సారా ఇష్టపడుతున్నాను. అసలు పెళ్ళంటూ చేసు కుంటే ఆమెనే చేసుకుంటాను. నీకేవిటట అభ్యరతరం’’ అన్నాడు నిరీక్షణరావు. గుటకలు మింగుతూ నీలాచలం ‘‘మిత్రమా నీ బాగుకోరి చెబుతున్నాను. ముచ్చటపడి సరదా తీర్చుకు న్నా ఆ తర్వాత నువ్వు సంసారానికి పనికిరా కుండాపోతావ్‌! ఇట్టాంటి వాళ్ళు ఎంతో మంది జీవితాల్లో తారసపడతారు. కాల్చేసిన సిగరెట్‌ పీకలా విసిరి పారెయ్యాలిగాని, ఇటువంటి అడదా ...

Read more

ఆశపోతు నక్క

అనగనగా ఓ అడవి. ఆ అడవిలో ఓ నక్క. దాని జిత్తుల గురించి తెలిసిన జంతువులు దాని కంటబడకుండా తప్పించుకుని తిరగసాగాయి. దాంతో అది ఆకులు అలములు తింటూ ఎలాగో బతకసాగింది. ఓ రోజు నీరసంతో నడవలేక నడవలేక ఆహారం కోసం వెతుకుతుండగా దానికి ఒక పిల్లి ఎదురై ‘‘ఎలాఉన్నావు పెద్దమ్మా!’’ అని పలకరించింది. నక్క దానికి తన పరిస్థితి చెప్పుకుని బాధపడింది. పిల్లికి నక్క మీద జాలేసింది. ‘‘అలా అయితే నాతో రా పెద్దమ్మా, ఇక్కడికి దగ్గరలో ఓ ఇంట విం ...

Read more

కాకి- ఎద్దు

అనగనగా ఓ కాకి. అది పగలంతా ఆహారం కోసం తిరిగి సాయంకాలం తన గూటికొచ్చేది. అదే సమయానికి ఓ రైతు వద్ద ఉన్న ఎద్దు కూడా పొలం దున్నిన బడలికతో పశువులపాక ముందు గడ్డిని నెమరేస్తుండే ది. రెండూ కలసి కష్టసుఖాలు కలబోసుకునేవి. ఓ రోజు ఎద్దును చూసి కాకి ‘‘మిత్రమా! నువ్వెంత వెర్రిదానివి! ఆ రైతు చూడు, నీ మెడపై కాడిని ఉంచి పగలంతా చాకిరీ చేయించుకుని సాయంత్రానికి నాలుగు గడ్డిపరకలు, కాస్త కుడితి నీ ముఖాన పడేసి చేతులు దులుపుకుంటున్నా ...

Read more

తారుమారు క్షవరం

‘‘రాంబాబు గారూ, బేగి రాండి బాబూ జాగుసేయమాకండీ...’’ అంటూ అలనాటి ఆ హనుమంతుడు ఆ రాముడ్ని పిలిచినట్లు పిలిచాడు హనుమంతు. అఫ్‌కోర్స్, ఈ హనుమంతు పిలుపులో ఆ హనుమయ్య భక్తీ, ఆర్తీ లేవు. సరికదా, కొంచెం కోపం, మరికొంచెం చిరాకూ! ఎట్టకేలకు ఆ రాంబాబుగారు లోపల్నుంచి బయటికి వచ్చారు. ఆ రాంబాబుగారు ఎట్టా వచ్చారయ్యా అంటే... ఒక చేతిలో మాటేసిన పాత ఇత్తడి చెంబుతో నీళ్లూ, మరో చేతిలో పాత పీట చెక్కా పట్టుకుని వచ్చారు. అట్టా వచ్చిన ఆ ...

Read more

మెట్టెల గున్యా…!

సంఘమేశానికి యుక్త వయసొచ్చినప్పటి నుంచీ ఓ అలవాటుగా మారిపోయింది. ఆ అలవాటేమిటో, అది అంతగా ముదిరి పాకానపడి, వీడకుండా అలవడ్డానికి ప్రధాన కారణం వుందిలెండి. దాన్ని తెల్సుకోవాలంటే అతని గతాన్ని ఓ సంవత్సరం కాలెండరు తిరగేసి పలుగుపారతో తవ్వితే కాని దృశ్యాదృశ్యమవదు.సంఘమేశు మంచి అందగాడు, నీటుగాడు, ‘స్ఫురదృపి’, అలాగే మనస్తత్యంలో ఉన్నత స్వభావం గలవాడు కూడా. చిన్నప్పట్నుంచి అమ్మానాన్నల కట్టు దిట్టమైన ఆంక్షల ట్టడి ిలో పెరగడం ...

Read more

భోక్తలు

వెంకటశాస్ర్తి ఇల్లు, ఇద్దరు తమ్ముళ్ళ తోనూ ఇద్దరు తోభుట్టువులతోనూ వారి బంధు వర్గంతోనూ నిండి ఉంది. కోట వారి వంశం అంటే మాటా మరి అదొక చీమల పుట్ట, వారి తాతగారు అన్నట్లు ‘‘మన ఇంటికి ఎవరు రాకపోయిన ఫర్వాలేదురా మన జనం మనకి చాలురా!’’. ఇంతమంది పుట్ట ఉన్నా ఎవరూ మాట్లాడటం లేదు. అంతా దిగాలుగా ఎవరో ఆత్మీయుని కోల్పోయినట్లుగా మౌనంగా ఉన్నారు. ఎవరూ ఎవరిని పలుకరించినా భోరున ఎడుస్తున్నారు. మనం వెంకటశాస్ర్తి సంగతి చెప్పనే అక్కర్ ...

Read more

అక్కపెళ్లి

అక్క అమీనా పెళ్లి. చిట్టి మజీద్ పొద్దున్నే లేచి పక్క మీద కూర్చుని వేళ్లు లెక్కబెట్టి కలవరపడ్డాడు. మొన్న అత్తతో మాట్లాడుతున్నప్పుడు అమ్మ ‘మా అమీనా పెళ్లికి ఇంకా మూడు రోజులు ఉన్నాయి’ అని అంది. అలాగైతే ఇంకా ఎన్ని రోజులున్నాయి? ఒకటా... రెండా? లెక్క తప్పి మజీద్‌కు తల దిమ్మెక్కింది. రేపా? ఎల్లుండా? లేదు రజియాఅక్కను అడిగితే సరిపోతుందని అనుకుంటుండగా అక్కడికి తల్లి వచ్చింది. ‘‘లేవడానికి ఎంతసేపురా? టైమెంతైంది?’’ అన్న ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top