You Are Here: Home » చిన్నారి » కథలు (Page 5)

కథలు

కోడళ్ళు

రాఘవరావుగారు రిటైర్డు టీచరు. రోజు సాయంత్రం సమయంలో ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు వాకింగ్‌ చేయ డం. ఆ వాకింగ్‌లోనే ఆలోచనలు, అనేక సమస్యలకి పరిష్కారం చేసుకోవడం రాఘవ రావుగారి దిన చర్యలో ఓ భాగం. ఆ రోజు ఎందుకనో అనుకున్న సమయం కంటే ముందుగానే వాకింగ్‌ వెళ్తున్న భర్తను చూసి ‘‘ఇంకా ఎండగా వుంది. కాసేపాగి వెళు దురు గాని, ఈ లోగా నిమ్మరసం తెస్తాను’’ అని వెళ్లింది విజయమ్మ కుంటుతూ నడుస్తూ. విజయమ్మ ఎడమకాలు విరిగి దాదాపు సంవత్సర ...

Read more

ఎవరు గొప్ప?

ఒక అడవిలో జంతువులు, పక్షులు సమావేశమై ‘ఎవరు గొప్ప?’ అనే విషయంపై చర్చించుకోసాగాయి. ప్రతి జంతువు, పక్షి తమ గొప్పతనానికి సంబంధించిన ఉదాహరణలు చూపించసాగాయి. ఏనుగు ‘‘నేను అందరి కంటె పెద్దగా, బలంగా ఉంటాను. కాబట్టి నేను గొప్ప’’ అంది. అప్పుడు సింహం పైకి లేచి ‘‘నేను చాలా గొప్పదాన్ని. రాజసం కలదాన్ని. నా గర్జన ఉగ్రంగా ఉంటుంది. నన్ను అడవికి రాజుగా గుర్తిస్తారు. కాబట్టి నేనే గొప్ప’’ అంది. జింక ‘‘నేను వేగంగా పరిగెత్తగలను. ...

Read more

వింతజబ్బు

పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఒక వింతజబ్బు పట్టుకుంది. ఆయన కడుపునిండా తినేవాడు. కంటినిండా నిద్రపోయేవాడు. బయటకాని, లోపలకాని ఎలాంటి ఆనారోగ్యపు ఛాయలు కనిపించేవి కావు. ఎంతోమంది వైద్యులు వచ్చారు. రాజును రకరకాలుగా పరీక్షించారు. కానీ ఆయనకు వచ్చిన ఆ వింత జబ్బు ఏమిటో కనిపెట్టలేక పోయారు. ఒకరోజు సూర్యశర్మ అనే ఒక తెలివైన వైద్యుడు రాజును చూడటానికి వచ్చాడు. రాజుకు వచ్చిన ఆ వింతజబ్బు ఏమిటో అతనికి అర్థమైపోయింది. ‘‘రాజా ...

Read more

తెలివైన బన్ను

బన్ను తెలివైనవాడు. ఒకరోజు అతను ద్రాక్షపళ్ళు కొనడానికి ఒక పండ్ల కొట్టుకు వెళ్ళాడు. ఆ కొట్టు యజమాని శేఖర్ కపటబుద్ధి కలవాడు. బన్నును చూసి ... చిన్నకుర్రాడే కదా! అని మోసం చేయాలనుకున్నాడు. అందుకే బన్ను కిలో ద్రాక్షపళ్ళు కావాలని అడిగితే కిలోకి తక్కువగా తూకం వేయసాగాడు. అది పసికట్టి- ‘‘నాకు కిలో కావాలి. మీరు తక్కువ ఇస్తున్నారు’’ అని అడిగాడు బన్ను. ‘‘నీకు మోసుకెళ్ళడం తేలిక బాబూ. అందుకే కొంచెం తగ్గించాను’’ అన్నాడు శే ...

Read more

తెలివైన కుందేలు

ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. దానికి తెలివితేటలే కాకుండాసమయస్ఫూర్తి కూడా ఉంది. అదే అడవిలో ఒక సింహం కూడా ఉండేది. అది ముసలిదై పోవడంతో జంతువులను వేటాడలేక పోయేది. అందుకే సింహం తన గుహకి దగ్గరలో ఏదైనా జంతువు తచ్చాడితే దాన్ని చంపి, కడుపు నింపుకునేది. ఒకరోజు కుందేలు అటుఇటు తిరుగుతూ సింహం గుహ దగ్గరకు వచ్చింది. అక్కడే రహస్యంగా మాటు వేస్తున్న సింహం దాన్ని పట్టుకుంది. మొదట కుందేలు భయపడిపోయింది. అయితే తెలివైనది, సమయస్ఫూర ...

Read more

బతికున్న శవం

ఊరి పక్కన పాడుబడిన బావిలో ఒక శవం తేలుతోంది. బాగా ఉబ్బి, నీటి మట్టానికి లేచింది. గ్రామ పెద్ద పాటిల్‌కు వార్త అందింది. వెంటనే ఆయన- వంతు చేయాల్సిన మా నాయనకు కబురు పెట్టాడు. మా నాయన వెళ్లి రాత్రంతా శవానికి కాపలా ఉన్నాడు. తెల్లవారింది. పొద్దెక్కింది. హెడ్ కానిస్టేబుల్ ఆ పాటికి అక్కడికి రావాల్సింది. కానీ, రాలేదు. శవ విచారణ జరిగే వరకూ కాపలా ఉండడం మెహర్ల విధి. క్రితం రోజు సాయంత్రం వెళ్లినవాడు, మరునాటి మధ్యాహ్నమైనా ...

Read more

తానొకటి తలిస్తే….

‘‘సుదీప్తీ!’’ అప్పుడే ఆఫీస్‌ నుంచి ఇంటికి వచ్చిన హరికృష్ణ పిలిచాడు. వంటిం ట్లో పనిచేస్తున్న సుదీప్తి ఇవతలకు వచ్చింది. ‘‘మీ పిన్ని కూతురి పెళ్ళి ఉంది. చీర కావాలని అడిగావుగా! తీసుకువచ్చాను’’ ప్యాకెట్‌ అందించాడు. సుదీప్తి ప్యాకెట్‌లో నుంచి కొత్తచీర తీసింది. కొత్త చీర చూసినా ఆమె ముఖం విప్పారలేదు. దానికి వేలాడుతున్న ట్యాగ్‌ చూస్తూ ‘‘ఐదు వందలేనా? పెళ్ళి కొచ్చిన చుట్టాలందరూ 2 వేలకు తక్కువ ఖరీదు చీరలు కట్టరు’’ అన్న ...

Read more

అహంకారం

ఒకరోజు ఒక నక్క ఆహారం కోసం బయలుదేరింది. దారిలో దానికి ఒక తోడేలు ఎదురుపడింది. ‘‘నేను కోళ్ళను తినడానికి ఒక రైతు పొలానికి వెళుతున్నాను. నువ్వు?’’ అని తోడేలును అడిగింది నక్క. ‘‘నేను గొర్రెను వేటాడబోతున్నాను. నువ్వు కూడా రావాలనుకుంటే చాలా మర్యాదగా ప్రవర్తించాలి. అలా అయితేనే నాతో రానిస్తాను’’ అంది తోడేలు. దానికి కొంచెం గర్వం ఎక్కువ. వెంటనే తెలివైన ఆ నక్క వినయంగా తల క్రిందకు వంచింది. ‘‘మీరు ఎంతో దయగలవారు. నన్ను మీ ...

Read more

ఎలుక గొప్పతనం తెలుసుకున్న ఏనుగు

అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు , ఒక చిన్న ఎలుక పిల్ల ఉండేవి. ఏనుగుకి ఎలుక పిల్ల కనిపించినప్పుడల్లా ‘‘ నువు ఇంత చిన్నగా ఉంటావు నీ వల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉంటుంది? ఏదైన అవసరం వచ్చినప్పుడు ఎవరికైనా సహాయం చేయగలుగుతావా? నేను పెద్దగా ఉన్నాను కాబట్టి ఎంత మందికైనా సహాయం చేయగలుగుతాను. ఎప్పటికైన నా వల్లే అడవిలో జంతువులకు మేలు జరుగుతుంది’’ అని గర్వంగా చెప్పేది. ఎలుక పిల్ల మాత్రం ఏమీ పట్టించుకోకుండా తన వల్ల ఎవరికీ ఏ నష్ ...

Read more

నాన్న కూతురు

డిసెంబరం పువ్వు రంగు క్రష్‌డ్ టాప్, పెన్సిల్‌కట్ లోవెయిస్ట్ మోడల్ తెల్లని జీన్స్, స్టెప్‌కట్ చేయడం మూలంగా కదిలి నప్పుడల్లా నల్లని సముద్రపు అలల్లాగా ఊగుతున్న ఉంగరాల జుత్తు, పొడవుగా, సన్నగా, తెల్లగా... మారాకులు వేసుకుంటూ చకచకా ఎదిగిపోతున్న పదిహేనేళ్ల లేత యవ్వనం. లాస్య. అప్పుడప్పుడు జరిగే మా ముగ్గురి సమావేశానికి ఈ రోజు ముఖ్య వక్త. ‘‘నాన్నా! నువ్వు ముందు మొహం అట్లా చిరాగ్గా పెట్టడం మానేస్తే నేను మాట్లాడతా’’ - ద ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top