You Are Here: Home » చిన్నారి » కథలు (Page 4)

కథలు

కష్టానికి ఫలితం

ఒక ఊళ్ళో ఒక రైతు దగ్గర కోడి, బాతు, కుక్క, పంది ఉండేవి. అవి స్నేహంగా ఉంటూ కలిసి మెలసి తిరిగేవి. కోడి కష్టపడి పనిచేస్తే మిగతావి మాత్రం సోమరితనంతో కాలం గడిపేవి. ఒకరోజు కోడికి కొన్ని మొక్కజొన్న గింజలు కనబడ్డాయి. ‘‘వీటిని ఎవరు నాటుతారు?’’ అని అడిగింది. ‘‘నేను కాదు. నేను కాదు’’ అని బాతు, కుక్క, పంది... అన్నాయి. కొన్నిరోజుల తరువాత కోడి ‘‘మొక్కలకు నీళ్లు ఎవరు పెడతారు?’’ అని అడిగింది. ‘‘నేను పెట్టలేను. నేను పెట్టలేన ...

Read more

రాజు – ఎలుకలు

పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతడికి జున్ను అంటే ఎంతో ఇష్టం. వంటవాడు రాజు కోసం జున్నుతోనే రకరకాల మిఠాయిలు తయారుచేసేవాడు. ప్రతిరోజూ రాజు ఆ వంటలన్నిటినీ చాలా ఇష్టంగా తినేవాడు. అయితే ఆ జున్ను వాసనకు ఎన్నో ఎలుకలు రాజగృహానికి వచ్చి చేరాయి. కొద్దిరోజుల్లోనే వాటి సంతతి విపరీతంగా పెరిగిపోయింది. రాజు ఆ ఎలుకలను వెళ్ళగొట్టమని మంత్రిని ఆదేశించాడు. మంత్రి వాటిని వెళ్ళగొట్టడానికి పిల్లులను తీసుకువచ్చాడు. ఎలుకలు పారిపోయాయి. ఇప ...

Read more

అందం కన్నా నైపుణ్యం మిన్న

ఒకరోజు వికారరూపుడైన ఒక యువకుడు విష్ణుశర్మ ఆశ్రమానికి వచ్చి ఆయనను కలిసాడు. ‘‘స్వామీ, ఈ కురూపితన్నాని భరించలేక పోతున్నాను. నన్ను అందంగా మార్చండి. లేకపోతే నాకు ఆత్మహత్యే శరణ్యం’’ అంటూ కన్నీళ్ళతో ప్రాధేయపడ్డాడు. ‘‘తప్పకుండా మారుస్తాను. అయితే నువ్వు కొంతకాలం ఇక్కడే ఉండాలి. నువ్వు మీ ఊళ్ళో ఏ పని చేసేవాడివి’’ అని అడిగాడు విష్ణుశర్మ. ‘‘నేను చదువుకోలేదు. అయితే చెక్కతో బొమ్మలు చేయడం మా నాన్న దగ్గర నుండి నేర్చుకున్నాన ...

Read more

తప్పు తెలుసుకున్న కాకి!

ఒక అడవిలో ఒక పిచ్చుక చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకుని పిల్లలతో ఉండేది. వానాకాలం వచ్చింది. ఒకరాత్రి కుండపోతగా వర్షం కురవడం మొదలైంది. బలంగా వీచిన గాలులకు పిచ్చుక గూడు దూరంగా ఎగిరిపోయింది. పిచ్చుక పిల్లలు వర్షానికి తడిపోసాగాయి. పిల్లలను తీసుకుని కాకి ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది పిచ్చుక. ‘‘ఎవరు?’’ అంటూ లోపలి నుండి అడిగింది కాకి. ‘‘కాకమ్మా! నేను. వానగాలికి గూడు చెదిరిపోయి, నా పిల్లలు వర్షానికి తడిసిపోతున్నాయి’’ ...

Read more

ఎవరు ఏడుస్తారు?

అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక చిన్న పచారీ కొట్టు ఉంది. ఆ కొట్టులో టొమోటో, ఉల్లిగడ్డ, ఉప్పు స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆ మూడు కలిసి పూజ చేయడానికి గుడికి బయలుదేరాయి. దారిలో ఒక చిన్న నీటికాలువ అడ్డువచ్చింది. కాలువ దాటడానికి మూడూ నీటిలోకి దిగాయి. కొద్దిసేటి తరువాత టమోటా, ఉల్లిగడ్డ పైకి వచ్చాయి. ఉప్పు రాలేదు. నీటిలో ఉప్పు కరిగిపోయింది. టొమోటో, ఉల్లిగడ్డ స్నేహితుడి కోసం కాసేపు దుఃఖించి, గుడివైపు సాగిపోయాయి. గుడిలో భక్తు ...

Read more

తోక ముడిచిన కుక్క

ఒకరోజు రెండు ఆవులు గడ్డి తినడానికి గడ్డివాము దగ్గరకు వెళ్ళాయి. ఒక కుక్క ఆ గడ్డి మీద పడుకుని విశ్రాంతి తీసుకుంటోంది. ఆవులను చూడగానే కుక్క భయంకరంగా మొరుగుతూ వాటిని తరిమేయసాగింది. ‘‘దయచేసి మమ్మల్ని గడ్డి తిననివ్వు. అది మా ఆహారం. మేము చాలా ఆకలితో ఉన్నాం’’ అని ప్రాధేయపూర్వకంగా అంది ఒక ఆవు. కుక్క వినలేదు. ‘‘పొండి... పొండి. నా నిద్రను చెడగొట్టొద్దు. ఇంకెక్కడైనా వెళ్లి గడ్డి వెతుక్కోండి’’ అంటూ ఆవులను దూరంగా తరిమేసి ...

Read more

కోడిపెట్ట – నక్క

ఒక అడవిలో ఒక నక్క నివసించేది. ఒకరోజు నక్కకు ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న కోడిపెట్ట కనిపించింది. కోడిని చూడగానే నక్కకు నోట్లో నీళ్ళూరాయి. ‘ఈ అడవిలో కోళ్ళు బొత్తిగా కరువైపోయాయి. కోడిమాంసం తిని ఎన్ని రోజులయ్యిందో! ఎలాగైనా ఈ రోజు దీన్ని రుచి చూడాలి’ అనుకుని కోడితో ఎంతో ప్రేమగా మాటలు కలిపింది. ‘‘నిన్నెప్పుడూ ఇక్కడ చూడలేదు. నువ్వు ఈ అడవికి కొత్తా?’’ అని కోడిని అడిగింది. ‘‘అవును. మా యజమాని మమ్మల్ని పొరుగూరు స ...

Read more

కుందేలు-తాబేలు

కుందేలు, తాబేలు స్నేహితులు. కుందేలుకు తను తెల్లగా అందంగా ఉంటానని, వేగంగా పరుగెత్తగలనని గర్వంగా ఉండేది. ఒకరోజు కుందేలుకు తాబేలును ఏడ్పించాలని పించింది. ‘‘మిత్రమా! రేపు మా ఇంటికి వస్తావా? నీ కోసం రుచికరమైన ఆహారం సిద్ధం చేస్తాను. సరిగ్గా భోజనాల వేళకు రావాలి’’ అంది. ‘సరే’ అంది తాబేలు. తాబేలు వేగంగా నడవలేకపోవడంతో, కుందేలు ఇంటికి ఆలస్యంగా చేరుకుంది. ‘‘నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు మిత్రమా! ఇంతసేపూ చూసి నేను తినేశా ...

Read more

బాషా చూడు…

అది నవంబర్ మాసపు చలిరాత్రి. చెన్నైకి వెళ్లేందుకు రైలు ఎక్కడం కోసమని నేను గుడివాడ ప్లాట్‌ఫారంపై ఉద్విగ్నంగా నిరీక్షిస్తున్నాను. ఎక్కడ చెన్నై, ఎక్కడ గుడివాడ! పుట్టి బుద్దెరిగిన తర్వాత పుణ్యక్ష్రేతాల కోసమని కూడా ఎప్పుడూ రాష్ట్రం దాటిన పాపాన పోలేదు. కృష్ణాజిల్లాకి చుట్టూతా ఓ లక్ష్మణరేఖని గీసుకుని అక్కడక్కడే తిరుగుతూ వున్నానయ్యే! అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా చెన్నై బ్రాంచికి ట్రాన్స్‌ఫర్ కావడంతో కాపురానికి వెళుతున ...

Read more

తెలివైన సమాధానం

ఒక ఎలుగుబంటి, ఒక పులి ‘‘ఏకాలం చల్లగా ఉంటుంది?’’ అనే విషయంపై వాదించుకుంటున్నాయి. ‘‘శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది’’ అని అంది పులి.‘‘నేను ఒప్పుకోను. ఎందుకంటే శీతాకాలంలో నాకు చలి వేయదు. వర్షాకాలంలోనే నాకు చాలా చలి వేస్తుంది. కాబట్టి వర్షాకాలమే చాలా చల్లగా ఉంటుంది.’’ అంటూ వాదించింది ఎలుగుబంటి. ఇంతలో ఒక వ్యక్తి అటువైపు వచ్చాడు. అవి తమ వాదన గురించి అతనితో చెప్పాయి. ఆ వ్యక్తి జవాబు కోసం ఆలోచించసాగాడు. వెంటనే పులి ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top