You Are Here: Home » చిన్నారి » కథలు (Page 3)

కథలు

ఆషాఢమేఘం

‘జాను! సామానులన్నీ సర్దావా’ అని అడిగా ను ఇంకా ఎంతసేపటికీ తెమ లకపోతుంటేనూ... ‘అబ్బా ఉదయమే సర్ది ఉంచానండీ’ అంది చిరాగ్గా.‘అవునూ, పిల్లల బ్రష్‌లు, మెడికల్‌ కిట్‌ అన్నీ పెట్టావు కదా?’ మళ్లీ అడిగా... ‘చెప్పాను కదా అన్నీ సర్దానని... ఇంక బయలుదేరడమే ఆలస్యం. ‘అవునూ, మా ఫ్రెండ్‌ శ్రీను ఫోన్‌ ఏమైనా చేశాడా? అని అడుగుతుంటే వాళ్లు నేరుగా బస్టాండ్‌కు వస్తామని ఫోన్‌ చేశారు డాడీ అంటూ రుక్కు సమాధానమిచ్చింది. ‘జాను... పిల్లలక ...

Read more

వ్యాపారి తెలివి!

ఒక వజ్రాలవ్యాపారి, ఒక దొంగ రైలులో ఒకే బోగీలో ప్రయాణిస్తున్నారు. వజ్రాలవ్యాపారి దగ్గర విలువైన వజ్రాలు ఉండటం దొంగ పసికట్టాడు. ఎలాగైనా వాటిని కాజేయాలనుకున్నాడు. చీకటి పడింది. వ్యాపారి తన కోటును కొక్కానికి తగిలించి నిద్రకు ఉప్రకమించాడు. అర్ధరాత్రి దాటింది. ఆయన గాఢనిద్రలోకి వెళ్ళిపోగానే, అవకాశం కోసం చూస్తున్న దొంగ నిశ్శబ్దంగా లేచి వజ్రాల కోసం వ్యాపారి కోటు జేబు వెతికాడు. వజ్రాల సంచి కనిపించలేదు. గాఢనిద్రలో ఉన్న ...

Read more

బాలాజి

పూర్వం మాహారాష్ట్రలోని ఒక గ్రామంలో బాలాజీ అనే కుర్రాడు ఉండేవాడు. బీదవాళ్ళయినా అతని తల్లిదండ్రులు బాలాజీని బడికి పంపేవారు. అయితే బాలాజీకి కొంచెం మతిమరుపు ఉండేది. ఎంత ఎక్కువ చదివితే అంతే ఎక్కువగా మర్చిపోయేవాడు. తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేస్తున్నానని బాలాజీ చింతించేవాడు. ఒకరోజు బడిలో బాలాజీ ఒంటరిగా కూర్చుని ఆ రోజు మాస పరీక్షలో తనకు వచ్చిన తక్కువ మార్కుల గురించి చింతిస్తున్నాడు. సాంఘిక శాస్త్రాన్ని బోధించే ఉ ...

Read more

విద్య

ఒక ఊరిలో పూర్ణదత్తుడు అనే యువకుడు ఉండేవాడు. అతడికి చిన్నతనంలో చదువు అబ్బలేదు. తల్లిదండ్రులు అతడిని బడికి పంపించాలని ఎంత ప్రయత్నించినా పూర్ణదత్తుడు బడికి వెళ్ళేవాడు కాదు. దానితో అతనికి వయసు పెరిగిందే కానీ, వయసుకు తగ్గట్టుగా సరైన విద్య రాలేదు. పూర్ణదత్తుడిని అందరూ అజ్ఞానిగా, నిరక్షరాస్యుడిగా లెక్కగట్టేవారు. యుక్తవయసు వచ్చాక అతడికి పొరపాటు తెలిసి వచ్చింది. తోటివారు బుద్ధిగా చదువుకుని మంచి స్థాయిలో ఉండటం చూసి స ...

Read more

స్నేహితులు

ఒక అడవిలో ఒక జింక ఉండేది. ఒకసారి దానికి బాగా జబ్బు చేసి, బాగా నీరసించి, కదలలేని పరిస్థితి వచ్చింది. కోలుకోవడానికి కొంతకాలం పడుతుంది. అప్పటి వరకూ గడ్డికోసం నడవలేని ఆ జింక, కాస్త గడ్డి ఎక్కువగా ఉన్నచోటు వెతుక్కుని, అక్కడే విశ్రాంతిగా ఉంది. జింక అనారోగ్యంగా ఉందని అడవిలోని జంతువులన్నిటికీ తెలిసిపోయింది. జబ్బుతో విశ్రాంతి తీసుకుంటున్న జింకను చూసి పలకరించి పోదామని అడవిలోని జింకలు రాసాగాయి. తన కోసం జింకలు వచ్చినంద ...

Read more

స్నేహం

ఒక రైతు దగ్గర చాలా గాడిదలు ఉండేవి. మనుషుల్లాగే వాటిలో కొన్ని కష్టపడి పనిచేసేవి. మరికొన్ని సోమరిగా కాలం గడిపేవి. ఇంకొన్ని చిన్న చిన్న విషయాలకు చాలా భయపడేవి. మిగతావి ఎవరేమన్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండేవి. కొన్ని రోజుల తరువాత రైతు కొత్త గాడిదను కొనాలనుకున్నాడు. ఆ సంగతి తెలిసి అతని పొరుగున ఉన్న రామయ్య అనే అతను రైతు దగ్గరకు వచ్చాడు. ‘‘నువ్వు గాడిదను కొనబోతున్నావని విన్నాను. నా దగ్గర ఒక గాడిద ఉంది, కొంటా ...

Read more

మూడు చేపల కథ

ఒక చెరువులో మూడు చే పలుండేవి. ఇంకా చాలా చేపలున్నా అవి మూడు మాత్రం మంచి స్నేహితులు. వాటిలో ఒకటి జ్ఞాని. ఏదైనా పని చేసే ముందు ఆలోచించి చేయడం దానికి అలవాటు. రెండవ చేప తెలివి గలది. తన తెలివితో ఎటువంటి సమస్యనైనా పరిష్కరించేసేది. మూడవది అన్నిటికన్నా చిన్న చేప. జరిగేవన్ని ఎలాగూ జరుగక మానవు కదా, మరి ఎందుకు మనం శ్రమ పడాలి అన్న వాదం ఆ చేపది. అందుకని, ఎటువంటి సమస్య వచ్చినా జరిగేది జరుగుతుందని, ఏ ప్రయత్నము చెయ్యకుండా ఉ ...

Read more

యుద్ధం

ఒక నది ఒడ్డున రెండు కొండజాతులు నివసించేవి. నీటిప్రవాహానికి ఎగువ భాగంలో ఉన్న కొండజాతులు చేపలు పట్టుకోవడానికి నదిలో వలలు వేసేవారు. చేపలు వలలోకి రావడానికి పెద్దపెద్ద మొద్దులతో నీళ్ళను కొట్టేవారు. దానితో నీళ్ళు బురదగా మారేవి. నీటి ప్రవాహానికి దిగువ భాగంలోని కొండజాతులకు నీళ్లు పాడవడంతో కోపం వచ్చింది. ‘‘మేము తాగే నీటిని మీరు పాడు చేస్తున్నారు. మేము ఎలా బతకాలి? వెంటనే మీరు చేపలు పట్టడం మానెయ్యండి’’ అన్నారు. ‘‘చేపల ...

Read more

కప్పలరాజు

ఒక సరస్సులో చాలా కప్పలు ఉండేవి. అవి ఏ చీకూ చింతా లేకుండా హాయిగా కాలం వెళ్ళబుచ్చేవి. అయితే ఒక కప్ప ఏ విషయంలోనైనా అవునంటే మరొక కప్ప కాదనేది. దానితో చిన్న చిన్న తగాదాలు ఏర్పడేవి. దానితో కప్పలు తమను పరిపాలించడానికి బలమైన నాయకుడు ఉంటే బాగుండుననే అభిప్రాయానికి వచ్చాయి. వెంటనే అడవిరాజుకు ఒక విన్నపాన్ని పంపాయి. అడవిరాజు ఒక మొద్దును సరస్సులో పడేసి ‘‘ఇదే మీ రాజు’’ అని చెప్పాడు. దాన్ని చూడగానే ముందు కప్పలు భయపడ్డాయి. ...

Read more

అసూయ

ఒక రైతు దగ్గర ఒక గాడిద, మేక ఉండేవి. గాడిద రోజంతా పొలంలో కష్టపడి పనిచేసేది. గాడిద తినడానికి రైతు ఆహారం ఇచ్చేవాడు. మేకకు తన ఆహారం తాను వెతుక్కోవలసి వచ్చేది. పైగా యజమాని రోజూ గాడిదను మెచ్చుకోవడం విని మేకకు అసూయ కలిగింది. ‘ఒకవేళ గాడిద పనిచేయడం మానేస్తే యజమాని దాన్ని మెచ్చుకోవడం, ఆహారం పెట్టడం మానేస్తాడు’ అని అనుకుంది. ఒకరోజు అవకాశం చూసుకుని గాడిదను ఒక పెద్ద గుంతలోకి తోసేసింది. దానితో గాడిద గాయపడింది. రైతు వైద్య ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top