You Are Here: Home » చిన్నారి » కథలు (Page 2)

కథలు

అగాధ శిఖరం

గట్టిగా అలా కళ్ళు నులుముకొని అలా పడక కుర్చీలో కూలబడ్డాడు. కొంత అనిశ్చతి ఆయనగారిని వెంటాడుతూనే ఉంది. పెరుగుతున్న వయసు వెంట ప్రోది చేసుకొస్తూన్న అనుభవాల జడిలో తడిసి తర్వాత అనివార్యంగా సర్దుకోక తప్పడంలేదు. చెప్పాలంటే వెంగళరెడ్డి ఓ విధమైన డోలాయమాన స్థితిలో సతమతమవుతూనే ఉన్నాడు. ‘‘చౌదరి అన్నయ్యకు పురమాయించారట గదా! మసూరి బియ్యం బస్తా పంపించాడు. డబ్బులు ఇవ్వబోయాను. మేం చూసుకుంటాంలే అమ్మా! అన్నాడు’’. ‘‘పోనీ ఖరీదయినా ...

Read more

శిశిరం విడిచిన వసంతం

ఒక నిర్ణయానికి ఒక జీవితం బాగుపడాలి. కాని, జీవితం అడ్డం తిరగకూడదు. ఏళ్ళ తరబడి పెనవేసుకునివున్న బంధాలు తెగిపోకూడదు. పరిచయం అయిన కొత్తలో అనుమానాలు లేని జీవితాలు కాలగమనంలో వ్యక్తిత్వాలు బయటపడి మనఃస్పర్ధలతో స్నేహానికి మచ్చ ఏర్పడేట్లు ప్రవర్తించడం వారి వారి మధ్య అగాధాలు సృష్టింపబడ్తాయి. ఒక్కోసారి వాటికి వాళ్ళు కారణం కాకపోవచ్చు. అయి నా, విధి ఆడుతున్న ఒక్కో వింత నాటకంలో మనఃస్పర్థలు, మనుసుల్ని విరిగిపోయోలాచేస్తాయి. ...

Read more

నీ ప్రేమకై

పెద్దబంగ్లా... విశాలమైన ప్రాంగణం... చుట్టూ నారీఖేళ వృక్షాలు... వాటిి సేవ చేయడానికి ఒక నౌకరు. వసారాలో కూ ర్చోని పేపర్‌ చుస్తున్నాడు రాజేశ్వరరావు. భార్య లక్ష్మి కాఫీ కప్పుతో అక్కడికి వచ్చింది... ‘‘వినోద్‌ ఇంకా ఇంటికి రాలేదు లక్ష్మి... ఎక్కడికి వెళ్ళినట్లు’’ కాఫీ కప్పు అందుకుంటు అడిగాడు... ‘‘వాడు ఎప్పుడు వస్తాడో.. ఎప్పు డు వెళ్తాడో వాడికే తెలీనప్పుడు మనకు ఎలా తెలుస్తుంది’’ చలోక్తి విసిరింది లక్ష్మి. అంతలోగా తె ...

Read more

మచ్చ

దీపావళి పండుగ వస్తోంది చీర కొనుక్కోవాలి. ఔను తను జమ చేసిన డబ్బు ఎంత ఉంటుంది చూసుకోవాలి. ఇలా ఎన్నోసార్లు గుర్తొచ్చినపుడల్లా అనుకుంటూనే ఉంది రుక్మిణి. పక్కంటి పద్మిని చీర చూసినప్పటి నుండి అదే కోరిక మనసులో నాటుకుపోయింది. రుక్మిణికి అసలు చీర చూడకపోయిన బావుండు అని ఒకసారి చూసిందే బాగెైంది అని ఒకసారి ఇలా రకరకాలుగా ఆలోచిస్తూనే ఉంది అనుకుంటూనే ఉంది రుక్మిణి. ఆ సన్నివేశాన్ని మరోసారి తల్చుకుంది. ఆ రోజు ‘‘రుక్మిణీ... ఓ ...

Read more

భక్తి కథలు

(గతవారం తరువాయి)వైకుంఠంలో శేషపాన్పుపెై పవళించిన శ్రీమహావిష్ణువును కనులారాగాంచిన చిత్రరూపుడు సాష్టాంగ దండప్రమాణాలా చరించి, వినయంగా నిల్చున్నాడు. స్వామి వారు చిరునవ్వులు చిందిస్తూ, కైలాసవా సుడెైన శంకరుని యోగక్షేమాలు విచారిం చి, ఏమీ తెలియని అమాయకునిలా ‘ముఖ్యమైన ఏదెైనా దేవకార్యం మీద వచ్చావా!’ అని అడిగాడు. చిత్రరూపుడు వినయంగా విషయాన్ని తెలపడంతో శ్రీమహావిష్ణవు చిరుదరహాసంతో, జగన్మో హానాకరామైన తురగరూపాన్ని ధరించి క ...

Read more

బ్రతుకు బండి

రైల్వేస్టేషన్‌లో సూమారు గంటన్నర పాటు నుండి వెయిట్‌ చేస్తూనే వున్నా... ట్రైన్‌ రానేలేదు. లగేజ్‌లు మోస్తూ కొందరు, పిల్లల్ని ఎత్తుకొని వాళ్లు ఏడుస్తుంటే సముదాయిస్తు మరికొందరు, ఒక భాష వాళ్ళు కాదు, ఒక ఊరి వాళ్ళు కాదు. ఎక్కడెక్కడి వాళ్ళో... మొత్తం మీద స్టేషన్‌ కిక్కిరిసిపోయింది. చిల్లర వ్యాపారస్థుల గోల పడలేకపోతున్నాను. ఏది ఏమైనా తొందరగా ఊరు చేరుకోవాలి. ఒక పెద్దాయన కాస్త స్పీడుగా వస్తూనే... ‘‘ఆ పక్క స్టేషన్‌లో రైల ...

Read more

వజ్రాల హారం

ఒకనాటి సాయంత్రం మటిల్డా లూయీ ఒక్కతే తన ఇంట్లో చాలా దిగాలుగా కూర్చుంది. మటిల్డ లూయీ చాల అందమైన అమ్మాయి, కాని భగవంతుని చిత్రం ఆ అమ్మాయి చాల పేదరికం లో పుట్టింది. ఏ ధనవంతుల ఇంట్లో పుట్టి ఉంటె మటిల్డ లూయీ అందం ఆ నగరం అంత తెలిసేది మంచి మంచి నగలు, కళ్ళు చేదేరే బట్టలతో , పాలరాతి భవనాలలో ఉన్నట్లు అయితే ఆమె అందం అందరికి అసూయ నిచ్చేదేమో . దానికి విరుద్ధంగా చాల పేదరికం లో పుట్టటం తో విరిగిన కుర్చీలు, చినిగిన దుస్తులు ...

Read more

ఇద్దరు మిత్రుల కథ

విక్రమార్కుడు మళ్లీ రొటీన్‌గా శవాన్ని భుజాన వేసుకుని బంజారాహిల్స్‌ సమాధులవైపుగా వెళుతున్నాడు. జిడ్డు భేతాళుడు వస్తూనే విక్రమార్కుడిని చూసి ‘రొటీన్‌ తెలుగు సినిమా హీరోలా నువ్వలా శవాలను భుజాన వేసుకుని వెళుతుంటే నాకు నవ్వొస్తోంది. సరే నీ బాధ తెలియకుండా ఓ మాంచి కహానీ చెబుతాను మాట్లాడకుండా విను....ఆఖర్లో కౌన్‌ బనేగా కరోడ్‌పతి టైప్‌లో ప్రశ్నలుంటాయి కంగారు పడకు...త్రిలింగదీవి ప్రాంతంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ...

Read more

వెలుగే చీకటైతే…

‘‘అమ్మా... సేనికి నేనొత్తానే’’ మా అమ్మ సేనికి పోవడాన్కి సద్ది కట్టుకుం టుంటే అడిగితి. ‘‘యాల్లే, ఇంటి దగ్గర సదువుకుంటుండు’’ సద్దిగిన్నె నెత్తిమీద పెట్టుకుని, నీళ్ల బిందెల్ని తీసుకుని సేనికి పయనమాయ అమ్మ. నేనూ సేనికి పోవల్లని ఎదురుజూస్తాం టా. కాని అమ్మ నన్ను పిల్సుకోని పోదు. ఇపుడు అమ్మ మాట ఇనకుండ సేనికి పోవల్ల! సేన్లో నా ఫ్రెండ్సున్నారు. నేను సేనికి పోతే వాళ్ల మధ్య తిరుగుతూ, వాళ్లు గాలికి డాన్సేత్తుంటే సూ స్తం ...

Read more

పుట్టింటికి

వెంకటాపురం చేరాలంటే ఇంకా గంట న్నర పైనే పడుతుంది. టైము చూసు కున్నాడు. ఏడున్నరయింది. అసలే చలికాలం బయట అంతటా చీకటి కమ్మేసి ఉంది. ఏమీ కానరావడం లేదు. బస్సు బయలుదేరి పావు గంటయినా కాలేదు. చాలా అసహనంగా ఉంది వెంకట్రాదికి. అసలే పల్లె వెలుగు బస్సు. గతుకుల రోడ్డు ప్రయాణం. ఎవరైనా చేయి ఎత్తడం తరువాయి. అంగుళం కూడా ముందకు కదలడం లేదు. ఠక్కున ఆపి పడేస్తున్నాడు డ్రైవరు. డెభె్భై ఏళ్లు పైబడ్డ వయసులోని రుగ్మతలు వెంకటాద్రిని చుట్ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top