You Are Here: Home » చిన్నారి » కథలు

కథలు

ఇంకేం చర్చిస్తారు?

కొడవటిగంటి కుటుంబరావు దెయ్యాల పుస్తకం (తాత్విక వ్యాసాలు) నేను కూడా చదివాను. ఆ పుస్తకం గురించి రంగనాయకమ్మ (‘అక్షరం’ మార్చి 4) తక్కువే రాశారని చెప్పాలి. ఈ పుస్తకంలో ప్రతి పేజీలో దెయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు, జ్యోతిషాలు, దివ్యదృష్టులు, సోది చెప్పడాలు- ఇంకా ఇలాంటివే - అతీత శక్తులున్నాయని చెప్పడానికి కొన్ని వందల ఉదాహరణలు ఇచ్చారు. ‘రాబోయేది చెప్పడం ఎలా సాధ్యమవుతున్నదో శాస్తవ్రేత్తలకు తెలియదు. అందుచేత వారు వాటిని ...

Read more

పునాది

టెన్త్‌, టైప్‌ హయ్యర్‌ పాసయిన నాకు హైద రాబాదులో క్లర్క్‌-కమ్‌-టైపిస్ట్‌ ఉద్యోగం వచ్చింది. నన్నిక ఆడిట్‌ పార్టీలో వేశారు. తెలంగాణ తొమ్మిది జిల్లాలోని గవర్నమెంట్‌ ఆఫీసులు ఆడిట్‌ చేయాలి. మా పార్టీకి అధిపతి పాల్‌గారు. పార్టీలో మరిద్దరు ఆడిటర్లు కూడా వున్నారు. ఆ రోజుల్లో కంప్యూటర్లు లేవు. కాలుక్యులేటర్లు కూడా తక్కువలే. గుణకార, భాగహారాలు, కూడికలు, తీసివేతల అన్ని మనమే చేసుకోవాలి. వందల పేజీలు టైపు చేయవలసి వచ్చేది. ...

Read more

ఇదేం ప్రేమరా… బాబు..!

నేను ఈ లోకంలో వున్నానా? ఏమో... వున్నాననే అంటున్నారందరు... ‘‘రేయ్‌ వినయ్‌ ఎందుకలా అలా మూడీగా వున్నావ్‌? ఇంతకుమునుపు అందరితో కలిసి మాట్లాడేవాడివి’’. ఏమని చెప్పను. నాలో నేను లేనని చెప్పాలా? నా మనసు ఇంకొకరికి ఇచ్చేసానని చెప్పాలా? లేకా మౌనంగా వుండిపోయి... వారిని ఇబ్బంది పెట్టాలా? ఏమీ అర్థం కాలే దు... ఆకలి దప్పికలు లేని యోగిలా తయారయ్యాను. ‘‘ఒరేయ్‌... అన్నయ్యా... ఏమైందిరా నీకు... అరుస్తున్నా వినిపించుకోవేం...’’ అం ...

Read more

ఇదీ భారతం

ఊరు ఊరతంతా ఆయనగారికి డొల్లగా న్పిస్తోంది. దగాపడి దిగాలు చెందినట్లుంది. గ్రామకంఠం పీకనులిమి ప్రక్కకువిసిరేసి నట్లునిపిస్తోంది. పొరపొచ్చాల మాయలో కుళ్ళూ కుతంత్రాల సందిగ్దాన ఊరు నిర్వీర్య మయి నట్లుంది. తాతాలుతో బాటు ఆయన వర్గానికయితే మరీనూ... వాళ్ళదృష్టిలో ఊరుపోకడంతా ఛిద్ర మై పోతు న్నట్లు. ఆధిపత్యాలు, అధిక్షేపణలు ప్రజ్వరిల్లుతున్నట్లు అవినీతి రాజ్యమేలుతున్నట్లు ఇంకా ఇంకా ఎన్నోరుగ్మతలు! అవడానికి చిడిబోతు గ్రామమే ...

Read more

స్వయంకృతం

ఆంజనేయులు, సరస్వతమ్మలకు ఏకైక సంతానం అప్పలకొండ. సరస్వతమ్మ కనిపించిన ప్రతి రాయికీ ప్రణమల్లి, ప్రతి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తరువాత అప్పలకొండ ఆమె కడుపున పుట్టాడు. ఇప్పుడు అప్పలకొండకు ముపె్పై ఏళ్లు వచ్చాయి. అతనికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 24 సంబంధాలకు వెళ్లారు. ఆ సంబంధాలన్నింటిని అప్పలకొండ అసందర్భంగా మాట్లాడి, అక్కడ వెకిలి చేష్టలు చేసి చేతులారా పోగొట్టుకున్నాడు. ఈ రోజు అతన్ని 25వ ప ...

Read more

నీలిపావురం

నీలం రంగు పావురం గుర్‌... గుర్‌... మంటూ శబ్ధం చేసింది. భోజనం చేసి చేయి కడుక్కంటూ చూసాడు కిషన్‌. ‘ఆకలి మీదున్నట్టుంది’ అనుకొని కొన్ని గింజలు చల్లాడు. పావురం తినసాగింది. ఎక్కువ తిన్నట్టున్నాడు. ఆయాసపడుతూ ముందు గదిలోకి వచ్చి టి.వీ. చూడసాగాడు. మధ్నాహ్నం ఆఫీసుకు లంచ్‌ బాక్స్‌ పట్టుకెళతాడు. భార్యకు పూజలు, వ్రతాలు ఎక్కువ. తనకు ఇద్దరూ అమ్మాయిలే. పెద్దమ్మాయి ఇంజనీరింగ్‌ చదివి పెళ్ళికి సిద్దంగా వుంది. చిన్నమ్మాయి ఇంజ ...

Read more

ఒక ఊరి కథ

దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం... ఆ ఊరిని ఫ్యాక్షన్‌ భూతం కబలించింది. పచ్చగా వున్న ఊరిని, ఎర్రగా మార్చింది. భూ పంపకాల విషయంలో దొర్లిన పొర పాటుకు, పచ్చగడ్డి కూడ భగ్గున మండింది. రాజకీయ రొచ్చులో కూరుకుపోయింది. వర్గాలుగా చీలి పోయిన ఆ ఊరి జనం మధ్య మానవత్వం త లదించుకుంది. తెల్ల చొక్కాలు తిరాగాల్సిన ఊరి వీధుల్లో కాకీ చొక్కాల పహార పరుగులు పెట్టింది. నెత్తుటి కూడు తినే దుస్థితి దాపురిం చింది. కొద్ది రోజులు సద్దుమనిగ ...

Read more

కొత్త సూర్యోదయం

గురువారం... మిట్ట మధ్యాహ్నపు ఎండ మండిపోతూ నడి వేసవిని తలపిస్తోంది. సాయి బాబా గుడి జనంతో కిటకిటలాడుతోంది.మధ్యాహ్న ఆరతి పూర్తయింది. ఇహ భోజనాలు పెట్టడమే తరువాయి. భక్తులందరూ తిన్న తర్వాత బిచ్చగాళ్ళకు పెడతారు.రంగడికి కడుపు ఆకలితో నకనకలాడుతోంది. గుడికి దూరంలో విశాలంగా పరచుకున్న రావి చెట్టుకింద సొట్టలు పడిన సత్తుప్లేటు... చెంబు... చిన్న సంచితో కూర్చుని వున్నాడు. చుట్టూ చుశాడు తనలాగే చుట్టుతా కమ్ముకుని వున్నారు బిచ ...

Read more

మనసు మూలిగింది

మొబైల్ల అలారం మోగుతోంది. మబ్బుల అయిదు గంటలకు అయిలింపులతోటి ఒల్లు విరుచుకుంట లేచిన. బాత్రూంకు పోయి ఫ్రెష్‌ అప్‌ అయి మా ఆవిడను లేపిన వాకింగ్‌ కోసమని. ‘‘కొద్దిసేపాగయ్య’’ నిద్రలోనే మూలిగింది. ‘‘తెల్లారుతోంది. వాకింగ్‌ లేటవుతదే’’ అంటూ మళ్ళీ లేపిన. గుణుక్కుంటూ లేచింది. బాత్రూం పోయచ్చింది. చీర, తల సర్దుకొని వాకింగ్‌కు బయలుదేరింది. మా ఆవిడకకు ఉదయము నడక అలవాటు లేదు. ఈ మధ్యనే ఆమెకు షుగర్‌ వచ్చింది. ఆరోగ్య దృష్ట్యా డా ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top