You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు (Page 5)

ఆరోగ్య సూత్రాలు

విశ్రాంతితో బాగుపడే గుండె..!

విశ్రాంతితో బాగుపడే గుండె..!   గుండె కండరాలు దెబ్బతింటే గుండె నొప్పి వంటివి కలగవచ్చు. అటువంటి కండరాలకు తగినంత విశ్రాంతి ఇవ్వగలిగితే అవి మళ్ళీ తమను తామే బాగు చేసుకుంటాయని కొత్త పరిశోధనలు తెలుపు తున్నాయి. ఇంపీరియల్‌ కాలేజ్‌ అధ్యయనం ప్రకారం ఎలుకలలో ఇటువంటి ఫలితాలు వచ్చాయి. గుండె కండరాలు మరీ బలహీనంగా ఉన్నా, లేదా అవి మరీ గట్టిగా ఉన్నా రక్తాన్ని సక్రమంగా సరఫరా చేయడంలో విఫలమవుతాయి. అదే హార్ట్‌ అటాక్‌కి కారణమవుతుంద ...

Read more

పొట్ట తగ్గించే ధనురాసనం

పొట్ట తగ్గించే ధనురాసనం ధనుస్సును పోలి ఉన్నందున ఈ ఆసనానికి ధనురాసనం అనే పేరు వచ్చింది. ఆసనం అనే ప్రక్రియ కొద్దిగా క్లిష్టంగా ఉన్నప్పుడు ప్రారంభంలో అందరూ చేయలేరు. పూర్తి ఆసన స్థితిని కాకుండా మొదట సులభమైన స్థితిని ప్రయత్నించి, సాధన తరువాత పూర్ణస్థితిని చేరుకోవచ్చు. రాలేదు అని అనుకోకుండా మొదట అర్ధ ధనురాసనమును ప్రయత్నించి తరువాత పూర్ణ ధనురాసనం చేయవచ్చు. అర్ధ ధనురాసనం (ఏకపాద ధనురాసనం) ముందుగా బోర్లా పడుకోవాలి. చ ...

Read more

కొవ్వు తగ్గించే ఆహరం

కొవ్వు తగ్గించే ఆహరం సరైన ఆరోగ్య నియమాలు పాటించకపోవడం... జీవన విధానంలో వస్తున్న మార్పులు.. పని వేళల్లో తేడాలు అనారోగ్యానికి దారి తీస్తున్నాయి. దీంతో ఊబకాయం, శరీరంలో అధిక కొవ్వు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలాంటప్పుడు సరైన ఆహార నియమాలు పాటించకుండా ఎన్ని వర్కవుట్స్ చేసినా ఫలితం శూన్యం శరీరంలో అధిక కొవ్వు చేరకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న సలహాలు. కోడి గుడ్డు గుడ్డులో ...

Read more

సైన సైటిస్ సతాయిస్తుందా?

సైన సైటిస్ సతాయిస్తుందా? చల్లగాలి తగిలినా, దుమ్ము, ధూళిలో తిరిగినా తుమ్ములు రావడం, జలుబు చేయడం సహజమే. కాని కాలంతో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా ‘సైనసైటిస్’ తో బాధపడేవాళ్లు కూడా ఉంటారు. వర్షాకాలంలో, చలికాలంలో ఈ వ్యాధి తీవ్రత మరీ ఎక్కువ. కపాలం లోపలి భాగాలలో గాలితో నిండిన కవాటాలు(సైనస్) ఇన్‌ఫెక్షన్‌కు గురవ్వడం మూలాన కలిగే బాధే సైనసైటిస్. దీనికి కూడా జలుబును అంటించే వైరస్, క్రిములే ప్రధాన కారణం. లక్షణాలు: అస్ ...

Read more

పొగ మానితే కొత్త ఊపిరి

పొగ మానితే కొత్త ఊపిరి చల్లగాలి వణుకునే కాదు.. అనారోగ్యాలనూ మోసుకురావచ్చనడానికి నిదర్శనం సీవోపీడీ - క్రానిక్ అబ్‌వూస్టక్టివ్ పల్మనరీ డిసీజ్. చల్లగాలిలో కనిపించే ఈ వ్యాధి పొగరాయుళ్లను మరింత బాధిస్తుంది. నేడు ‘‘ప్రపంచ సీవోపీడీ దినం’’ సందర్భంగా శ్వాసనే భారం చేసే ఈ వ్యాధి గురించి... శరీరంలోని అణువణువుకూ ప్రాణవాయువైన ఆక్సిజన్‌ని అందించే కీలక అవయవాలు ఊపిరితిత్తులు. వీటిలో ఉండే వాయునాళాల నుంచి గాలి బయటకు వస్తుంది. ...

Read more

బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్

బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఆఫీస్‌కు రడీ అవ్వడమో... పిల్లలను స్కూల్స్‌కు రడీ చేయడమో... హడావిడిలో పడి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఉంటాం. ఏముందిలే కాసేపైతే లంచ్ చేసేదే కదా అనుకుని ఏదో ఒకటి తినేసి ఊరుకుంటాం. రాత్రి డిన్నర్ నుంచి మార్నింగ్ వరకూ ఏమీ తినకుండా ఉంటాం. ఈ సమయమే ఎక్కువ. మళ్లీ బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయకుండా ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యంగా ఉండేందుకు సులభంగా చేసుకోగలిగే కొన్ని మార్నింగ్ బ్రేక్‌ఫాస ...

Read more

ఫుడ్ ఫర్ హెల్త్

ఫుడ్ ఫర్ హెల్త్ సర్వరోగ నివారిణి... నిమ్మ నిమ్మ ఆరోగ్య ప్రదాయని. 100 గ్రాముల నిమ్మపండు నుంచి 40 కేలరీల శక్తి లభిస్తుంది. నిమ్మలోని పోషక విలువలు మెదడు చురుకుగా పనిచేయడానికి, దంతాలు ఎముకలు పటిష్టంగా పని చేయడానికి ఎంతగానో సహకరిస్తాయి. రోజూ నాలుగుసార్లు నిమ్మరసం తాగితే పచ్చ కామెర్ల వ్యాధి తగ్గుముఖం పడుతుంది. వేడి నీటిలో నిమ్మరసం పిండి తాగినట్టయితే ఉబ్బసం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ లోపాలకు నిమ్మ మంచి ఔష ...

Read more

ఫలాల ఫలితం…

ఫలాల ఫలితం... పళ్లను చేర్చకుండా ఆహారం ఎప్పటికీ సమతుల్యమవదు. కాబట్టి ఆహారంలో పండ్లు తప్పనిసరి. పండ్లు తినడం అనగానే మార్కెట్ నుంచి పండ్లు కొనితెచ్చి కోసుకుని తినడం మాత్రమే కాదు. మనం తీసుకుంటున్న పండ్లు ఎప్పుడు, ఎంత మోతాదులో, ఎలా తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమే. కాబట్టి పండ్లు తినే పద్ధతి గురించి తెలుసుకుందాం. ఎప్పుడు భోజననాంతరం పండ్లు తీసుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. పండ్లు ఎప్పుడూ ఖాళీ కడుపుతో తింటే చాల ...

Read more

బిపికి చెక్ చెప్పేద్దాం..

బిపికి చెక్ చెప్పేద్దాం.. గుండె, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలకు దారితీసేది అధిక రక్తపోటు. రక్తపోటు అదుపులో లేకపోవడం వల్ల మెదడు రక్తనాళాల్లో కూడా సమస్యలు తలెత్తుతాయి. ఇలా గుండె, మెదడు, కిడ్నీల లాంటి ప్రధాన అవయవాలను అనారోగ్యంలో పడేసే బీపీని మ ఆహారంతోనే అదుపులో ఉంచుకోవచ్చు. - పాలకూరలో ఫోలేట్, ఐరన్, విటమిన్-సి అధికంగా ఉంటాయి. కాబట్టి పాలకూర, ఇతర ఆకుకూరలు రక్తపోటుకు మందుగా పనిచేస్తాయి. - అరటిలో ఉండే పొటాషియం రక ...

Read more

డయాబెటిస్-హోమియో

డయాబెటిస్-హోమియో ఈ రోజుల్లో అన్ని వయసుల వారిని బాధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో డయాబెటీస్ ముఖ్యమైనది. మారిన జీవనశైలి, ఆహారఅలవాట్లు, మానసిక ఒత్తిళ్ళు, స్థూలకాయం జన్యుపరంగా వచ్చే డయాబెటిస్ కారణంగా నరాల సమస్యలు ఏర్పడి తత్ఫలితంగా శరీరంలోని అనేక అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. శరీరానికి అవసరమైన ఇన్సలిన్‌ను పాంక్రియాస్ ఉత్పత్తి చేయకపోవడం లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను శరీరం సమర్థవంతంగా ఉపయోగించుకోకపోవడం వల్ల ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top