You Are Here: Home » ఇతర » తెలుగు వెలుగు బ్రౌన్‌

తెలుగు వెలుగు బ్రౌన్‌

1825లో దాదాపు అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి, నేటి వెైభవా నికి కారణబూతమైనవాడు చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు, తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే ప్రచురించారు. బ్రౌన్‌ డిక్షనరీని ఇప్పటికీ తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ప్రముఖ బ్రిటిష్‌ అధికారులలో బ్రౌన్‌ ఒకరు.

charతాళపత్రాలలో శిధిలమైపోతున్న ఎన్నో విలువెైన గ్రంథాలను వెలుగులోకి తీసుకువచ్చిన ఆం ధ్ర భాషోద్దారకుడు బ్రౌన్‌. నవ్యాంధ్ర భాషా సాహిత్య నిర్మాత. 1798 నవంబరు 10న కలకత్తాలో జన్మిం చిన చార్లెస్‌ ఫిలిఫ్‌ బ్రౌన్‌ తన 14 ఏట తండ్రి చనిపో వడంతో ఇంగ్లాండ్‌ వెళ్ళిపోయారు. చదువు పూర్తి చేసుకుని 1817లో కుంఫిణీ ఉద్యోగిగా మన దేశం వచ్చారు. మద్రాసులో ఉద్యోగం చేస్తూ అందులో భాగంగా తెలుగు భాషను నేర్చుకున్నారు. అయితే తెలుగు భాష నేర్చుకోవడానికి ఒక శాస్త్రీయ పద్దతి అనేది లేకపోవడం గమనించిన బ్రౌన్‌ భాషను సంస్క రించడానికి పూనుకున్నారు. ఆ ప్రయత్నంలో పట్టు దలతో తెలుగును క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అనేక వ్రాత ప్రతులను సేకరించి వాటిని పరిష్కరించి మేలు ప్రతులను వ్రాయడానికి తన స్వంత ఖర్చుతో ఎందరో పండితులను నియమించారు. 1822లో బందరుకు అసిస్టెంటు జడ్జిగా బదిలీకావడం మరింత కలిసి వచ్చింది. మద్రాసులో ఉండగా శిథిలావస్థలో ఉన్న మనుచరిత్ర, వసుచరిత్ర, భాగవత, పలనాటి వీరచరిత్ర, తారాశశాకం మొదలెైన గ్రంథాలను సేకరించి మేలు ప్రతులను వ్రాయించాడు. అప్పట్లో మనుచరిత్ర సంపూర్ణ ప్రతులు ఆంధ్రదేశంలో నాలుగు మాత్రమే ఉండేవని ఆయన రాతలను బట్టి తెలుస్తోంది. చాలా గ్రంథాలను సంస్కరించి భధ్రపర చడంతో బాటు వాటిలో కొన్నిటికి ఇంగ్లీషూలో అను వాదాలు కూడా చేశారు.

1824లో అనుకోకుండా వేమన పద్యాల గురించి తెలుసుకుని వాటిని సేకరించడానికి పూనుకున్నారు. 1829లో కొన్ని పద్యాలకు ఆంగ్లానువాదం చేసి ప్రచురించారు. తర్వాత చాలా పద్యాలు సేకరిం చారు. మధ్యలో 1834 నుండి 1837 వరకూ ఇం గ్లాండ్‌ వెళ్ళినా తెలుగు భాషా శోధన సాగించారు. తెలుగు భాషకు ఆంగ్లంలో వ్యాకరణాన్ని, తెలుగు సాహిత్యంలో చంధశాస్త్ర వివరణ గ్రంధాన్నీ బ్రౌన్‌ అందించాడు. ఆయనకు అజరామర కీర్తిని తెచ్చిపె ట్టిన గ్రంథాలు ఇంగ్లీషూ తెలుగు, తెలుగు ఇంగ్లీషూ నిఘంటువులు. ఈ నాటికీ అవి ప్రామాణిక గ్రం థాలే. 1852లో వీటిని వెలువరించారు.1884లో ఆయన చనిపోయే వరకూ కూడా ఆ నిఘంటువులను పునర్విమర్శ చేస్తూ ఆధునీకరి స్తూనే ఉన్నారు.ఆయన చేసిన తెలుగు భాషా సార స్వతి సేవ ఆయనకు శాశ్వత కీర్తి ప్రతిష్టలను అం దించింది. తెలుగు భాష ఉన్నంత వరూ బ్రౌన్‌ దొర గుర్తుండిపోతాడు.విదేశీయుడెై నా తెలుగు వారెవ రూ చెయ్యని, చెయ్యలేని భాషాసేవ బ్రౌన్‌ చేశాడు. ఆయన లేకపోతే వేమన పద్యాలు, పురాతన గ్రం థాలు మనకి దక్కేవి కాదేమో… అందుకు తెలుగు జాతి మొత్తం ఆయనకు సలాం చేయవల్సిందే.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top